చండీగఢ్: చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే వీడియో పంపిన విద్యార్థినిని అరెస్టు చేయగా.. తాజాగా హిమాచల్ ప్రదేశ్ సిమ్లాకు చెందిన ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడ్ని 23 ఏళ్ల సన్నీ మెహతాగా గుర్తించారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య రెండుకు చేరింది.
అంతకుముందు ప్రైవేట్ వీడియోను తన బాయ్‌ఫ్రెండ్ సన్నీ మెహతాకు పంపిన అమ్మాయిని చండీగఢ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇది ఆమె సొంత వీడియో అని, ఇతర అమ్మాయిల వీడియోలేవీ లీక్ కాలేదని పేర్కొన్నారు. ఆమె బాయ్ఫ్రెండ్ను అరెస్టు చేస్తే అసలు నిజాలు తెలుస్తాయన్నారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు నిందితులు సిమ్లాలోని రోహ్రూ ప్రాంతానికే చెందినవారని పోలీసులు వెల్లడించారు.
చండీగఢ్ యూనివర్సిటీలో 60 అమ్మాయిలు స్నానం చేసే వీడియోలు లీక్ అయ్యాయని తొలుత ప్రచారం జరిగింది. దీనిపై తీవ్రదుమారం చెలరేగింది. విద్యార్థినులంతా యూనివర్సిటీలో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. నిందితులకు కఠిన శిక్ష విధిస్తామని హామీ ఇచ్చారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment