Punjab Police
-
పంజాబ్ పోలీసులు వర్సెస్ బ్రిటన్ ఆర్మీ
లండన్: జగ్జీత్సింగ్ అనే బ్రిటన్ సైనికుడు భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయం తమ విచారణలో తేలిందని పంజాబ్ పోలీసులు ప్రకటించడం వివాదాస్పదమవుతోంది. ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. పంజాబ్ పోలీసులు చెప్పిన జగ్జీత్సింగ్ పేరుతో బ్రిటిష్ ఆర్మీలో ఎవరూ పని చేయడం లేదని తెలిపింది.‘జగ్జీత్సింగ్ అనే వ్యక్తి ఫతేసింగ్ బాగీ అనే మారుపేరుతో ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్ అనే ఉగ్రవాద సంస్థ నడుపుతున్నాడు. జగ్జీత్సింగ్ ప్రస్తుతం బ్రిటీష్ ఆర్మీలో జవానుగా పనిచేస్తున్నాడు’అని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు.పంజాబ్ డీజీపీ వెల్లడించిన ఈ విషయాన్ని యూకే ప్రభుత్వం కొట్టిపారేసింది. కాగా,2021లో అమృత్సర్ పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు జగ్జీత్సింగ్ పేరు చెప్పారు. తమకు ఆయుధాలు, డబ్బులు ఇచ్చింది జగ్జీత్సింగ్ అని వారు విచారణలో చెప్పడం గమనార్హం. -
పంజాబ్‌లో 105 కిలోల హెరాయిన్ పట్టివేత
చండీగఢ్: సరిహద్దుల్లో డ్రగ్స్ రాకెట్‌ను పంజాబ్ పోలీసులు ఛేదించారు. 105 కిలోల హెరాయిన్‌ను సీజ్ చేయడంతోపాటు తుర్కియే కేంద్రంగా పనిచేసే డ్రగ్స్ స్మగ్లర్ నవ్ భులార్ ముఠాలోని నవ్‌జ్యోత్ సింగ్, లవ్‌ప్రీత్ కుమార్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హెరాయిన్‌తోపాటు సుమారు 32 కిలోల కెఫీన్ ఎన్‌హైడ్రస్, 17 కిలోల డెక్స్ట్రోమెథార్ఫాన్ (డీఎంఆర్) అనే నిషేధిత డ్రగ్స్‌ను కూడా పట్టుకున్నారు. ఈ మాదక ద్రవ్యాల విలువ రూ.100 కోట్ల పైమాటేనని చెబుతున్నారు. హెరాయిన్‌తోపాటు వీటిని కూడా వాడితే ఆ ప్రభావం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని డీజీపీ గౌరవ్ యాదవ్ ఆదివారం చెప్పారు. విదేశీ తయారీ పిస్టళ్లు ఐదు, ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పాకిస్తాన్ నుంచి ఈ మాదక ద్రవ్యాలను దొంగచాటుగా జల మార్గంలో తరలించేందుకు స్మగ్లర్లు భారీ రబ్బర్ ట్యూబ్‌లను వినియోగించారని వివరించారు. -
రోడ్డుకు అడ్డంగా పడుకుని పోలీసు వినూత్న నిరసన.. ఏం జరిగిందంటే?
ఛండీఘర్: ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పోలీసుల అవినీతిని భరించలేక.. ఓ హోంగార్డ్ వినూత్న రీతిలో నిరసనకు దిగాడు. నేను దొంగలను అరెస్టు చేస్తే మా పోలీస్ స్టేషన్లో వాళ్లు లంచం తీసుకుని వదిలేస్తున్నారు అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసనకు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఓ హోంగార్డ్.. తోటి పోలీసులు అవినీతి చూసి తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో హైవేకు అడ్డుగా ఓ తాడు కట్టి వాహనాలను నిలిపివేశాడు. అనంతరం.. రోడ్డుపై వాహనాలకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపాడు. ‘నేను దొంగలను అరెస్టు చేస్తే మా పోలీస్ స్టేషన్లో వాళ్లు లంచం తీసుకుని వదిలేస్తున్నారు’ అంటూ భోగ్పూర్ ప్రాంతంలో పఠాన్‌కోట్ హైవేపై నిరసనకు దిగాడు. ఇది చూసిన వాహనదారులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలో అక్కడే మరో పోలీసు అధికారి.. నిరసనకు దిగిన హోంగార్డ్ను పైకిలేపే ప్రయత్నం చేశాడు. హోంగార్డ్ వినకపోవడంతో అతడిని కాలితో తన్నాడు. దీంతో, ఆయన ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఇక, ఈ ఘటనపై భోగ్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి సుఖ్జిత్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఒక గొడవకు సంబంధించి ఓ యువకుడిని హోంగార్డు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చాడు. ఆ వ్యక్తి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.. అది మంజూరు చేయబడింది. దీని తర్వాత అతను విడుదలయ్యాడు. హోంగార్డు జవాన్‌ను తన్నలేదని సుఖ్జిత్ సింగ్ పేర్కొన్నారు. ‘Jehra mai chor fad ke liauna oh Thane Wale paise laike chadi jande’ रिश्वतखोरी से दुखी हो कर पुलिस मुलाजिम ने #jalandhar के भोगपुर में रोड जाम कर विरोध प्रदर्शन किया। #PunjabPolice pic.twitter.com/QyajO37Cvd — Harpinder Singh (@HarpinderTohra) July 22, 2023 ఇది కూడా చదవండి: బొగ్గు కుంభకోణంలో మహిళా ఐఏఎస్ అరెస్ట్ -
ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ అరెస్ట్
-
నలుగురు సైనికులను కాల్చి చంపింది మన జవానే.. ఉగ్ర కోణం లేదు..
చండీగడ్: గత బుధవారం పంజాబ్‌లోని భటిండా సైనిక శిబిరంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇది ఉగ్రవాదుల పనా? అని అనుమానాలు తలెత్తాయి. అయితే ఈ ఘటనలో ఉగ్ర కోణం లేదని పంజాబ్ పోలీసులు సోమవారం వెల్లడించారు. దాడి చేసింది తోటి జవాన్ మోహన్ దేశాయ్ అని తెలిపారు. కాల్పుల అనంతరం అనుమానంతో అతడ్ని అరెస్టు చేసి విచారించగా నేరంగా అంగీకరించినట్లు పేర్కొన్నారు. కాల్పుల్లో చనిపోయిన నలుగురు జవాన్లు తనను వేధించడం వల్లే దాడి చేసి హతమార్చినట్లు మోహన్ దేశాయ్ అంగీకరించినట్లు అధికారులు చెప్పారు. మొదట పోలీసులను అయోమయానికి గురి చేసేందుకు కట్టు కథలు చెప్పాడని, ఆ తర్వాత విచారణలో నిజాన్ని ఒప్పుకున్నాడని వివరించారు. ఈ ఘటనలో ఉపయోగించిన ఆయుధాలను మిలిటరీ స్టేషన్ నుంచే మోహన్ దొంగిలించాడని పేర్కొన్నారు. మోహన్‌కు ఇంకా పెళ్లి కాలేదని ఒంటరిగానే ఉంటున్నాడని అధికారులు వెల్లడించారు. అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే విషయంపైనా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఏం జరిగిందంటే? పంజాబ్‌లోని భటిండా సైనిక శిబిరంలో శతఘ్ని దళానికి చెందిన జవాన్లు నివసించే ఆర్మీ స్టేషన్‌లోని ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఇందులో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలిలో ఇన్సాస్ రైఫిల్‌కు చెందిన 19 ఖాళీ తూటాలు లభించాయి. ఘటన విషయం తెల్సిన వెంటనే తక్షణ స్పందన దళం రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు, సైన్యం.. నిందితుడి కోసం వేట మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా కన్పించిన మోహన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: మిలిటరీ స్టేషన్‌పై దుండగుల దాడి.. తుపాకులతో కాల్పులు.. నలుగురు సైనికులు మృతి.. -
పప్పాల్‌ప్రీత్ సింగ్ అరెస్ట్.. ఇక అమృత్‌పాల్ దొరికినట్టేనా?
ఛండీఘర్: ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు సహా భద్రతా బలగాలు గాలిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే అమృత్‌పాల్ సిక్కులతో సమావేశమవుతారని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా, అమృత్‌పాల్ సింగ్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు పప్పాల్‌ప్రీత్ సింగ్‌ను పంజాబ్ ఇంటెలిజెన్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కాగా, గత నెలలో వీరిద్దరూ పారిపోయిన విషయం తెలిసిందే. తాజాగా పంజాబ్ పోలీసులు పప్పాల్ సింగ్‌ను హోషియార్‌పూర్‌లో పట్టుకున్నారు. ఇక, అమృత్‌పాల్‌తో పాటు పప్పాల్‌సింగ్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. పంజాబ్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అతను చిక్కినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. అమృత్‌పాల్ సింగ్, పప్పాల్ సింగ్ కలిసి జలంధర్, హోషియార్పూర్, అమృత్సర్ జిల్లాల్లో ఆశ్రయం పొందారు. వీరిద్దరూ ఫగ్వారా పట్టణం, నాద్లోన్, బీబీ గ్రామంలోని మూడు వేర్వేరు డేరాలలో బస చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక, వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం.. మార్చి 18వ తేదీ నుంచి అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. Source: Fugitive Amritpal's close aide Papalpreet Singh arrested from Hoshiarpur in a joint operation by Punjab Police and Punjab Counter Intelligence. pic.twitter.com/sBvQKqM8mI — Nikhil Choudhary (@NikhilCh_) April 10, 2023 -
అమృత్‌పాల్ కోసం డేరాల్లో గాలింపు
హోషియార్పూర్: వివాదాస్పద సిక్కు మత బోధకుడు, ‘వారిస్ దే పంజాబ్’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ ఆచూకీ ఇంకా లభించలేదు. అతడి కోసం పంజాబ్ పోలీసులు వేట మరింత ముమ్మరం చేశారు. హోషియార్పూర్ జిల్లాలో ప్రస్తుతం గాలింపు ఉధృతంగా కొనసాగుతోంది. సిక్కు మత సంస్థలైన ‘డేరా’ల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. హోషియార్పూర్ జిల్లాలోని మర్నియాన్తోపాటు సమీప గ్రామాల్లో వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. నివాసిత ప్రాంతాలే కాకుండా పశువుల పాకలు, పొలాల్లో బోరుబావుల వద్ద ఉండే గదులను సైతం వదిలిపెట్టడం లేదు. డేరాల్లో అమృత్‌పాల్ తలదాచుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ దిశగా గాలింపు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. పోలీసులు ఇంటింటికీ తిరిగి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. -
‘అమృత్‌పాల్ సింగ్ పాక్‌కు పారిపోవాలి’
‘‘నేనేం పరారీలో లేను. ఎక్కడికీ పారిపోలేదు. పోలీసుల ఎదుట లొంగిపోయే ఉద్దేశమూ లేదు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తా. అన్ని వాస్తవాలను వివరిస్తా. ఓపిక పట్టండి. సిక్కు సంఘాలన్నీ ఐక్యం కావాల్సిన తరుణం వచ్చింది’’ అంటూ అమృత్‌పాల్ సింగ్ ఓ వీడియో, ఆడియో క్లిప్ విడుదల చేయడం తెలిసిందే. అయితే.. ఈ ఖలీస్తానీ సానుభూతిపరుడి వ్యవహారంపై శోరోమణి అకాలీ దళ్(అమృత్సర్) చీఫ్, లోక్‌సభ ఎంపీ సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ మరోలా స్పందించారు. అతను(అమృత్‌పాల్‌ను ఉద్దేశించి.. ) లొంగిపోకూడదని, పారిపోవాలని ఎంపీ సిమ్రన్‌జిత్ సింగ్ సూచించారు. ‘‘అమృత్‌పాల్ సింగ్ పోలీసులకు లొంగిపోకూడదు. రావి నది దాటేసి.. పాకిస్తాన్‌కు పారిపోవాలి. 1984లో మేం(సిక్కులం) అలాగే పాకిస్తాన్‌కు పారిపోలేదా? అలాగే ఇప్పుడు అమృత్‌పాల్ సింగ్ కూడా అలాగే పారిపోవాలి. అప్పుడే అతను తన ప్రాణాలను నిలబెట్టుకోగలడు’’.. అంటూ వ్యాఖ్యానించారాయన. నాటి పరిస్థితుల తరహాలోనే సిక్కు చరిత్రకు న్యాయం జరగాలంటే.. అతను పాక్‌కు పారిపోవడమే సరైన పని అంటూ సిమ్రన్‌జిత్ వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వాలు సిక్కులను అణచివేస్తోందని, హక్కులను కాలరాజేసే కుట్ర చేస్తోందని మండిపడ్డారాయన. ఇదిలా ఉంటే.. వివాదాలకు సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ కేరాఫ్. కిందటి ఏడాది పంజాబ్ సంగ్రూర్ నిజయోకవర్గ ఎంపీగా నెగ్గిన ఆయన.. మొదటి నుంచి ఖలీస్తానీ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతెందుకు.. తన విజయాన్ని ఖలీస్థానీ మిలిటెంట్ జర్నైల్ సింగ్ భింద్రావాలేకు అంకితం చేస్తున్నానని, కశ్మీర్లో భారత ఆర్మీ అకృత్యాలను పార్లమెంట్లో వినిపిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గిరిజన అమాయకులను నక్సలైట్ల పేరుతో చంపుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు కూడా. ఆపై భగత్ సింగ్‌ను ఉగ్రవాదిగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఇదిలా ఉంటే.. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను ఉద్దేశించి సిమ్రన్‌జిత్ వ్యాఖ్యలు చేశారు. ఆసమయంలో ఇందిరా గాంధీ దేశప్రధానిగా ఆపరేషన్ బ్లూస్టార్‌కు ఆదేశాలు ఇచ్చారు. సిక్కు ఉగ్రవాదిగా పేరున్న జర్నైల్ సింగ్ భింద్రావాలే, ఇతర ఖలీస్తానీ తీవ్రవాదుల ఏరివేత కోసం ఈ ఆపరేషన్ కొనసాగింది. అయితే.. సిక్కుల ఊచకోతకు ప్రతీకారగానే అదే ఏడాదిలో ఇందిరాగాంధీ తన సిక్కు బాడీగార్డుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యారు. మరోవైపు ఆపరేషన్ బ్లూస్టార్ పర్యవేక్షకుడైన లెప్టినెట్ జనరల్ కేఎస్ బ్రార్.. ఖలీస్తానీ వేర్పాటు వాదుల ఉద్యమం వెనుక పాక్ హస్తం ఉండొచ్చని, ప్రత్యేక దేశం కోసం డిమాండ్‌తో వాళ్లు ముందుకు సాగొచ్చని అభిప్రాయపడ్డారు కూడా. పాక్ సాయంతో పంజాబ్‌లో అలజడి, అల్లకల్లోలం సృష్టించేందుకు ఖలీస్తానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ ప్రణాళిక రచించాడని కేంద్ర నిఘా వర్గాలతో పాటు పంజాబ్ పోలీసులు కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే వారిస్ పంజాబీ దే అనే సిక్కు విభాగం నెలకొల్పాడని, కానీ అది ఖలీస్తానీ అనుకూల విభాగమని అధికారులు చెప్తున్నారు. అమృత్‌సర్‌కు దగ్గర్లోని అజ్నాలా పోలీస్ స్టేషన్ దగ్గర వందలాది మంది అమృత్‌పాల్ సింగ్ అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి.. సింగ్ ప్రధాన అనుచరుడిని విడిపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం, పంజాబ్ పోలీసుల సమన్వయతో అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు ఆపరేషన్ చేపట్టాయి. ఒకవైపు 30 ఏళ్ల అమృత్‌పాల్ సింగ్ తప్పించుకుంటూ తిరుగుతూ పంజాబ్ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. దాదాపు 13 రోజుల నుంచి అతని ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోగా.. పంజాబ్-హర్యానా ఉమ్మడి హైకోర్టు సైతం పంజాబ్ పోలీసులపై మండిపడింది. మరోవైపు పంజాబ్‌లోని పలు రాజకీయ పార్టీలు సహా సిక్కు సంఘాలు అమృత్‌పాల్ సెర్చ్ ఆపరేషన్‌పై మండిపడుతున్నాయి. అమృత్‌పాల్ అనుచరుల పేరుతో అమాయకులను జైల్లో పెడుతూ.. సిక్కుల హక్కులను కాలరాస్తున్నారంటూ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకోవైపు జతేదర్ ఆఫ్ అకాల్ తక్త్ అనే సిక్కు సంఘం.. పరారీలో ఉన్న అమృత్‌పాల్ సింగ్‌ను లొంగిపోవాలంటూ పిలుపు ఇచ్చింది. ఈ తరుణంలో వైశాఖి సందర్భంగా జరిగే కార్యక్రమం ద్వారా పోలీసులకు లొంగిపోవచ్చనే ప్రచారం తెర మీదకు వచ్చింది. కానీ, అదే వేదికగా సిక్కు సంఘాలు ఒక్కచోట చేరి తమ ఐక్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెబుతూ.. వీడియో సందేశం ద్వారా తనకు లొంగిపోయే ఉద్దేశం లేదని అమృత్‌పాల్ సింగ్ ప్రకటించాడు. ఇదీ చదవండి: డ్రోన్ ద్వారా గాలింపు.. వర్కవుట్ అవుతుందా? -
అమృత్‌పాల్ కోసం డ్రోన్‌తో గాలింపు
హోషియార్పూర్: వివాదాస్పద సిక్కు మత బోధకుడు అమృత్‌పాల్ సింగ్ జాడ కోసం పంజాబ్ పోలీసులు వేట ముమ్మరం చేశారు. గురువారం డ్రోన్‌ను రంగంలోకి దించారు. హోషియార్పూర్ జిల్లాలోని మర్నాయిన్ గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రోన్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల క్రితం ఇదే గ్రామంలో కొందరు అనుమానితులు తమకారును వదిలేసి పారిపోయారు. వారిలో అమృత్‌పాల్ ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, తాను ఎక్కడికీ పారిపోలేదని, త్వరలోనే ప్రపంచం ఎదుటకు వస్తానని అమృత్‌పాల్ వెల్లడించాడు. ఈ మేరకు గురువారం మరో వీడియో తెరపైకి వచ్చింది. చావంటే తనకు భయం లేదని ఆ వీడియోలో వ్యాఖ్యానించాడు. -
ఎరక్కపోయి ఇరుక్కున్నారుగా!.. సినిమాను తలపించే సీన్
చండీగఢ్: ఆయుధాలతో హల్చల్ చేస్తున్న క్రిమినల్స్‌కు పోలీసులు ఎదురుపడ్డారు. ఇరువురి ఎస్యూవీ వాహనాలు ఎదురుపడటంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. పోలీసులను గమనించిన క్రిమినల్స్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ఛేజింగ్ చేశారు.ఈ సంఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఈ సంఘటనలో క్రిమినల్ రికార్డ్ ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. క్రిమినల్స్ ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు బయలుదేరారు. అమృత్‌సర్‌లోని ఓ మార్కెట్లోని ఇరుకు రోడ్డులో ఇరువురి వాహనాలు ఎదురుపడ్డాయి. పోలీసులను గమనించిన వెనుక సీటులోని వ్యక్తి ముందుగా దిగి పరారయ్యాడు. ఆ తర్వాత డ్రైవర్ సైతం పరుగులు పెట్టాడు. వారిని పట్టుకునేందుకు సుమారు ఆరుగురు పోలీసులు ఛేజ్ చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ తర్వాత ఓ అధికారి తిరిగి వచ్చి వాహనంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అని తనిఖీ చేశారు. ఛేజింగ్ తర్వాత వివరాలు వెల్లడించారు పోలీసులు. ఇద్దరు క్రిమినల్స్ రవి, రాబిన్‌లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ‘ఇరువురిపై 5-6 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారి నుంచి 5 ఆయుధాలు, లైవ్ క్యాట్రిడ్జ్‌ను స్వాధీనం చేసుకున్నాం. తదుపరి విచారణ చేపట్టాం.’ అని అమృత్సర్ పోలీసు కమిషనర్ జస్కరన్ సింగ్ తెలిపారు. #WATCH | Punjab Police arrested two criminals in Amritsar and recovered 5 weapons and live cartridges from them. (CCTV footage confirmed by police) pic.twitter.com/vqo1czNWHR — ANI (@ANI) December 1, 2022 ఇదీ చదవండి: ‘భారత్ జోడో యాత్రతో చచ్చిపోతున్నాం’.. కమల్‌నాథ్ వీడియో వైరల్ -
వీడియో లీక్ ఘటన.. పంజాబ్ సీఎం కీలక నిర్ణయం
చండీగఢ్: చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు మహిళా అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఈమేరకు సీఎం భగవంత్ మాన్ ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి గురుప్రీత్ దేవ్ పర్యవేక్షణలో సిట్ ఈ కేసును వేగంగా విచారించనుంది. ముగ్గురు అరెస్టు.. యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనలో ఇప్పటివరకు మొత్తం ముగ్గురుని అరెస్టు చేశారు పోలీసులు. స్నానం చేస్తుండగా తానే స్వయంగా రికార్డు చేసుకున్న వీడియోను పంపిన అమ్మాయి, దీన్ని రిసీవ్ చేసుకున్న సిమ్లాకు చెందిన ఆమె బాయ్‌ఫ్రెండ్ సన్నీ మెహతాతో పాటు అతని స్నేహితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సహకరించిన హిమాచల్‌ప్రదేశ్ పోలీసులకు పంజాబ్ పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. వార్డెన్ల సస్పెన్షన్ వీడియో లీక్ చేసిన అమ్మాయిని హాస్టల్ వార్డెన్ తిట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో లీక్ విషయాన్ని పోలీసులకు ముందుగా చెప్పనందుకు ఆమెను, మరో వార్డెన్‌ను కూడా అధికారులు సస్పెండ్ చేశారు. 6 రోజులు క్లాసులు బంద్.. విద్యార్థినుల నిరసనలతో యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి శనివారం(సెప్టెంబర్ 24) వరకు క్లాసులు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే విద్యార్థుల డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించిందని, దీంతో వాళ్లు నిరసన విరమించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యూనివర్సిటీలో తమకు భద్రత లేదని కొంతమంది విద్యార్థినులు బ్యాగులు సర్ధుకుని ఇంటిబాట పట్టారు. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? -
వీడియో లీక్ ఘటన.. ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను అరెస్టు చేసిన పోలీసులు
చండీగఢ్: చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే వీడియో పంపిన విద్యార్థినిని అరెస్టు చేయగా.. తాజాగా హిమాచల్ ప్రదేశ్ సిమ్లాకు చెందిన ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడ్ని 23 ఏళ్ల సన్నీ మెహతాగా గుర్తించారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య రెండుకు చేరింది. అంతకుముందు ప్రైవేట్ వీడియోను తన బాయ్‌ఫ్రెండ్ సన్నీ మెహతాకు పంపిన అమ్మాయిని చండీగఢ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇది ఆమె సొంత వీడియో అని, ఇతర అమ్మాయిల వీడియోలేవీ లీక్ కాలేదని పేర్కొన్నారు. ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను అరెస్టు చేస్తే అసలు నిజాలు తెలుస్తాయన్నారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు నిందితులు సిమ్లాలోని రోహ్రూ ప్రాంతానికే చెందినవారని పోలీసులు వెల్లడించారు. చండీగఢ్ యూనివర్సిటీలో 60 అమ్మాయిలు స్నానం చేసే వీడియోలు లీక్ అయ్యాయని తొలుత ప్రచారం జరిగింది. దీనిపై తీవ్రదుమారం చెలరేగింది. విద్యార్థినులంతా యూనివర్సిటీలో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. నిందితులకు కఠిన శిక్ష విధిస్తామని హామీ ఇచ్చారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
యూనివర్సిటీ విద్యార్థిని వీడియో లీకు ఘటన.. పోలీసులు ఏం చెప్తున్నారంటే..
చండీగఢ్: చండీగఢ్ యూనివర్సీలో అమ్మాయిల ప్రైవేటు వీడియోల లీక్ ఘటనపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఒక అమ్మాయి తన సొంత వీడియోను మాత్రమే బాయ్‌ఫ్రెండ్‌కు పంపిందని చెప్పారు. అతను హిమచాల్ ప్రదేశ్‌కు చెందినవాడని వెల్లడించారు. వీడియో పంపిన అమ్మాయిని అరెస్టు చేసి విచారించిన తర్వాతే ఈ విషయం తెలిసిందని చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో అమ్మాయి బాయ్‌ఫ్రెండ్ పాత్ర ఏమైనా ఉందా? అనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. అతడ్ని అరెస్టు చేసి విచారిస్తేనే అసలు నిజం బయటపడుతుందన్నారు. సొంత వీడియో లీక్ చేసుకున్న అమ్మాయి ఇతర అమ్మాయిల వీడియోలను కూడా రికార్డు చేసిందా? అనే విషయంపైనా విచారణ చేస్తామన్నారు. అలాగే యూనివర్సిటీలో ఇప్పటివరకు ఒక్క విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు. అత్యంత సున్నితమైన ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది అమ్మాయిలు స్నానం చేస్తుండగా తీసిన వీడియోలు లీక్ అయ్యాయని ప్రచారం జరిగింది. దీనిపై విద్యార్థినులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి యూనివర్సిటీలో నిరసనలు చేపట్టారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అయితే లీక్ అయింది ఒక్క అమ్మాయి వీడియోనే అని యూనివర్సిటీ అధికారులతో పాటు పోలీసులు స్పష్టతనిచ్చారు. మరోవైపు ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు. కాగా.. యూనివర్సిటీలో ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు (సెప్టెంబర్ 19,20) క్లాసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
Azadi Ka Amrit Mahotsav: పంజాబ్‌లో ఉగ్ర ముఠా గుట్టు రట్టు
చండీగఢ్: స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ఉగ్రవాద ముఠాను పంజాబ్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులతో కలిసి చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో నలుగురు టెర్రరిస్టులను అరెస్టు చేశారు. వారినుంచి హాండ్ గ్రెనేడ్లు, అత్యాధునిక మందుపాతరలు, పిస్టళ్లు, 40 బులెట్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ‘‘వీరికి పాకిస్తానీ నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతుంది. అంతేగాక కెనడా, ఆస్ట్రేలియాకు చెందిన కరడుగట్టిన భారత సంతతి గ్యాంగ్స్టర్లు అర్‡్ష డల్లా, గుర్జంత్ సింగ్‌లతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి’’ అని వివరించారు. పంద్రాగస్టు సందర్భంగా పేలుళ్లకు పాల్పడి దేశంలో కల్లోలం సృష్టించాల్సిందిగా వీరికి ఆదేశాలున్నట్టు చెప్పారు. నలుగురినీ ఐదు రోజుల రిమాండ్‌లోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో చండీగఢ్‌లో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. జైషే ఉగ్రవాది అరెస్టు లఖ్‌నవూ: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హబీబుల్ ఇస్లాం అలియాస్ సైఫుల్లా అనే 19 ఏళ్ల యువకున్ని యూపీ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అరెస్టు చేసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌కు చెందిన జైషే సభ్యులతో అతను సోషల్ మీడియా ద్వారా లింకులు పెట్టుకున్నట్టు తెలిపారు. సస్పెండెడ్ బీజేపీ నేత నుపుర్ శర్మ హత్య కోసం జైషే పంపిన మహ్మద్ నదీమ్‌ను ఇటీవల ఏటీఎస్ అరెస్టు చేసింది. అతనిచ్చిన సమాచారం ఆధారంగా సైఫుల్లాను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంది. ‘‘వర్చువల్ ఐడీలు సృష్టించడంలో సైఫుల్లా దిట్ట. నదీమ్‌తో పాటు పాక్, అఫ్గాన్‌కు చెందిన ఉగ్రవాదులకు 50కి పైగా వాటిని అందజేశాడు’’ అని వివరించింది. -
‘ఐ లైక్ యూ’ అంటూ మెసేజ్ పెట్టాడు.. పోలీసుల రిప్లై చూసి..
చెరపకురా చెడేవు అంటే ఇదేనేమో.. తన పని తాను చూసుకోకుండా.. సోషల్ మీడియా ఉంది కాదా అని ఓ వివాహితకు ‘ఐ లైక్ యూ’ అని మెసేజ్ పెట్టాడు ఓ ప్రబుద్దుడు. ఎవరో తెలియని వ్యక్తి ఇలా మెసేజ్ పెట్టడం ఏంటని ఆమె షాకైంది. ఈ విషయాన్ని తన భర్తకు చెప్పింది. రంగంలోకి దిగిన సదరు భర్త.. ప్రబుద్ధుడికి వివరాలు తెలుసుకుని ఇంటికి వెళ్లి మరీ దేహశుద్ది చేసి.. గట్టి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో, బాధితుడు.. ట్విట్టర్ వేదికగా పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయం చెప్పాడు. దానికి పోలీసులు సమాధానం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. Not sure what you were expecting on your unwarranted message to a woman, but they should not have beaten you up. They should have reported you to us and we would have served you right under right sections of law. Both these offences will be duly taken care of as per law! https://t.co/qGmXNvubcO — Punjab Police India (@PunjabPoliceInd) July 19, 2022 వివరాల ప్రకారం.. ఓ మహిళ మొబైల్‌కి నువ్వంటే నాకు ఇష్టం (I Like You) అని ఓ వ్యక్తి మెసేజ్ పెట్టాడు. దీంతో ఆమె భర్త వచ్చి.. అతడిని చితకబాదాడు. అనంతరం జరిగిన ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ట్విట్టర్ వేదికగా "సార్.. నేను ఒకరికి I like u మెసేజ్ పంపాను. ఆమె భర్త వచ్చి నన్ను దారుణంగా కొట్టాడు. నేను చాలాసార్లు క్షమించమని అడిగాను. అయినా సరే అతను కొట్టాడు. ఇప్పుడు నాకు రక్షణ కావాలి అనిపిస్తోంది. దయచేసి ఏదైనా చెయ్యండి. నన్ను కాపాడండి. ఆయన మళ్లీ నాపై దాడి చేసే అవకాశం ఉంది’’ అని రాసుకొచ్చాడు. దీనికి పోలీసులు ట్విట్టర్ వేదికగానే బదులిస్తూ.. "మీరు ఓ మహిళకు అలా మెసేజ్ పెట్టి ఆమె నుంచి ఏం ఆశిస్తున్నారో మాకు తెలియదు. ఆమె భర్త మాకు ఫిర్యాదు చేయకుండా మిమ్మల్ని అలా కొట్టడం కూడా కరెక్ట్ కాదు. మేము మీకు సరైన సెక్షన్ కింద సరైన శిక్ష వేస్తాం. ఈ రెండు అంశాలకూ చట్ట ప్రకారం దర్యాప్తు ఉంటుంది. ఇద్దరి పైనా చట్టప్రకారం చర్యలుంటాయి" అని తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు.. మీ సమీప పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయండి అని స్పష్టం చేశారు. కాగా, ఇలాంటి రియాక్షన్‌కు ఖంగుతిన్న బాధితుడు కామ్‌గా ఉండిపోయాడు. దీంతో, వీరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. You can visit the nearest PS and lodge the complaint. — Punjab Police India (@PunjabPoliceInd) July 19, 2022 -
పంజాబ్: పొలీసులు, గ్యాంగ్స్టర్స్ మధ్య భీకర కాల్పులు
-
పంజాబ్‌లో ఎన్కౌంటర్.. సిద్ధూ హత్యకేసులో ఇద్దరు నిందితులు హతం
చండీగఢ్: పంజాబ్‌లోని అమృత్సర్ సమీపంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇద్దరు నిందితులు హతమయ్యారు. ముగ్గురు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. సిద్ధూ మూసేవాలా హత్య కేసుతో సంబంధమున్న గ్యాంగ్స్టర్స్ చీతాబక్నా ప్రాంతంలో తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. అమృత్సర్-పాకిస్థాన్ సరిహద్దు అట్టారీ సమీపంలో ఈ ప్రాంతం ఉంది. దీంతో అక్కడ నిర్బంధ తనిఖీలు నిర్వహించి పోలీసు బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. వీరిని చూసిన గ్యాంగ్స్టర్స్ కాల్పులు జరపడం వల్ల ఎన్‌కౌంటర్‌కు దారితీసినట్లు అధికారులు తెలిపారు. సిద్ధూ హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు షార్ప్ షూటర్లు జగ్దీప్ సింగ్ రూప, మన్ను కుసా(మన్‌ప్రీత్ సింగ్) ఇక్కడే తలదాచుకున్నారు. పోలీసుల కాల్పుల్లో ఈ ఇద్దరు నిందితులు చనిపోయినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47, పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. #WATCH | Punjab: Encounter underway between police & gangsters at Cheecha Bhakna village of Amritsar district in Punjab (Visuals deferred by unspecified time) pic.twitter.com/hfVkTH0oTH — ANI (@ANI) July 20, 2022 చదవండి: సుప్రీంకోర్టులో థాక్రేకు మళ్లీ ఎదురుదెబ్బ.. సీఎం షిండే వర్గానికి గడువిచ్చిన సుప్రీం -
సిద్ధూ హత్య కేసు: నలుగురు నిందితుల గుర్తింపు!
ఛండీగఢ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు మంగళవారం పంజాబ్ పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. హత్యలో పాల్గొన్న నలుగురు షూటర్లను గుర్తించినట్లు తెలిపారు. హత్య కుట్రకు సహకరణ, రెక్కీ నిర్వహణ, షూటర్లకు ఆశ్రయం కల్పించారనే నేరారోపణలపై ఈ ఎనిమిది మందిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో సిద్ధూతో ఘటనకు ముందు సెల్ఫీ తీసుకున్న వ్యక్తి కూడా ఉన్నాడు. అంతేకాదు.. ఈ హత్యలో పాల్గొన్న నలుగురు షూటర్లను గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం వీళ్ల కోసం వేట కొనసాగుతోందని ప్రకటించారు పోలీసులు. అరెస్టయిన వాళ్లను.. సందీప్ సింగ్ అలియాస్ కేక్డా(సిస్రా), మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ మన్నా(బతింద), మన్‌ప్రీత్ బావు(ఫరీద్కోట్), ఇంకా అమృత్‌సర్‌తో పాటు హర్యానాకు చెందిన ప్రాంతాల నుంచి నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే హత్యలో పాల్గొన్న షూటర్ల వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. మే 29వ తేదీన.. పంజాబీ ప్రముఖ సింగర్ సిద్ధూ మూసేవాలా దారుణంగా కాల్పుల ఘటనలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. చదవండి: సిద్ధూ అలా చేసి ఉంటే ప్రాణాలతో ఉండేవాడేమో! -
కేజ్రీవాల్ కిడ్నాప్ చేసేందుకు యత్నించారు: తజిందర్ బగ్గా
న్యూఢిల్లీ: పంజాబ్ పోలీసులను ఉపయోగించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గా ఆరోపించారు. ఆయన గుండాయిజాన్ని ప్రదర్శించి మరీ తనను కిడ్నాప్ చేశారంటూ విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ కిడ్నాప్ చేసేందుకు యత్నించారంటే నిజంగా ఆయన ఎంతలా భయపడుతున్నారో అర్థమవుతందని ఎద్దేవా చేశారు. అంతేకాదు అరవింద్ కేజ్రీవాల్‌కు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా పోలీసులను రంగంలోకి దింపి వారిని అణిచేస్తారని బగ్గా ఆరోపించారు. భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) జాతీయ కార్యదర్శి తజిందర్ రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని, మతపరమైన శత్రుత్వాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ ఆప్ నాయకుడు సన్నీసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మే 6న తాజిందర్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు మార్చి 30న జరిగిన నిరసనల్లో అరవింద్ కేజ్రీవాల్‌ను బగ్గా బెదిరించినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. అలాంటి ఆరోపణలు చేసినప్పుడూ ఎఫ్ఐఆర్లో పంజాబ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించానని పేర్కొనాలి కానీ కేజ్రీవాల్‌ని చంపుతానని బెదిరించినట్లు పేర్కొన్నారు. అయినా తాను ఎవర్నీ బెదిరించలేదని ఇది కేవలం వ్యావహారిక వ్యక్తీకరణ మాత్రమే అని బగ్గా అన్నారు. అయినా తన పై వెయ్యి ఎఫ్ఐఆర్లు నమోదు చేసినప్పటికీ గురుగ్రంథ సాహిబ్‌ను అపవిత్రం చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని తాను ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. ఈ మేరకు బగ్గా ఢిల్లీ డిప్యూటీ సీఎం సహాయకుడు అల్లర్ల కేసులో జైలు కెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తూ...కేజ్రీవాల్‌ను ఇతర పార్టీల్లో లోపాలను వేలెత్తి చూపించే ముందు తమ సొంత పార్టీలోని లోపాలను సరిదిద్దుకోమని నొక్కి చెప్పారు. (చదవండి: దేశానికి తదుపరి ప్రధాని అమిత్ షా?.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు) -
బగ్గా అరెస్ట్; మూడు రాష్ట్రాల పోలీసుల ‘టగ్ ఆఫ్ వార్’
న్యూఢిల్లీ: బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గాను పంజాబ్ పోలీసులు ఇవాళ ఢిల్లీలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బగ్గా అరెస్ట్ మూడు రాష్ట్రాల పోలీసుల మధ్య ‘టగ్ ఆఫ్ వార్’గా మారింది. బగ్గా అరెస్ట్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే.. 50 మంది పోలీసులు.. అరెస్ట్ శుక్రవారం ఉదయం 8:30 గంటల సమయంలో ఢిల్లీలో బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 50 మంది పోలీసులు మిస్టర్ బగ్గా ఢిల్లీ ఇంటిలోకి చొరబడి అతడిని అరెస్టు చేశారని ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి నవీన్ కుమార్ జిందాల్ ఆరోపించారు. తలపాగా ధరించే సమయం కూడా ఇవ్వకుండా అతడిని బలవంతంగా లాక్కుపోయారని అన్నారు. కిడ్నాప్ అంటూ కేసు దాదాపు 10-15 మంది పోలీసులు తమ ఇంట్లోకి ప్రవేశించి, తన కుమారుడిని కొట్టి బయటకు లాక్కొచ్చారని బగ్గా తండ్రి ప్రీత్ పాల్ ఆరోపించారు. వీడియో రికార్డ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు తన ఫోన్‌ను లాక్కున్నారని.. బగ్గా ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. తన కొడుకును కిడ్నాప్ చేశారంటూ ఆయన కేసు పెట్టారు. దీంతో పంజాబ్ పోలీసులపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముందస్తు సమాచారం లేదు తజిందర్ సింగ్ అరెస్ట్‌పై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అయితే పంజాబ్ పోలీసులు మాత్రం ఈ ఆరోపణను తోసిపుచ్చారు. ముందస్తు సమాచారం ఇచ్చామని.. దీనికి అనుగుణంగానే తమ బృందం ఒకటి గురువారం సాయంత్రం నుంచి జనక్‌పురి పోలీస్ స్టేషన్లో ఉందని వెల్లడించారు. హరియాణా టు ఢిల్లీ తజిందర్ సింగ్‌ను మొహాలి తీసుకెళుతుండగా హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. తజిందర్ సింగ్ తండ్రి కిడ్నాప్ కేసు పెట్టడంతో ఈ మేరకు వ్యవహరించినట్టు హరియాణా పోలీసులు తెలిపారు. దీంతో హరియాణా నుంచి ఢిల్లీకి తజిందర్ సింగ్‌ను తీసుకొచ్చారు. బగ్గాను కిడ్నాప్ చేయలేదని, తమ రాష్ట్రంలో నమోదైన కేసు ఆధారంగా అతడిని అరెస్ట్ చేశామని హరియాణా పోలీసు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా వివరించినా వినిపించుకోలేదని పంజాబ్ పోలీసులు