ప్రత్యేకత సంతరించుకున్నరోజులను గూగుల్ తన డూడుల్ స్లైడ్ షోతో తెలియపరుస్తుంది. ఆ రోజు ప్రాముఖ్యతను ఈ డూడుల్ షో మనకు స్పురింపజేస్తుంది. ఇంతవరకు మనం ఎన్నో పుస్తకాల గురించి విన్నాం. ఎందరో రచయితలు ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు.. వాటిల్లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలూ ఉన్నాయి. కానీ ఈరోజు గూగుల్ స్లైడ్ షో ఒక యువతి రాసిన డైరీని దాని సారాంశం గురించి తెలియజేసింది. ఏంటా డైరీ? ఏమిటీ దాని ప్రత్యేకత? ఎందుకు గూగుల్ సైతం ఆ డైరీకి ప్రాముఖ్యత ఇచ్చిందో తెలుసుకుందాం!
వివరాల్లోకెళ్తే...హోలో కాస్ట్ బాధితురాలు (జాతి ప్రక్షాళన లేదా సాముహిక విధ్వంసం) అన్నే ఫ్రాంక్ జ్ఞాపకాలకు సంబంధించిన డైరీ. ఈ డైరీ ప్రచురణకు 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా గూగుల్ ఈ అందమైన డూడుల్ షోతో తెలియపరిచింది. ఈ డూడుల్‌ని ఆర్ట్ డైరెక్టర్ థోకా మేర్ రూపొందించారు. అన్నే ఫ్రాంక్ కేవలం15 ఏళ్ల వయసులో ఈ డైరీని రాసింది. ఆమె యూదు డచ్ జర్మన్.
అన్నే ఫ్రాంక్ జూన్ 12, 1929న జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఒట్టో, ఎడిత్ ఫ్రాంక్‌లకు జన్మించారు. ఐతే ఆమె కుటుంబం నాజీ పార్టీ చేస్తున్న హింస, వివక్షత నుంచి తప్పించుకోవడానికి నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌కు తరలివెళ్లింది. ఆమెకు 10 ఏళ్ల వయసులో ఉండగా రెండోవ ప్రపంచ యుద్ధం రాజుకుంది. దీంతో అన్నే కుటుంబం ఆమె తండ్రి కార్యాలయంలోని రహస్య ప్రదేశంలో తలదాచుకుంది.
ఐతే నాజీ సీక్రెట్ సర్వీస్ వారిని గుర్తించి నిర్బంధానికి తరలించింది. ఆమె 15 ఏళ్ల వయసులో ఎదుర్కొన్న అవమానీయ పరిస్థితులును, సంఘటనలను తన డైరీలో పొందుపరిచింది. ఆ తర్వాత ఆ డైరీని పుస్తకంగా ప్రచురించారు. కాలక్రమేణ నాన్ ఫిక్షన్ రచనలలో ఒకటిగా మారింది. అంతేకాదు 80 కంటే ఎక్కువ భాషల్లో అనువదింపబడిన అన్నే ఫ్రాంక్ జ్ఞాపకాల దొంతర. నాటి వివక్ష, దౌర్జన్యం, భయంకరమైన ప్రమాదాల గురించి రానున్న తరాలు తెలుసుకునేలా అవగాహన కల్పించడానికి ఒక ముఖ్య సాధనంగా ఉపకరిస్తుంది.
Dear Kitty,
— Google India (@GoogleIndia) June 25, 2022
Today, we are revisiting the day #AnneFrank’s greatest wish came true.
Our #GoogleDoodle marks the day ‘The Diary of a Young Girl’ was published, which held a first-hand account of Anne about the years she spent in hiding: https://t.co/kNmBipFoUb. pic.twitter.com/je8SkNuqpF
Comments
Please login to add a commentAdd a comment