ఆనాడు హవాలా జైన్ డైరీ.. నేడు లోకేష్ రెడ్ డైరీ.. తెలంగాణాలో రేవంత్ రెడ్డి డైరీ.. వీళ్లంతా డైరీల పేరిట జనాన్ని భయపెడుతున్నారో లేక రాజకీయాల్లో హడావుడి చేస్తున్నారో తెలీదు కానీ వీళ్ళ పుణ్యాన డైరీల్లోని రహస్యాలు.. అందులోని అంశాలు.. వాటి పర్యవసానాలు ఎక్కడికి తీసుకుపోతాయోనన్న సందేహం ప్రజల్లో నెలకొంది. ఇప్పుడు డైరీలు రాయడం.. ఎదుటివాళ్లను బెదిరించడం ఒక ఫ్యాషన్ అయింది.
అప్పట్లో స్కూల్లో టీచర్ బయటికి వెళ్తూ.. ఒరేయ్ లీడర్.. క్లాసులో అల్లరిచేసే వాళ్ళ పేర్లు పుస్తకంలో రాయి.. మళ్ళీ వచ్చి ఒక్కొక్కడికి వీపులు వాయగొడతాను అని చెప్పి వెళ్తాడు.. ఆ లీడర్ అలాగే తనకు నచ్చనివాళ్ళ పేర్లు... ఇంటర్వెల్‌లో జామకాయలు.. రేగ్గాయలు ఇవ్వని వాళ్ళను.. సైకిల్ అడిగితె ఇవ్వని వాళ్ళ పేర్లన్నీ రాసేసి టీచరుకు ఇచ్చి దెబ్బలు కాయిస్తాడు.. అచ్చం ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే నడుస్తోంది..
ఆంధ్రాలో లోకేష్ సైతం తన యువగళం పాదయాత్ర చేస్తున్నానని రోజులూ ఒక ఎర్ర బుక్కు పట్టుకుని ఉండేవారు.. తనకు నచ్చని.. తమ పార్టీని.. తమ క్యాడర్ ను ఇబ్బంది పెట్టినవాళ్లందరినీ మున్ముందు అధికారంలోకి వచ్చాక శిక్షిస్తాను అని చెబుతూ వాళ్ళ పేర్లు రాసుకునేవారు. పోలీసులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులూ.. కార్యకర్తలు .. అధికారులు.. ఇలా రకరకాల వాళ్ళను టార్గెట్ చేస్తూ వారి పేర్లను రెడ్ బుక్కులో రాస్తున్నాను .. మా ప్రభుత్వం వచ్చాక వాళ్ళను కట్ డ్రాయర్లతో నడిపిస్తాను అని హెచ్చరించారు.
ఇది ఆపూటకు ఆ మీటింగులో లోకేష్‌కు మైలేజి తెచ్చిందో లేదో తెలీదు కానీ.. జనం మాత్రం నవ్వుకున్నారు.. ఇలా ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదేమైనా రాచరికపు కాలంలో ఉన్నామా అనే కామెంట్లు కూడా వచ్చాయి. గతంలో నిషిద్ధ పీపుల్స్ వార్ నక్సలైట్లు మాత్రమే ఇలా డైరీ రాసేవారు. తమ వర్గశత్రువుల పేర్లు ఆంటే ఎమ్మెల్యేలు ఆ జిల్లాలోని కొందరు పోలీసుల పేర్లు అందులో రాసి వాళ్ళను టార్గెట్ చేసి హత మార్చేవారు. అచ్చం ఆ డైరీని తలపించే లోకేష్ రెడ్ డైరీ మీద ఆంధ్ర సీఐడీ కేసు బుక్ చేసింది. విచారణకు సైతం రమ్మని నోటీసులు పంపింది.
సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment