private video
-
ప్రియురాలిపై సామూహిక అత్యాచారం.. డ్యాన్స్ మాస్టర్ అరెస్ట్
యశవంతపుర: యువతిని ప్రైవేట్ వీడియోలతో బెదిరించి ఆత్యాచారానికి పాల్పడిన డ్యాన్స్ మాస్టర్‌తో పాటు అతని ఇద్దరి స్నేహితులను బెంగళూరు కొడిగేహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. యువతికి నాలుగేళ్ల క్రితం సోషల్ మీడియాలో యాండీ జార్జీ పరిచయమయ్యాడు. ఇతడు ఒక ప్రైవేటు స్కూల్లో డ్యాన్స్‌మాస్టర్‌గా పనిచేసేవాడు. ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ రెండేళ్ల పాటు షికార్లకు వెళ్లారు. అతడు వేధించడంతో ఆమె కొంతకాలం నుంచి దూరంగా ఉంటోంది. దీంతో యువతితో కలిసి ఉన్న పాత పోటోలు, వీడియోలను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేయసాగాడు. ఇటీవల యాండీ జార్జి, స్నేహితులు సంతోష్, శశిలు కలిసి తనపై సామూహికంగా అత్యాచారం చేసినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. యాండీ జార్జీ పాఠశాలలోనూ విద్యార్థులతోను అసభ్యంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలిందని ఈశాన్య డీసీపీ లక్ష్మీప్రసాద్ తెలిపారు. -
వరుడి మొబైల్‌కు వధువు పర్సనల్ వీడియో.. ఆగిన వివాహం
సాక్షి, కృష్ణా జిల్లా: ఫేస్బుక్ పరిచయం ఓ యువతి జీవితాన్ని నాశనం చేసింది. స్నేహం, సానిహిత్యం పేరుతో ఓ వ్యక్తికి దగ్గరైన యువతి.. అతనితో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ అతన్ని కాదని యువతి మరో వ్యక్తికి పెళ్లికి సిద్ధమైంది.అతినితోనూ శారీరకంగా దగ్గరైంది. చివరికి యువతికి చెందిన పర్సనల్ వీడియోలు బయటకు రావడంతో ఆమెతో నిశ్చయమైన పెళ్లిని రద్దు చేసుకున్నాడు సదరు యవకుడు. ఈ ఘటన జిల్లాలోని గుడివాడలో చోటుచేసుకుంది. బాధితురాలు గుడివాడ పోలీసులను ఆశ్రయించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడివాడ బంటుమిల్లి రోడ్డుకు చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన కర్రా న్యూటన్ బాబుతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో అతడి కోరిక మేరకు ఆమె నగ్నంగా వీడియో కాల్ చేసింది. ఈ క్రమంలో యువతికి ఇటీవల ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన గుర్రం పరంజ్యోతితో వివాహం నిశ్చయమైంది. కాబోయే భర్త పరంజ్యోతితోతో కూడా యువతి శారీరకంగా దగ్గరైంది. ఈనెల 14వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. చదవండి: ‘నా వల్ల కావట్లేదు..’ భర్తమామల్ని ఫేస్బుక్ లైవ్‌లో పెట్టి మరీ సనా.. అయితే న్యూటన్ బాబు యువతితో మాట్లాడిన న్యూడ్ వీడియోను పెళ్లి కొడుకు పరంజ్యోతికి నగ్న వీడియోలు పంపాడు. ఈ వీడియోను వరుడు తన కుటుంబానికి పంపి ఈ పెళ్లి వద్దని నిరాకరించాడు. ఈ క్రమంలో పెళ్లి పెద్ద అయిన ఓ వ్యక్తి సదరు వీడియోను యువతి కుటుంబానికి పంపి పెళ్లి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇదే వీడియో తమ బంధువుల్లోని కొంతమందికి సైతం చేరడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన గుడివాడ టూ టౌన్ పోలీసులు న్యూటన్ బాబు అతని బంధువులు బాపట్ల కోటేశ్వరరావు, కొండ్రు రణధీర్ళు మరికొందరికి షేర్ చేసినట్లు గుర్తించారు. నూటన్బాబుపై అత్యాచారయత్నం కేసు, పరంజ్యోతిపై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు మరో ముగ్గురు పై 109,120b ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు. -
వీడియో లీక్ ఘటన.. అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిన ఆర్మీ జవాన్ అరెస్టు
చండీగఢ్: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ కేసుకు సంబంధించి ఆర్మీ జవాన్ సంజీవ్ సింగ్‌ను శనివారం అరెస్టు చేశారు మొహాలీ పోలీసులు. అరుణాచల్ ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న ఇతను వీడియో లీక్ చేసిన విద్యార్థినిని బ్లాక్మెయిల్ చేశాడని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాలు లభించిన తర్వతే సంజీవ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. ఇందుకు అరుణాచల్ పోలీసులు సహకరించినట్లు పేర్కొన్నారు. ఆర్మీ అధికారులు కూడా సంజీవ్ సింగ్ అరెస్టును ధ్రువీకరించారు. ఈ కేసుతో అతనికి సంబంధం ఉందని ఆధారాలు లభించిన తర్వాత పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్ పోలీసులకు తాము సహకరించామని పేర్కొన్నారు. విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు. సంజీవ్ సింగ్ అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లయింది. మరోవైపు చండీగఢ్ వీడియో లీక్ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణకు ధర్మాసనం తేదీని నిర్ణయించాల్సి ఉంది. చండీగఢ్ యూనివర్సీటీలో 60 మంది అమ్మాయిలు బాత్రూంలో స్నానం చేసే వీడియోలు లీక్ అయ్యాయని కొద్ది రోజుల క్రితం వార్తలు రావడం దుమారం రేపింది. అయితే విచారణలో ఒక్క అమ్మాయి వీడియో మాత్రమే లీక్ అయినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. అది కూడా ఆ అమ్మాయే స్వయంగా తన వీడియోను రికార్డు చేసుకుని బాయ్‌ఫ్రెండ్‌కు పంపిందని చెప్పారు. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
వీడియో లీక్ ఘటన.. పంజాబ్ సీఎం కీలక నిర్ణయం
చండీగఢ్: చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు మహిళా అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఈమేరకు సీఎం భగవంత్ మాన్ ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి గురుప్రీత్ దేవ్ పర్యవేక్షణలో సిట్ ఈ కేసును వేగంగా విచారించనుంది. ముగ్గురు అరెస్టు.. యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనలో ఇప్పటివరకు మొత్తం ముగ్గురుని అరెస్టు చేశారు పోలీసులు. స్నానం చేస్తుండగా తానే స్వయంగా రికార్డు చేసుకున్న వీడియోను పంపిన అమ్మాయి, దీన్ని రిసీవ్ చేసుకున్న సిమ్లాకు చెందిన ఆమె బాయ్‌ఫ్రెండ్ సన్నీ మెహతాతో పాటు అతని స్నేహితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సహకరించిన హిమాచల్‌ప్రదేశ్ పోలీసులకు పంజాబ్ పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. వార్డెన్ల సస్పెన్షన్ వీడియో లీక్ చేసిన అమ్మాయిని హాస్టల్ వార్డెన్ తిట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో లీక్ విషయాన్ని పోలీసులకు ముందుగా చెప్పనందుకు ఆమెను, మరో వార్డెన్‌ను కూడా అధికారులు సస్పెండ్ చేశారు. 6 రోజులు క్లాసులు బంద్.. విద్యార్థినుల నిరసనలతో యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి శనివారం(సెప్టెంబర్ 24) వరకు క్లాసులు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే విద్యార్థుల డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించిందని, దీంతో వాళ్లు నిరసన విరమించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యూనివర్సిటీలో తమకు భద్రత లేదని కొంతమంది విద్యార్థినులు బ్యాగులు సర్ధుకుని ఇంటిబాట పట్టారు. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? -
వీడియో లీక్ ఘటన.. ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను అరెస్టు చేసిన పోలీసులు
చండీగఢ్: చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే వీడియో పంపిన విద్యార్థినిని అరెస్టు చేయగా.. తాజాగా హిమాచల్ ప్రదేశ్ సిమ్లాకు చెందిన ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడ్ని 23 ఏళ్ల సన్నీ మెహతాగా గుర్తించారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య రెండుకు చేరింది. అంతకుముందు ప్రైవేట్ వీడియోను తన బాయ్‌ఫ్రెండ్ సన్నీ మెహతాకు పంపిన అమ్మాయిని చండీగఢ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇది ఆమె సొంత వీడియో అని, ఇతర అమ్మాయిల వీడియోలేవీ లీక్ కాలేదని పేర్కొన్నారు. ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను అరెస్టు చేస్తే అసలు నిజాలు తెలుస్తాయన్నారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు నిందితులు సిమ్లాలోని రోహ్రూ ప్రాంతానికే చెందినవారని పోలీసులు వెల్లడించారు. చండీగఢ్ యూనివర్సిటీలో 60 అమ్మాయిలు స్నానం చేసే వీడియోలు లీక్ అయ్యాయని తొలుత ప్రచారం జరిగింది. దీనిపై తీవ్రదుమారం చెలరేగింది. విద్యార్థినులంతా యూనివర్సిటీలో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. నిందితులకు కఠిన శిక్ష విధిస్తామని హామీ ఇచ్చారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
యూనివర్సిటీ విద్యార్థిని వీడియో లీకు ఘటన.. పోలీసులు ఏం చెప్తున్నారంటే..
చండీగఢ్: చండీగఢ్ యూనివర్సీలో అమ్మాయిల ప్రైవేటు వీడియోల లీక్ ఘటనపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఒక అమ్మాయి తన సొంత వీడియోను మాత్రమే బాయ్‌ఫ్రెండ్‌కు పంపిందని చెప్పారు. అతను హిమచాల్ ప్రదేశ్‌కు చెందినవాడని వెల్లడించారు. వీడియో పంపిన అమ్మాయిని అరెస్టు చేసి విచారించిన తర్వాతే ఈ విషయం తెలిసిందని చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో అమ్మాయి బాయ్‌ఫ్రెండ్ పాత్ర ఏమైనా ఉందా? అనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. అతడ్ని అరెస్టు చేసి విచారిస్తేనే అసలు నిజం బయటపడుతుందన్నారు. సొంత వీడియో లీక్ చేసుకున్న అమ్మాయి ఇతర అమ్మాయిల వీడియోలను కూడా రికార్డు చేసిందా? అనే విషయంపైనా విచారణ చేస్తామన్నారు. అలాగే యూనివర్సిటీలో ఇప్పటివరకు ఒక్క విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు. అత్యంత సున్నితమైన ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది అమ్మాయిలు స్నానం చేస్తుండగా తీసిన వీడియోలు లీక్ అయ్యాయని ప్రచారం జరిగింది. దీనిపై విద్యార్థినులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి యూనివర్సిటీలో నిరసనలు చేపట్టారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అయితే లీక్ అయింది ఒక్క అమ్మాయి వీడియోనే అని యూనివర్సిటీ అధికారులతో పాటు పోలీసులు స్పష్టతనిచ్చారు. మరోవైపు ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు. కాగా.. యూనివర్సిటీలో ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు (సెప్టెంబర్ 19,20) క్లాసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
వారితో టచ్‌లో ఉన్నా.. దయచేసి వదంతులు నమ్మొద్దు: పంజాబ్ సీఎం
చండీగఢ్: చండీగఢ్ యూనివర్సిటీలో అమ్మాయిల ప్రైవేటు వీడియోల లీక్ వ్యవహారంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించిటన్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. 'చండీగఢ్ యూనివర్సిటీ ఘటన దురదృష్టకరం. మన బిడ్డలే మనకు గర్వకారణం. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించాం. దోషులుగా తేలినవారిపై అత్యంత కఠినచర్యలు తీసుకుంటాం. అధికారయంత్రాంగంతో నేను టచ్‌లోనే ఉన్నా. దయచేసి వదంతులు నమ్మొద్దు' అని భగవంత్ మాన్ హిందీలో ట్వీట్ చేశారు. चंडीगढ़ यूनिवर्सिटी की घटना सुनकर दुख हुआ...हमारी बेटियां हमारी शान हैं...घटना की उच्च स्तरीय जांच के आदेश दे दिए हैं..जो भी दोषी होगा सख्त कार्रवाई करेंगे... मैं लगातार प्रशासन के संपर्क में हूं...मैं आप सब से अपील करता हूं कि अफवाहों से बचें... https://t.co/kgEGszUhAq — Bhagwant Mann (@BhagwantMann) September 18, 2022 చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది అమ్మాయిల ప్రైవేటు వీడియోలు లీకైనట్లు వార్తలు రావడం తీవ్రదుమారం రేపింది. దీనిపై యూనివర్సిటీ విద్యార్థినులు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే యూనివర్సిటీ యాజమాన్యం ఈ ఆరోపణలను కొట్టి పారేసింది. ఒక్క అమ్మాయి వీడియో మాత్రమే లీకైనట్లు వెల్లడించింది. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పింది. అలాగే యూనివర్సిటోలో ఏ ఒక్క విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకోలేదని, ఆస్పత్రిలో కూడా చేరలేదని ప్రకటనలో తెలిపింది. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ
చండీగఢ్: పంజాబ్ చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది అమ్మాయిల ప్రైవేటు వీడియోలు లీకైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం చెలరేగి యూనివర్సిటీ విద్యార్థినిలు నిరసనకు కూడా దిగారు. అయితే విషయంపై యాజమాన్యం స్పందించింది. మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారం, అర్థరహితం అని కొట్టిపారేసింది. యూనివర్సిటీలో ఒక్క అమ్మాయి ప్రైవేటు వీడియో మాత్రమే లీక్ అయినట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. ఓ అమ్మాయి తన సొంత వీడియోను సోషల్ మీడియాలో తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపిందని వెల్లడించింది. తాము చేపట్టిన ప్రాథమిక విచారణలో ఈ ఒక్క వీడియో తప్ప మరే ఇతర అమ్మాయిల వీడియోలు లీక్ కాలేదని తేలిందని చెప్పింది. 60 ప్రైవేటు వీడియోలు లీక్ అయ్యాయని మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ డా.బవా స్పష్టం చేశారు. ఈ వదంతులను ఎవరూ నమ్మవద్దని సూచించారు. There are rumours that 7 girls have committed suicide whereas the fact is that no girl has attempted any such step. No girl has been admitted to hospital in the incident: Chandigarh University pic.twitter.com/5zsMeibsxW — ANI (@ANI) September 18, 2022 అలాగే చండీగఢ్ యూనివర్సిటీలో ఏడుగురు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో కూడా నిజం లేదని బవా చెప్పారు. ఏ ఒక్క విద్యార్థిని కనీసం ఆస్పత్రిలో కూడా చేరలేదని వెల్లడించారు. వీడియో లీక్ చేసిన అమ్మాయిని పోలీసులు అరెస్టు చేశారని, కేసు విచారణలో పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. This is Horrible Scenes From Chandigarh University #justiceforCUgirls #chandigarhuniversity pic.twitter.com/5eLP7BIYTc — r/Ghar Ke Kalesh (@gharkekalesh) September 17, 2022 Chandigarh University videos scandal: Protests over objectionable clips of girls bathing in hostel Girl student arrested; police deny reports of suicide attempt on campus Details: https://t.co/RK1H5IZ5WU#chandigarhuniversity #protests pic.twitter.com/y94OTRibmN — Asianet Newsable (@AsianetNewsEN) September 18, 2022 చదవండి: ఫ్రెండే కదా అని నమ్మారు.. హాస్టల్ యువతుల ప్రైవేటు వీడియోలు తీసి..! -
ఫ్రెండే కదా అని నమ్మారు.. హాస్టల్ యువతుల ప్రైవేటు వీడియోలు తీసి..!
ఓ యువతి యూనివర్సిటీలో తన హాస్టల్మేట్స్ (60 మంది అమ్మాయిల) ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడం కలకలం సృష్టించింది. దీంతో, హాస్టల్ విద్యార్థులు నిరసనలకు దిగారు. ఈ షాకింగ్ ఘటన పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ యువతి తనతో పాటు చదువుకుంటూ తన రూమ్‌లో ఉంటున్న యువతుల వీడియోలను తీసింది. బాత్రూమ్లో స్నానం చేస్తున్న సమయంలో ఫోన్లో సీక్రెట్‌గా వీడియోలు తీసి అనంతరం, ఆ వీడియోలను సోషల్ మీడియాలో, తన ఫ్రెండ్స్‌కు షేర్ చేసింది. ఈ విషయం బాధితురాలికి తెలియడంతో ఆమెను నిలదీసింది. దీంతో, హాస్టల్లోని విద్యార్థులంతా నిరసనకు దిగారు. రంగంలోకి దిగిన యూనివర్సిటీ అధికారులు, పోలీసులు.. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితురాలు.. మరికొందరు విద్యార్థుల ప్రైవేటు వీడియోలను సైతం లీక్ చేస్తున్నట్టు కూడా విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ షాకింగ్ ఘటనపై నిరసనలు తెలుపుతుండగా ఓ విద్యార్థిని స్పృహ తప్పి కిందపడిపోవడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. This girl viral the 60 girls mms in Chandigarh university kindly take strict action on this girl @INCChandigarh @narendramodi @ChandigarhUT #chandigarhuniversity #justiceforcugirls pic.twitter.com/7JVHN0oBNZ — Shanu XD (@shanu00001) September 17, 2022 కాగా, ఈ ఘటన కారణంగా హాస్టల్లోని పలువురు యువతులు ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వార్తలు బయటకు వచ్చాయి. అయితే, ఈ వార్తలను పోలీసులు, యూనివర్సిటీ పరిపాలనా విభాగం ఖండించింది. పుక్లార్లు నమ్మవద్దంటూ స్పష్టం చేశారు. ఇక, ఘటనపై పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ స్పందించారు. ఈ వ్యవహారంలో నిందితులను విడిచిపెట్టే ప్రసక్తేలేదు. విద్యార్థులందరూ ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. Protest breaks out in Chandigarh University after someone secretly recorded videos of girls from hostel bathroom and leaked them online. University administration is trying to muzzle the protest, according to a student : @PunYaab pic.twitter.com/BIi1jTBPCN — Yogita Bhayana योगिता भयाना (@yogitabhayana) September 17, 2022 A female student recorded videos of 60+ females while bathing & made it viral. 3 girls in #ChandigarhUniversity & attempted suîcide today and 1 of them is deceased. Management is acting very carelessly on this incident & wants to suppress it for the reputation of the college. pic.twitter.com/JWwGf1jEeX — Ankur🇮🇳™ (@unapologeticAnk) September 17, 2022 -
కీచక భర్త.. భార్య వీడియోలు తీసి, స్నేహితుడితో కలిసి..
బనశంకరి(బెంగళూరు): తనను నగ్నంగా మార్చి వీడియోలు తీసి డబ్బు కోసం డిమాండ్ చేస్తున్నాడని ఓ వివాహిత తన భర్తపై బసవేశ్వర నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ముంబైలో తన భర్తతో కలిసి నివాసం ఉండేది. భర్తకు ఫోర్న్ వీడియోలు చూసే అలవాటు ఉంది. భార్యకు ఆ వీడియోలు చూపి నగ్నంగా మార్చి వీడియోలు తీశాడు. రూ.5 లక్షల డబ్బు ఇవ్వాలని, లేని పక్షంలో వెబ్సైట్లో ఉంచుతానని బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో ఆమె బెంగళూరుకు చేరుకుంది. భర్త కూడా బెంగళూరుకు చేరుకొని స్నేహితుడు సులేశ్కార్నిక్తో కలిసి మళ్లీ ఆమెను వేధించసాగారు. అంతేగాకుండా స్నేహితుడితో కలిసి ఫోర్న్సైట్ కూడా నిర్వహిస్తున్నట్లు భార్య గుర్తించింది. భర్త స్నేహితుడు కూడా తనను డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశాడని బాధితురాలు ఆ ఫిర్యాదులో పేర్కొంది. చదవండి: భార్య చేసిన చికెన్ పకోడ తిని.. ఆపై నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి ఆత్మహత్య -
Hyderabad: యువతితో సన్నిహితంగా ఉన్న వీడియోతో సినీనటి బ్లాక్మెయిల్
అమీర్‌పేట: ఓ వ్యక్తి యువతితో సన్నిహితంగా ఉన్న వీడియోలను చూపించి బెదిరింపులకు పాల్పడిన సినీ నటిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల మేరకు.. సినీ పరిశ్రమలో పనిచేసే 28 ఏళ్ల యువరాజ్కుమార్కు అదే పరిశ్రమకు చెందిన 25 ఏళ్ల పడాల లక్ష్మి ఓ వీడియో పంపింది. అందులో అతడు ఓ యువతితో సన్నితంగా ఉన్న వీడియో ఉంది. తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని, లేని పక్షంలో సామాజిక మాధ్యమాలలో వీడియోలను వైరల్ చేస్తానని బెదిరింపులకు దిగింది. దీంతో అతడు ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
వైరల్ : బాయ్‌ఫ్రెండ్‌తో నటి ప్రైవేట్ వీడియో లీక్
పాట్నా : ప్రముఖ భోజ్‌పురి నటి త్రిషకర్ మధు ప్రైవేటు వీడియో లీకైంది. ఆమె బాయ్‌ప్రెండ్‌తో ఏకాంతంగా గడిపిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన నటి మధు..'దేవుడు అన్నీ చూస్తున్నాడు. కొందరు కావాలనే నా పరువు తీయడానికి వీడియోను లీక్ చేసి వైరల్ చేస్తున్నారు. జనాలు ఇంత చీప్‌గా ఆలోచిస్తారని అసలు ఊహించలేదు' అంటూ ట్వీట్ చేసింది. అయితే వీడియో బయటకు ఎలా వచ్చింది అనే దానిపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. వీడియో లీక్ వెనుక స్వయంగా నటి మధునే ఉందనే, పబ్లిసిటీ కోసమే ఆమె ఇదంతా చేస్తుందని నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. పాపులారిటీ పెంచుకోవడానికే మధు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఉంటుందని నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కాగా "హమ్ హై హిందుస్తానీ" అనే భోజ్‌పురి సీరియల్‌తో అరంగేట్రం చేసిన బెంగాలీ నటి త్రిషకర్ మధు ఆ తర్వాత పలు ఐటెమ్ సాంగ్స్‌లో నటించి పాపులర్ అయ్యింది. -
నేను మగాడినే.. వాట్సాప్‌లో వీడియో!
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన అబ్బాయికి, చెన్నై అమ్మాయితో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన 15 రోజులకే ఇద్దరూ వేరయ్యారు. తన భర్త నపుంసకుడంటూ విడాకులు కోరుతూ ఆమె కోర్టుకు ఎక్కింది. విడాకులు మంజూరు కాకుండా ఉండటానికి తాను మగాడినేనని నిరూపించుకోవాలని అతడు భావించాడు. అందుకు నేర మార్గాన్ని అనుస రించడంతో కటకటాల్లోకి చేరాడు. చెన్నైలోని మహిళా ఠాణా నుంచి వచ్చిన ఓ ప్రత్యేక బృందం హైదరాబాద్‌లో నిందితుడిని అరెస్టు చేసి తీసుకువెళ్లింది. సమ్మతి లేకుండానే వివాహం... ఎల్బీనగర్కు చెందిన వాసు కుటుంబానికి, చెన్నైలోని ముథామిజ్నగర్కు చెందిన ఓ యువతి కుటుంబాని కి మధ్య పరిచయం ఉంది. దీంతో వీరిద్దరికీ వివా హం చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించారు. వాసు, యువతి మధ్య సరైన అవగాహన, పరస్పరం అర్థం చేసుకునే తత్వాలు లేవు. ఇదేమీ పట్టించుకోని పెద్దలు వారి సమ్మతి లేకుండానే 2016లో పెళ్లి చేశారు. ఎల్బీనగర్కు కాపురానికి వచ్చిన వాసు భార్య 15 రోజులకే పుట్టింటికి వెళ్లిపోయింది. ఇరు కుటుంబాలు రాజీ ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. తన భర్త నపుంసకుడని ఆరోపించిన ఆ యువతి విడాకులు కోరుతూ చెన్నైలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం కేసు కోర్టు విచారణలో ఉంది. అయితే ఆ ఆరోపణలు తప్పని, వేరే కారణాల నేపథ్యంలోనే తన భార్య విడాకులు కోరుతోందంటూ వాసు తన తల్లిదండ్రులతో పాటు అత్తమామలకు స్పష్టం చేస్తూ వస్తున్నాడు. విసిగిపోయి‘వీడియో’ పంపించాడు... తాను చెప్తున్న విషయాన్ని తన తల్లిదండ్రు లు నమ్ముతున్నా... అత్తమామలు నమ్మట్లేదని వా సు భావించాడు. ఓ పక్క చెన్నై కోర్టులో విడాకుల కేసు విచారణ తుది దశకు చేరడంతో పాటు విడాకులు మంజూరైతే తన భార్య చెప్పిందే నిజమని నమ్ముతారని అనుకున్నాడు. దీంతో అత్తమామలకు తాను నపుంసకుడిని కాదని స్పష్టం చేయా లని నిశ్చయించుకున్నాడు. ఇది ఎలా చేయాలా అని ఆలోచించిన వాసుకు ఓ చిల్లర ఆలోచన వచ్చింది. దీన్ని అమలులో పెట్టడంలో భాగంగా ఓ వ్యభిచారిణిని సంప్రదించాడు. ఆమెతో కలసి శృంగారంలో పాల్గొంటూ 5 నిమిషాల నిడివితో వీడియో తీయించాడు. దీన్ని వాట్సాప్ ద్వారా చెన్నైలోని అత్తమామలకు షేర్ చేశాడు. వీడియో చూసి షాక్‌కు గురై.. వారు విషయాన్ని అక్కడి ఎంకేబీ నగర్ మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అశ్లీల వీడియోలు షేర్ చేసిన ఆరోపణలపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ డి.చిత్ర ప్రత్యేక బృందాన్ని నగరానికి పంపారు. ఈ టీమ్ వాసును అరెస్టు చేసి తీసుకువెళ్లి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. వీడియోను పరిశీలించగా, మరో వ్యక్తి చిత్రీకరించినట్లు ఉందని అక్కడి పోలీసులు భావిస్తున్నారు. అది ఎవరో గుర్తించడం కోసం వాసును కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. -
విదేశీ జంట ప్రైవేట్ వీడియో కలకలం!
