
మేడ్చల్‌లోని సీఎమ్‌ఆర్‌ఐటీ కాలేజ్‌లో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్ బాత్‌రూమ్‌లో కెమెరాలు పెట్టి విధ్యార్ధినులను బెదిరించినట్టు సమాచారం. ఈ నేపద్యంలో బాధిత విధ్యార్ధినులు హాస్టల్‌లో వీడియోలు తీశారని ఆగ్రహం చెందారు.
నిందితుల దగ్గర దాదాపు 300 ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచినట్టు సమాచారం. సదరు వీడియోలతో విధ్యార్ధినులను బ్లాక్‌మెయిల్ చేస్తునట్టు విధ్యార్ధినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా వంటచేసే వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్న విధ్యార్ధినులు. విధ్యార్ధినులకు న్యాయం చేయాలంటూ ఏబీవీపీ ధర్నాకు దిగింది. విధ్యార్ధినులను బ్లాక్‌మెయిల్ చేస్తున్న సీఎమ్‌ఆర్‌ఐటీ కాలేజ్ యాజమాన్యంపై చర్యలకు ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ ఘటనలో ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment