
సాక్షి, బెంగళూరు: లోదుస్తుల్లో దాచి అక్రమంగా బంగారం తరలిస్తున్న మహిళను కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసారు. దుబాయి నుంచి కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు వచ్చిన మహిళ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించడంతో చెక్ చేయగా లోదుస్తుల్లో బంగారం పేస్ట్ రూపంలో దాచి తరలిస్తున్న సంగతి తెలిసింది. ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు రూ.17 లక్షల విలువైన బంగారు పేస్ట్‌ను సీజ్ చేసారు.
Comments
Please login to add a commentAdd a comment