సాక్షి, ఉదయ్‌పూర్: విదేశీ జంట ఏకాంత వీడియోపై దుమారం రేగుతోంది. పోలీస్ స్టేషన్‌పై వీరు ఏకాంతంలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఈ ఘటన రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇటీవల చోటుచేసుకుంది. ఈ ఒక్క వీడియోతో స్థానిక పోలీసులు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు అయి ఉండి ఇలాంటి పనులకు చోటు ఇస్తారా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గోయల్ కథనం ప్రకారం.. ఉదయ్‌పూర్ పరిధిలోని ఘంటానగర్ పోలీస్ స్టేషన్ మీద కొన్ని రోజుల కిందట విదేశానికి చెందిన ఓ జంట శృంగారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట నిజమేనని, అయితే ఇది ఎక్కడ జరిగింది? ఎవరైనా మార్ఫింగ్ చేసి లీక్ చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. పీఎస్ మీద ఇలాంటి పనులు జరిగినట్లు తాను నమ్మడం లేదన్నారు. పోలీస్ స్టేషన్‌పైనే ఈ అసాంఘీక కార్యకలాపాలు జరిగాయని, స్థానికులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ లోపలి నుంచే టెర్రస్ మీదకు ఎక్కేందుకు వీలుండటం గమనార్హం. అంటే.. పోలీసుల సహకారంతోనే విదేశీ జంట పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద ఏకాంతంగా గడిపారని, వీడియో ఆధారంగా పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఘంటానగర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
టెకీపై అత్యాచారం.. ఆపై వికృత చేష్టలు!
బెంగళూరులో ఐటీ ఇంజినీరు అరెస్టు సాక్షి, బెంగళూరు : మహిళా టెకీపై లైంగికదాడికి పాల్పడి ఆ దృశ్యాలను అశ్లీల వెబ్సైట్లో అప్లోడ్ చేసిన సహచర ఐటీ ఇంజినీరును బెంగళూరు వివేకనగర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. అరింధమ్నాథ్ (28) అనే యువకుడు నగరంలోని ఒక సంస్థలో ఐటీ ఇంజినీరు. ఇదే కంపెనీలో పనిచేసే యువతిని ప్రేమించాలని ఇతడు ఒత్తిడి చేయగా, ఆమె నిరాకరించింది. గత ఏడాది ఒకరోజు తన ఇంటికి రావాలని అరింధమ్నాథ్ యువతిని కోరగా, ఆమె తన స్నేహితురాలిని వెంట తీసుకుని అతడి ఇంటికి వెళ్లింది. ఈ సమయంలో అరింధమ్నాథ్, ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఆ దృశ్యాలను రహస్యంగా మొబైల్ఫోన్లో వీడియో తీశాడు. కొంతకాలానికి ఆమె వేరే కంపెనీలో చేరింది. కానీ కామాంధుడు ఆమెకు పదేపదే ఫోన్ చేసి తన ఇంటికి రావాలని వేధించడంతో పాటు అడిగినంత డబ్బు ఇవ్వాలని, లేని పక్షంలో రేప్ దృశ్యాలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరింపులకు దిగాడు. దీనికి ఆమె నిరాకరించగా, ఈ నెల 4 తేదీన లైంగికదాడి దృశ్యాలను ఒక నీలిచిత్రాల వెబ్సైట్లో అప్లోడ్ చేసి, ఆ లింక్‌ను బాధితురాలికి పంపించి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, స్నేహితురాలు గమనించి ఆమెను కాపాడింది. ఈ నెల 6వ తేదీన వివేకనగర పీఎస్‌లో నిందితుడిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం అతణ్ని అరెస్ట్ చేశారు. అత్యాచారం, బెదిరింపులు, ఐటీ చట్టం తదితర సెక్షన్ల కింద అరింధమ్ నాథ్‌పై కేసులు నమోదు చేశారు.