పాట్నా : ప్రముఖ భోజ్‌పురి నటి త్రిషకర్ మధు ప్రైవేటు వీడియో లీకైంది. ఆమె బాయ్‌ప్రెండ్‌తో ఏకాంతంగా గడిపిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన నటి మధు..'దేవుడు అన్నీ చూస్తున్నాడు. కొందరు కావాలనే నా పరువు తీయడానికి వీడియోను లీక్ చేసి వైరల్ చేస్తున్నారు. జనాలు ఇంత చీప్‌గా ఆలోచిస్తారని అసలు ఊహించలేదు' అంటూ ట్వీట్ చేసింది. అయితే వీడియో బయటకు ఎలా వచ్చింది అనే దానిపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు.
ఇదిలా ఉండగా.. వీడియో లీక్ వెనుక స్వయంగా నటి మధునే ఉందనే, పబ్లిసిటీ కోసమే ఆమె ఇదంతా చేస్తుందని నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. పాపులారిటీ పెంచుకోవడానికే మధు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఉంటుందని నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కాగా "హమ్ హై హిందుస్తానీ" అనే భోజ్‌పురి సీరియల్‌తో అరంగేట్రం చేసిన బెంగాలీ నటి త్రిషకర్ మధు ఆ తర్వాత పలు ఐటెమ్ సాంగ్స్‌లో నటించి పాపులర్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment