చెన్నై: అనుమానస్పద స్థితిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ హాస్టల్‌లోని తన రూంలో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. చదవుల్లో తాను సరిగ్గా రాణించలేక పోతున్నానని మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చూరీకి తరలించినట్టు పోలీసులు తెలిపారు.