diary written
-
గూగుల్ మెచ్చిన డైరీ... నాటి అమానవీయ పరిస్థితులకు అద్దం పట్టేలా..
ప్రత్యేకత సంతరించుకున్నరోజులను గూగుల్ తన డూడుల్ స్లైడ్ షోతో తెలియపరుస్తుంది. ఆ రోజు ప్రాముఖ్యతను ఈ డూడుల్ షో మనకు స్పురింపజేస్తుంది. ఇంతవరకు మనం ఎన్నో పుస్తకాల గురించి విన్నాం. ఎందరో రచయితలు ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు.. వాటిల్లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలూ ఉన్నాయి. కానీ ఈరోజు గూగుల్ స్లైడ్ షో ఒక యువతి రాసిన డైరీని దాని సారాంశం గురించి తెలియజేసింది. ఏంటా డైరీ? ఏమిటీ దాని ప్రత్యేకత? ఎందుకు గూగుల్ సైతం ఆ డైరీకి ప్రాముఖ్యత ఇచ్చిందో తెలుసుకుందాం! వివరాల్లోకెళ్తే...హోలో కాస్ట్ బాధితురాలు (జాతి ప్రక్షాళన లేదా సాముహిక విధ్వంసం) అన్నే ఫ్రాంక్ జ్ఞాపకాలకు సంబంధించిన డైరీ. ఈ డైరీ ప్రచురణకు 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా గూగుల్ ఈ అందమైన డూడుల్ షోతో తెలియపరిచింది. ఈ డూడుల్‌ని ఆర్ట్ డైరెక్టర్ థోకా మేర్ రూపొందించారు. అన్నే ఫ్రాంక్ కేవలం15 ఏళ్ల వయసులో ఈ డైరీని రాసింది. ఆమె యూదు డచ్ జర్మన్. అన్నే ఫ్రాంక్ జూన్ 12, 1929న జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఒట్టో, ఎడిత్ ఫ్రాంక్‌లకు జన్మించారు. ఐతే ఆమె కుటుంబం నాజీ పార్టీ చేస్తున్న హింస, వివక్షత నుంచి తప్పించుకోవడానికి నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డామ్కు తరలివెళ్లింది. ఆమెకు 10 ఏళ్ల వయసులో ఉండగా రెండోవ ప్రపంచ యుద్ధం రాజుకుంది. దీంతో అన్నే కుటుంబం ఆమె తండ్రి కార్యాలయంలోని రహస్య ప్రదేశంలో తలదాచుకుంది. ఐతే నాజీ సీక్రెట్ సర్వీస్ వారిని గుర్తించి నిర్బంధానికి తరలించింది. ఆమె 15 ఏళ్ల వయసులో ఎదుర్కొన్న అవమానీయ పరిస్థితులును, సంఘటనలను తన డైరీలో పొందుపరిచింది. ఆ తర్వాత ఆ డైరీని పుస్తకంగా ప్రచురించారు. కాలక్రమేణ నాన్ ఫిక్షన్ రచనలలో ఒకటిగా మారింది. అంతేకాదు 80 కంటే ఎక్కువ భాషల్లో అనువదింపబడిన అన్నే ఫ్రాంక్ జ్ఞాపకాల దొంతర. నాటి వివక్ష, దౌర్జన్యం, భయంకరమైన ప్రమాదాల గురించి రానున్న తరాలు తెలుసుకునేలా అవగాహన కల్పించడానికి ఒక ముఖ్య సాధనంగా ఉపకరిస్తుంది. Dear Kitty, Today, we are revisiting the day #AnneFrank’s greatest wish came true. Our #GoogleDoodle marks the day ‘The Diary of a Young Girl’ was published, which held a first-hand account of Anne about the years she spent in hiding: https://t.co/kNmBipFoUb. pic.twitter.com/je8SkNuqpF — Google India (@GoogleIndia) June 25, 2022 -
సంచలన కేసులో కీలక మలుపు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో సంచలనం రేపిన కుటుంబం ఆత్మహత్యల కేసు కీలక మలుపు తిరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 11 మందిని ఆత్మహత్యలకు ప్రేరేపించినట్లు అనుమానిస్తున్న ఓ మహిళను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. తాంత్రిక పూజల వెనుక ఆ మహిళ హస్తం ఉందన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. తండ్రి తమను కాపాడతాడని భాటియా కుటుంబం నమ్మేది. ఓ కప్పులో నీళ్లు ఉంచితే.. అది రంగు మారగానే నాన్న వచ్చి కాపాడతాడని బురారీ ఏరియాకి చెందిన లలిత్ భాటియా(45) తన కుటుంబాన్ని నమ్మించాడు. ఈ క్రమంలో తాంత్రిక పూజలు చేసిన అనంతరం కుటుంబం మొత్తం గత ఆదివారం సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. అయితే ‘గీతా మా’ అనే మహిళ వీళ్లను తాంత్రిక పూజల దిశగా నడిపించినట్లు అనుమానాలున్నాయి. మరోవైపు కుటుంబమంతా ఆత్మహత్య చేసుకున్న తర్వాత ప్రధాన ద్వారం తెరిచి ఉండటంతో పూజలు చేసిన వ్యక్తి ఆ మార్గం గుండానే వెళ్లిపోయి ఉండొచ్చన్న అనుమానాలున్నాయి. ఈ కేసుకు సంబంధించి 12వ వ్యక్తి మిస్టరీ చేధించే క్రమంలో గీతా మాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసుకు సంబంధించి ఓ డైరీని సేకరించిన పోలీసులు, దాని ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎవరీ గీతా మా...? లలిత్ భాటియా కుటుంబానికి, పోలీసులు అదుపులోకి తీసుకున్న గీతా మాకు సంబంధం ఉంది. భాటియా కుటుంబం ఉంటున్న ఇంటిని ఓ కాంట్రాక్టర్ నిర్మించారు. ఆ కాంట్రాక్టర్ కూతురే గీతా మా కావడం గమనార్హం. ఆమెకు లలిత్ భాటియాకు సన్నిహిత సంబంధాలున్నాయని సమాచారం. ఏదైన కారణంతో భాటియా కుటుంబం తమకు తామే బలవన్మరణానికి పాల్పడేలా చేసి ఉండొచ్చునేమోనని గీతా మాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత కథనాలు 11 మంది మరణం: అతడే సూత్రధారి బురారీ కేసులో 12వ వ్యక్తి?? తండ్రి కాపాడుతాడని... -
తండ్రి కాపాడుతాడని...
న్యూఢిల్లీ: దేశరాజధానిలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద రీతిలో చనిపోయిన కేసు మరో మలుపు తిరిగింది. ఆత్మహత్య సందర్భంగా చనిపోయిన తండ్రి తమను కాపాడతాడని భాటియా కుటుంబం నమ్మేదని ఇంట్లో పోలీసులకు లభ్యమైన డైరీల్లో ఉంది. ఈ క్రతువులో భాగంగా ‘ఓ కప్పులో నీళ్లు ఉంచండి. అది రంగు మారగానే నేను వచ్చి మిమ్మల్ని కాపాడతాను’ అని లలిత్ భాటియా(45)తో ఆయన తండ్రి అన్నట్లు వీటిలో ఉంది. జూన్ 30న(శనివారం) చివరిసారిగా రాసిన డైరీలో ఈ క్రతువుల్ని ‘దేవుడి దగ్గరకు దారి’గా లలిత్ అభివర్ణించాడు. కొన్నేళ్ల క్రితం చనిపోయిన తండ్రి తనకు కన్పిస్తున్నారనీ, ఆయన సూచనలతో మోక్షం కోసం ఈ క్రతువును పాటించినట్లు లలిత్ రాసుకున్నాడు. మరోవైపు భాటియా కుటుంబం ఆత్మహత్యకు చేసుకుంటున్న ఏర్పాట్లు ఎదురింటివారు అమర్చిన సీసీటీవీలో నమోదయ్యాయి. దీన్ని ఓ జాతీయ మీడియా సంస్థ బుధవారం ప్రసారం చేసింది. తాంత్రిక క్రతువులో భాగంగా భాటియా కుటుంబం పెద్ద కొడలు సవిత, ఆమె కుమార్తె నీతూలు శనివారం రాత్రి 10 గంటలకు ఐదు కుర్చీలను ఇంట్లోకి తీసుకెళ్లినట్లు వీడియోలో ఉంది. మరో 15 నిమిషాలకు ఉరి వేసుకునేందుకు కావాల్సిన వైర్లను శివమ్(15), ధ్రువ్(12)లు తీసుకొచ్చారు. కాగా, ఈ దారుణం జరిగిన రోజున బయటివారెవరూ భాటియా ఇంట్లోకి వెళ్లలేదని పోలీసులు స్పష్టం చేశారు. బురారీ ఘటనలో చనిపోయిన శివమ్(15), ధ్రువ్(15) చదువులో ఎప్పుడూ చురుగ్గానే ఉండేవారని ఢిల్లీకి చెందిన వీరేంద్ర పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయుడు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సంఘటన జరిగిన తీరుతెన్ను ఇదే.. శనివారం రాత్రి 10 గంటలు: పెద్ద కోడలు సవిత, ఆమె కుమార్తె నీతూ ఆత్మహత్య కోసం కుర్చీలు తెచ్చారు. ► 10:15గంటలు–ధ్రువ్, శివమ్లు ఉరి కోసం వైర్లను తీసుకొచ్చారు. ► 10:39– ఆర్డర్ చేసిన 20 రొట్టెల్ని ఓ వ్యక్తి డెలివరీ చేశాడు ► 10:57– పెద్ద కుమారుడు భవనీశ్ ఇంట్లోని కుక్కను షికారుకు తీసుకెళ్లాడు. ► 11:04– కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం ► 5.56 గంటలు– పాలవాడు క్యాన్లను ఇంటిదగ్గర పెట్టివెళ్లాడు. ► 7.14– పొరుగునే ఉన్న ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లి మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. -
మనోహర్ పారికర్ రాయని డైరీ
కాంటే సే కాంటా నికల్నా. ముల్లును ముల్లుతోనే తీయాలి. డి.ఆర్.డి.ఒ. డైరెక్టర్స్ కాన్ఫరెన్స్‌కు వెళ్లినప్పుడు ఆ కాంపౌండ్‌లో నా కాలికి ముల్లు గుచ్చుకుంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న మాట అప్పుడు గుర్తుకు రాలేదు. చేత్తో తీయబోతే లోపలికి వెళ్లిపోయింది! ఇప్పుడు నొప్పెడుతోంది. పాపం అప్పటికీ పరుగెత్తుకొచ్చాడు క్రిస్టఫర్... ‘క్యా హువా మంత్రీజీ’ అంటూ. కాల్లో ముల్లు దిగింది, దాన్ని తీయడానికి మంచి ముల్లు ఏదైనా దొరుకుతుందేమో చూడమన్నాను. ‘ముల్లెందుకు మంత్రీజీ, ల్యాబ్‌లో ఫోర్సెప్స్ ఉంటుంది పట్రమ్మంటారా’ అన్నాడు. ‘ముల్లును ముల్లుతోనే తియ్యాలని కదయ్యా నా ఉద్దేశం. అర్థం చేసుకోలేకపోతే ఎలా అంత పెద్ద డి.ఆర్.డి.ఒ. కి హెడ్డుగా ఉండి’ అన్నాను. హర్ట్ అయినట్లున్నాడు! ఈ మనుషులు ఇంత ఫ్రీక్వెంట్‌గా ఎందుకు హర్ట్ అవుతుంటారో అర్థంకాదు. ఒకసారి, రెండుసార్లు! మాటిమాటికీ హర్ట్ అవుతూపోతుంటే ఎలా? హర్ట్ కానివాళ్లను కూడా హర్ట్ చేయగల చిదంబరంలాంటి వాళ్లను ఇక వీళ్లెలా తట్టుకుంటారో మరి. ఆ మధ్య నన్ను హర్ట్ చెయ్యాలని చూశాడు చిదంబరం. టైస్టుల్ని టైస్టులతోనే ఏరిపారేయాలి అన్నందుకు! టెరిబుల్ స్టేట్మెంట్ ఇచ్చానట! దాన్ని వెనక్కి తీసుకోమంటాడు. ఇచ్చేది తీసుకోడానికా! డిఫెన్స్ మినిస్ట్రీని తీసుకెళ్లి డిఫెన్స్‌లో పడేసుకోడానికా? అవతలివాడు టైస్టును పంపుతుంటే వాడి మీద పోరాటానికి నేను నా సైనికుడిని ఎందుకు పంపుతాను? టైస్టునే పంపుతాను. సింపుల్ లాజిక్ కదా! పవర్ పోయాక కాంగ్రెస్ వాళ్లకి విల్ పవర్ కూడా పోయినట్లుంది. ఏదేదో మాట్లాడేస్తున్నారు. క్రిస్టఫర్, నేను నడుస్తున్నాం. ‘ఇక్కడ ముల్లు దొరకడం కష్టం మంత్రీజీ’ అంటున్నాడు క్రిస్టఫర్! ప్రకృతిలో ముళ్లే లేవా అన్నాన్నేను. మీరు వస్తున్నారని చెప్పి ప్రకృతినంతా నిన్ననే క్లీన్ చేశాం మంత్రీజీ అన్నాడు క్రిస్టఫర్. క్లీన్ చేశాకే కదా నాకు ముల్లు గుచ్చుకుంది. గుచ్చుకోడానికి ముల్లు ఉండి, గుచ్చుకున్న ముల్లును తీయడానికి ముల్లు లేకపోవడం ఏమిటి?! క్రిస్టఫర్ చేతులు నలుపుకుంటున్నాడు. ‘నీకేమైంది? చేతికి ముల్లు గుచ్చుకుందా.. ప్రకృతిని క్లీన్ చేయిస్తుంటే?’ అన్నాను. ‘లేదు మంత్రీజీ’ అన్నాడు. మరి! ‘బడ్జెట్ లేదు మంత్రీజీ’ అన్నాడు. చైనా ట్వంటీ పర్సెంట్ ఖర్చుపెడుతుంటే, మనం ఫైవ్ పర్సెంటే ఖర్చుపెడుతున్నామట. ‘సరే, చూద్దాం. ఉన్న బడ్జెట్‌తోనే కాంపౌండ్‌లో అక్కడక్కడా ముళ్ల చెట్లను పెంచండి’ అని చెప్పి వచ్చేశాను. ముల్లును తీస్తేనేగానీ నాకీ రాత్రి నిద్రపట్టేలా లేదు. రామ్‌దేవ్‌బాబాకి లైన్ కలపమన్నాను. గోవాలో ఉన్నాట్ట. గోవాలో బాబాకేం పని! నాకు తెలియని బాబానా? నాకు తెలియని గోవానా? లైన్లోకి వచ్చాడు. ‘బాబాజీ.. ముల్లుని ముల్లుతో కాకుండా ఇంకెలా తీయొచ్చు’ అని అడిగాను. రుగ్వేదాన్ని తిరగేసి చెప్తానన్నాడు. ‘అందులో ఉంటుందా’ అని అడిగాను. ‘లేకున్నా నష్టం లేదు. నా దగ్గర ఎలాగూ ఆయుర్వేదం ఉంది’ అన్నాడు. గ్రేట్ గురూజీ! - మాధవ్ శింగరాజు