పునర్నిర్మాణంలో.. భాగస్వాములు కావాలి
- ఉద్యోగులకు సీఎం చంద్రశేఖరరావు పిలుపు
- అందుబాటులోకి పార్టీ మొబైల్ యాప్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పునర్నిర్మాణం లో ఉద్యోగులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చా రు. సచివాలయంలో శుక్రవారం ఆయన తెలంగాణ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ డైరీ, క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ఆవిష్కరణలో అసోసియేషన్ అధ్యక్షుడు యం.నరేందర్‌రావు, ప్రధాన కార్యదర్శి జి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
పార్టీ మొబైల్ యాప్ ఆవిష్కరణ: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) యువజన విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన పార్టీ డైరీని, మొబైల్ యాప్‌ను సీఎం కేసీఆర్ సచివాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. మొబైల్ యాప్‌లో ప్రభుత్వ అధికారులు, కార్యాలయాల వివరాలు, పార్టీ, మీడియా, అత్యవసర విభాగాల ఫోన్ నెంబర్లు, తదితర సమాచారం పొందు పరిచారు. కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రామ్మోహన్, రాష్ట్ర కో ఆర్డినేటర్ ధర్మేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా పరిషత్ డైరీని కూడా సీఎం ఈ సందర్భంగా ఆవిష్కరించారు. జెడ్పీ చైర్మన్ తుల ఉమ, మంత్రులు ఈటెల రాజేందర్, కె.తారకరామా రావు, టి. హరీశ్‌రావు, పార్లమెంటరీ కార్యదర్శి వి. సతీష్ పాల్గొన్నారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టియు) డైరీని సైతం సీఎం చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యద ర్శి చాడ వెంకటరెడ్డి, ఎస్టీ అధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి భుజంగరావు, సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.