వాపోయారు. టార్గెట్ కేజ్రీవాల్ తజిందర్ సింగ్‌పై మొహాలి జిల్లాలోని సాహిబ్జాదా అజిత్ సింగ్ నగర్‌లోని సైబర్ సెల్లో కేసు నమోదైంది. విద్వేష ప్రకటనలు చేయడం, మతపరమైన శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, నేరపూరిత బెదిరింపుల ఆరోపణల కింద అతడిపై కేసు నమోదు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని ట్విటర్లో బగ్గా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాడు. ముఖ్యంగా 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాపై కేజ్రీవాల్ స్పందనపై అసంతృప్తితో అతడు రెచ్చిపోయి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. విచారణకు సహకరించనందుకే.. బగ్గాపై కేసు వ్యవహారంలో పంజాబ్ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఐదుసార్లు నోటీసులు పంపిన తర్వాత కూడా విచారణకు సహకరించేందుకు బగ్గా నిరాకరించడంతో అతడిని అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన, విషపూరితమైన, ద్వేషపూరితమైన పదజాలం వాడుతూ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించాడని వెల్లడించారు. పంజాబ్ అభ్యర్థనకు హైకోర్టు నో తజిందర్ సింగ్‌ను హరియాణాలోనే ఉంచాలన్న పంజాబ్ ప్రభుత్వ అభ్యర్థనను పంజాబ్- హరియాణా హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. హరియాణా పోలీసులు బగ్గాను ఢిల్లీ పోలీసులకు అప్పగించడంతో పంజాబ్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో హరియాణా పోలీసుల జోక్యం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పంజాబ్ అడ్వకేట్ జనరల్ (ఏజీ) అన్మోల్ రతన్ సిద్ధూ. హైకోర్టులో వాదించారు. ఢిల్లీ పోలీసులను బగ్గాతో కలిసి హరియాణా సరిహద్దు దాటనివ్వవద్దని కూడా కోర్టును అభ్యర్థించారు. (క్లిక్: సీఎంకు బెదిరింపులు.. బీజేపీ నేత అరెస్ట్) -
సీఎంను చంపేస్తానంటూ వార్నింగ్.. బీజేపీ నేత అరెస్ట్
ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తజిందర్ సింగ్ బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, బగ్గా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తానని వ్యాఖ్యలు చేసిన కారణంగా అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. మార్చి 30వతేదీన జరిగిన నిరసన ప్రదర్శనలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను బగ్గా బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలను ఆప్ నేతలు పోలీసులకు అందజేశారు. దీంతో అతడిని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిట్టు తెలిపారు. ఈ మేరకు బగ్గాను అరెస్టు చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి కపిల్ మిశ్రా స్పందిస్తూ.. తన రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకే కేజ్రీవాల్ ఇలా అరెస్టులు చేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. लुच्चे-लफ़ंगो की पार्टी भाजपा नेता @TajinderBagga को पंजाब पुलिस ने गिरफ़्तार किया। मुख्यमंत्री अरविंद केजरीवाल जी को दिया था “जीने नही देंगे” की धमकी। pic.twitter.com/LzZmPVaDRQ — MLA Naresh Balyan (@AAPNareshBalyan) May 6, 2022 ఇది కూడా చదవండి: మమత, అమిత్ షా పరస్పర విమర్శలు -
పంజాబ్‌కు ‘కార్వీ’ పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథిని పంజాబ్ పోలీసులు ఆ రాష్ట్రానికి తరలించారు. అక్కడి బర్నాలా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో విచారించనున్నారు. బర్నాలాకు చెందిన ఓ వ్యక్తిని రూ.25 లక్షల మేర మోసం చేసినట్లు గతేడాది కేసు నమోదైంది. అయితే అక్కడి పోలీసులు ఇప్పటిదాకా ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు. గత నెల్లో హైదరాబాద్‌లో నమోదైన కేసుకు సంబంధించి పార్థసారథిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయా కేసుల్లో ఇతడి కస్టడీ, విచారణలు సైతం పూర్తి చేశారు. దీనిపై సమాచారం అందుకున్న బర్నాలా అధికారులు తమ వద్ద ఉన్న కేసుకు సంబంధించి పార్థసారథిని తీసుకురావడానికి ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయాలని అక్కడి కోర్టును కోరారు. ఇది జారీ కావడంతో బర్నాలా ఠాణాకు చెందిన ఏఎస్సై కమల్జీత్ సింగ్ నగరానికి చేరుకున్నారు. మంగళవారం నాంపల్లి కోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేసి నిందితుడి తరలింపునకు అనుమతి కోరారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం పార్థసారథిని పంజాబ్ పోలీసులకు అప్పగించాల్సిందిగా చంచల్‌గూడ జైలు అధికారులను ఆదేశించింది. దీని ఆధారంగా ఆయనను పంజాబ్ పోలీసులు బర్నాలాకు తరలిస్తున్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులను భవిష్యత్తులో అక్కడకు తీసుకెళ్లనున్నారు. మరోవైపు, కార్వీపై ముంబైకి చెందిన మరో బాధితుడు లలిత్ బండారీ ఇటీవల హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. లలిత్ బండారీకి డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేస్తామని, ట్రేడింగ్ కూడా చేస్తామమంటూ రూ.1.13 కోట్లు తీసుకుని కార్వీ మోసం చేసింది. ఆ డబ్బునూ ఇతర సంస్థల్లోకి మళ్లించేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దాన్ని అక్కడకు బదిలీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
200 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
చండీగఢ్: అంతర్జాతీయ మార్కెట్లో రూ. 200 కోట్ల విలువ చేసే 40 కేజీల హెరాయిన్‌ను పంజాబ్ పోలీసులు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు కలసి సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు. భారత్–పాక్ సరిహద్దు దగ్గర్లోని అమృత్‌సర్‌లో ఉన్న పంజ్‌గ్రైన్ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్లు అమృత్సర్ (రూరల్) సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుల్నీత్ సింగ్ ఖురానా తెలిపారు. ఘరిందా ప్రాంతానికి చెందిన అక్రమ రవాణాదారు నిర్మల్ సింగ్ పాకిస్తాన్ నుంచి రానున్న హెరాయిన్‌ను తీసుకుంటాడని పోలీసులకు సమాచారం అందింది. భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దు ద్వారా ఈ అక్రమరవాణా జరగనుందని గుర్తించిన పోలీసులు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు సమాచారం ఇచ్చారు. దీంతో ఇరు బలగాలు కలసి అక్రమరవాణా పనిపట్టారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన 40.810 కేజీల హెరాయిన్(39 పాకెట్లు), 180 గ్రాముల ఓపియం, రెండు ప్లాస్టిక్ పైపులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పాకిస్తాన్లో తయారు చేసినట్లు గుర్తించారు. నిర్మల్ సింగ్‌ను పట్టుకునేం దుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదైనట్లు తెలిపారు. -
బ్యాండ్ బాజాతో సాహస పోలీసుకు స్వాగతం
చండీగఢ్ : పంజాబ్‌లోని పాటియాలాలో జరిగిన అల్లరిమూకల దాడిలో గాయపడిన సబ్ఇన్స్పెక్టర్ హర్జీత్ సింగ్ గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. లాక్డౌన్ సమయంలో పటియాలా జిల్లా సనౌర్ పట్టణంలో ఏప్రిల్ 12న నిహంగ్(సిక్కుల్లోని ఓ వర్గం)లు హర్జీత్ సింగ్ చేతిని కత్తితో నరికారు. ఆయనను వెంటనే పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(పీజీఐఎంఈఆర్)కు తరలించగా వైద్య బృందం హర్జీత్ సింగ్ తెగిపోయిన చేతిని ఏడున్నర గంటలపాటు సర్జరీ చేసి విజయవంతంగా అతికించారు. (చదవండి : లాక్డౌన్: అడ్డొచ్చిన పోలీసు చేయి నరికేశాడు!) చేయి రీప్లాంటేషన్ పూర్తయ్యాక.. ఆస్పత్రిలో కోలుకున్న హర్జీత్, గురువారం పాటియాలాలోని తన ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా తోటి ఉద్యోగులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆస్పత్రి నుంచి ఇతర వాహనాల్లో అతని కారును అనుసరిస్తూ ఆయన ఇంటి వరకూ వచ్చారు. హర్జీత్ సింగ్ ఇంటి ముందుకు చేరుకోగానే బ్యాండ్ బాజాలతో పాటు ఎర్ర తివాచీ పరచి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక హర్జీత్ కారు నుంచి దిగగానే ఆయన కుటుంబ సభ్యులు ఆయనపై పూల వర్షం కురించారు. విపత్కర పరిస్థితుల్లో తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన హర్జీత్ సింగ్ కు సబ్ ఇన్ స్పెక్టర్ గా పదోన్నతి కల్పిస్తున్నట్లు డీజీపీ దినకర్ గుప్తా వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే అతని కొడుకుకి కూడా కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ఇచ్చారు. (చదవండి : సాహస పోలీసు.. కోలుకున్నారు) -
‘మే భీ హర్జీత్ సింగ్’
హిమాయత్ నగర్: ఇటీవల పంజాబ్ లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సై హర్జీత్ సింగ్ చెయ్యి నరకడం చాలా బాధాకరం అని అబిడ్స్ డివిజన్ ఏసీపీ భిక్షం రెడ్డి అన్నారు. అర్జీత్ సింగ్ కి మద్దతుగా సోమవారం కింగ్ కోఠి వైద్య విధాన పరిషత్ హాస్పిటల్ వద్ద పంజాబ్ ఏఎస్సై కి సంఘీభావంగా ‘మే భీ హర్జీత్ సింగ్’అనే ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఏసీపీ రామదాసు, ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్, క్రైం ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సైలు కర్ణాకర్ రెడ్డి, సైదులు, నవీన్ పాల్గొన్నారు. ఖైరతాబాద్: అలాగే ఘటనలో ఏఎస్ఐ గాయపడి కోలుకున్న సందర్భంగా సోమవారం సాయంత్రం సైఫాబాద్ పోలీసులు ’హర్జీత్ సింగ్‌కు మీకు మేము అండగా ఉంటాం’ అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, సైఫాబాద్ ఇన్స్‌స్పెక్టర్ సైదిరెడ్డి, డీఐ రాజునాయక్, సిబ్బంది పాల్గొన్నారు. -
316 కాటన్ల అక్రమ మద్యం సీజ్
చంఢీఘర్ : పంజాబ్‌లోని జలంధర్‌లో భారీగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. లాక్డౌన్ సమయంలో అక్రమంగా తరలిస్తున్న మొత్తం 316 కాటన్ల మద్యాన్ని సీజ్ చేశారు. అరెస్టైన వారిలో అమిత్ కుమార్, అంకిత్, రామ్ సేవక్‌లు ఉన్నారు. -
మీరిచ్చిన బహుమతి ఎప్పటికి గుర్తుంటుంది
-
వైరల్ : మీరిచ్చిన బహుమతి ఎప్పటికి గుర్తుంటుంది
మాన్సా : తల్లిదండ్రులు తమ పిల్లల మొదటి పుట్టిన రోజు వేడుకలను పెద్ద పండగలా నిర్వహిస్తారు. తమ బంధువులను, మిత్రులను పిలిచి అంగరంగ వైభవంగా జరుపుతారు. వారి జీవితంలో అదొక మరుపురాని జ్ఞాపకంగా మలుచుకోవాలని అనుకుంటారు. కానీ కరోనా నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితులు తలకిందులయ్యాయి. దేశం మొత్తం లాక్డౌన్లో ఉండడంతో జనాలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక బర్త్‌డే పార్టీల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే పంజాబ్‌లోని మన్సా పోలీస్ అధికారులు ఒక చిన్నారి పుట్టిన రోజు వేడుకలు వినూత్న రీతిలో నిర్వహించారు. తమ బైక్‌పై వచ్చిన కొందరు పోలీసులు లాక్డౌన్ డ్యూటీ చేస్తూనే ఒక ఇంటికి వెళ్లి మొదటి పుట్టిన రోజు జరుపుకుంటున్న చిన్నారి తల్లికి కేకును అందించారు. అంతేగాక తర్వాత హ్యాపి బర్త్‌డే పాటను పాడి చిన్నారిని దీవించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. లాక్డౌన్ పుణ్యానా తమ పాపకు ఫస్ట్ బర్త్‌డే వేడుకలు చేయలేకపోయామన్న నిరాశలో ఉన్న తల్లిదండ్రులకు పోలీసుల పని ఆనందాన్ని కలిగించింది. (కరోనా : పోలీసుల ఐడియా అదుర్స్) ఇదే విషయం పోలీసులను అడిగితే.. మేం చేసిన పుట్టిన రోజు వేడుకలు పాపకు గుర్తు కూడా ఉండదు. కానీ ఇటువంటి క్లిష్ట సమయంలో పాప మొదటి పుట్టిన రోజు వేడుకలు జరపడం మాకు సంతోషాన్నిస్తుంది. అంతేగాక పాప తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఎప్పటికి మరిచిపోరు. పాప పెద్దయ్యాక దీని గురించి తప్పక వివరిస్తారంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు పోలీసుల పనిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. -
కరోనా: నిబంధనల అతిక్రమణ.. నడిరోడ్డుపై..
-
కరోనా: నిబంధనల అతిక్రమణ.. నడిరోడ్డుపై..
చంఢీగర్: మహమ్మారి కరోనా విజృంభణ ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 16 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. 3 లక్షల 80 వేల మంది చికిత్స పొందుతున్నారు. ఇక భారత్‌లో సైతం ప్రాణాంతక కోవిడ్‌తో 10 మంది మృతి చెందగా.. 500 మందికి పాజిటివ్ అని తేలింది. ఈనేపథ్యంలో ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునివ్వగా.. కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. అయితే, ప్రజల్లో మాత్రం సీరియస్‌నెస్ కనిపించడం లేదు. రవాణా వ్యవస్థపై తీవ్ర ఆంక్షలు ఉన్నప్పటికీ రోడ్లపైకి వస్తున్నారు. దీంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులకు జరిమానాలతో పాటు, అవసరమైతే కేసులూ పెడుతున్నారు. ఈ క్రమంలో పంజాబ్ పోలీసులు కొందరు వాహనదారులకు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లఘించిన వాహనదారులను నడిరోడ్డుపై పడుకోబెట్టి.. ‘రూల్స్‌ని పాటిస్తాం.. ఇంకోసారి రోడ్లపైకి రాబోము’ అని చెప్పిస్తున్నారు. ఈ వీడియోను పంజాబ్ ఐపీఎస్ అధికారి పంకజ్ నైన్ ట్విటర్లో పోస్టు చేయగా వైరల్ అయింది. ‘సామాజిక దూరం పాటించకపోతే.. ఇలాంటి శిక్షలు తప్పవు. దూరం దూరంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి. ఇది పిక్నిక్ టైమ్ కాదు’ అని ఐపీఎస్ అధికారి క్యాప్షన్ పెట్టారు. -
పంజాబ్ హాకీ ‘పోరు’
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ హాకీ టోర్నమెంట్ ఫైనల్లో పంజాబ్ పోలీస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) జట్ల ఆటగాళ్లు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. మ్యాచ్ మూడో క్వార్టర్లో పంజాబ్ పోలీస్ సర్కిల్‌లోకి దూసుకొచ్చిన పీఎన్బీ గోల్ అవకాశం సృష్టించుకునే ప్రయత్నంలో ఉండగా ఇది జరిగింది. ఒక్కసారిగా ఇరు జట్ల ఆటగాళ్లు మాటలను దాటి ముష్టిఘాతాలకు దిగారు. ఆ తర్వాత హాకీ స్టిక్‌లతో ఒకరితో మరొకరు తలపడ్డారు. మ్యాచ్ అధికారులు కలగజేసుకొని ఆపే వరకు ఇది కొనసాగింది. ఆ సమయంలో స్కోరు 3–3తో సమంగా ఉంది. రిఫరీలు ఇరు జట్ల నుంచి ముగ్గురేసి ఆటగాళ్లను రెడ్ కార్డుల ద్వారా బయటకు పంపి 8 మంది సభ్యుల జట్లతోనే మ్యాచ్‌ను కొనసాగించారు. చివరికి 6–3తో గెలిచిన పీఎన్బీ టైటిల్ సొంతం చేసుకుంది. తాజా ఘటనతో ఈ టోర్నీలో పాల్గొనకుండా నిర్వాహకులు పంజాబ్ పోలీస్‌పై నాలుగేళ్లు, పీఎన్బీపై రెండేళ్ల నిషేధం విధించారు. -
పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉగ్రవాదుల అరెస్ట్
చంఢీఘర్ : పంజాబ్‌లోని తార్న్ తారన్ జిల్లాలో ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను సోమవారం పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 10 లక్షల విలువైన ఆయుధాలు, పెద్ద ఎత్తున నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లో రిజిస్ట్రేషన్ అయిన మారుతీ స్విఫ్ట్ కారులో అమృత్‌సర్‌కు వెళుతున్న బల్వంత్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, హర్బజన్ సింగ్, బల్బీర్ సింగ్‌పై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వీరిలో ఆకాశ్‌దీప్ సింగ్, బల్వంత్ సింగ్‌లపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారు. కాగా, ఈ వాదనలకు బలం చేకూరుస్తూ.. జమ్మూ-కశ్మీర్లో మరోసారి భయాందోళనను సృష్టించేందుకు పాకిస్తాన్, భారత్ సరిహద్దులో ఉన్న అమృత్‌సర్‌లో డ్రోన్ల ద్వారా ఎకె-47, గ్రనైడ్లను వదిలివెళ్లినట్లు సమాచారం అందిందని పంజాబ్ పోలీసులు నిర్దారించారు. కేవలం నెల వ్యవధిలోనే 8 డ్రోన్ల ద్వారా ఆయుధాలతో పాటు సాటిలైట్ ఫోన్లను భారతగడ్డపై వదిలివెళ్లినట్లు గుర్తించామని తెలిపారు. ఈ డ్రోన్లు అత్యంత వేగంగా ఎగురుతూ 5 కేజీల బరువును సలువుగా మోస్తాయని, సమాచారాన్నివేగంగా పసిగడతాయని వెల్లడించారు. అలాగే వారిని అదుపులోకి తీసుకున్న ప్రదేశంలో సగం కాలిపోయిన డ్రోన్ దొరికిందని, పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లే సమయంలో డ్రోన్‌లో ఇబ్బంది తలెత్తడంతో ఉగ్రవాదులే దానిని కాల్చడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. గత ఆగస్టులో ఇదే తరహాలో పంజాబ్‌కు చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ టీం అమృత్‌సర్‌లో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థను కోరినట్లు పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌లో దాడులు చేసేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులకు డ్రోన్ల ద్వారా ఆయుధాలను సరఫరా చేస్తుందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కల్పించుకొని వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నట్లు తెలిపారు. -
దారుణం.. మహిళను పోలీస్ జీప్‌పై కట్టేసి..
అమృత్సర్ : పంజాబ్ పోలీసులు ఓ మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఓ మహిళా అనే కనీస గౌరవం లేకుండా ఆమెను జీపు పై భాగంలో కట్టేసి ఊరంతా తిప్పారు. ఈ దారుణ సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. అమృత్‌సర్‌లోని చవిందా దేవి గ్రామానికి చెందిన బాధితురాలి మామ ఓ ఆస్తివివాదంలో నిందితుడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేయడానికి వాళ్ల ఇంటికి వెళ్లగా అతను లేడు. దీంతో వారు ఆమె భర్తను తీసుకెళ్లడానికి ప్రయత్నించగా అడ్డుకుంది. ఆగ్రహానికిలోనైన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను బలవంతగా జీపు పైభాగాన్ని కట్టేసి ఊరంతా తిప్పారు. వాహనాన్ని వేగంగా పోనివ్వడంతో ఆమె కిందపడిపోయింది. ఈ ఘటనలో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బంధువులు తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు సైతం పోలీసుల తీరుపై మండిపడుతున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ పోలీసులు ముస్లిం యువకుడిని ప్రేమించిందని ఓ యువతిని జీపులో ఎక్కించి కొడుతూ అమానుషంగా ప్రవర్తించిన వీడియో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. (చదవండి: ప్రేమ వ్యవహారం: యువతిని హింసించిన పోలీసులు) -
వైరల్: నవ్వుల పాలైన పోలీసులు
చండీగఢ్ : అప్పుడప్పుడు మేథావులు కూడా చిన్న చిన్న పొరపాట్లు చేయడం సహజం. ఇలాగే ఓ చిన్న పొరపాటు చేసి నవ్వుల పాలైయ్యారు పంజాబ్ పోలీసులు. తరచూ నేరాలకు పాల్పడే ఓ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మీడియా ముందు హాజరుపరచి అనంతరం ఆ గ్యాంగ్‌ను ఫోటో తీశారు. ఎవరిని అరెస్ట్ చేసినా ఎప్పుడూ చేసే తతాంగమే. ఇందులో నవ్వులపాలు కావడానికి ఏముంది అంటారా..? ఆగండి ఒక్కసారి పైన ఉన్న ఫొటోలను గమనించండి. మీకే నవ్వొస్తుంది. నేరం చేసిన ముఠా సభ్యులకు కుర్చీలు వేసి మరీ కూర్చోబెట్టారు. తప్పు చేసిన వారిలా పోలీసులు మాత్రం వారి వెనుకాల నిలబడ్డారు. అనంతరం తమ తప్పిదాన్ని గమనించి కుర్చీలు తీసేసి కింద కూర్చొబెట్టి ఫొటో తీశారు. ఇప్పుడా ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు కామెడీగా స్పందించారు. ‘వారిని కుర్చీల్లో కూర్చోబెట్టడంలో తప్పేముంది. నాకు తెలిసి పోలీసులు వారికి గౌరవ మర్యాదలు చేశారు’ అని ఒకరు కామెంట్ చేయగా.. ఇలాంటివి ఇండియాలో సాధ్యమే అని మరొకరు, నేరం రుజువైయ్యేంతవరకూ వారు అమాయకులే అని వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. కాగా ఈ ఫొటోలు నిజమైనవో లేదా మార్ఫింగ్ చేశారో తెలియాల్సి ఉంది. -
ఫేక్ సర్టిఫికేట్స్: స్పందించిన హర్మన్ ప్రీత్
న్యూఢిల్లీ : నకిలీ సర్టిఫికేట్స్ సమర్పించారని టీమిండియా మహిళా టీ 20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ను పంజాబ్ పోలీస్ శాఖ డీఎస్పీ ఉద్యోగం నుంచి తొలిగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంపై తాజాగా హర్మన్ ప్రీత్ కౌర్ స్పందించారు. అవి నకిలీ సర్టిఫికేట్స్ కాదని తాను పరీక్షల్లో పాసై పొందినవేనని స్పష్టం చేశారు. ఆమె ఈఎస్పీన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘నేను పోస్ట్ గ్రాడ్జ్యూయేషన్లో కూడా అడ్మిషన్ తీసుకున్నాను. వీదేశీ పర్యటనల వల్ల ఆ పరీక్షలకు హాజరుకాలేకపోయాను. కానీ నా డిగ్రీ సర్టిఫికేట్‌ను నకిలీవి అంటున్నారు. మీలాగా నేను హెడ్ ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతూ.. నా ఎన్రోల్మెంట్ నెంబర్‌తో రుజువు చేయలేను. ఎందుకంటే నేను క్రికెటర్. నా దృష్టంతా ఆటపైనే ఉంటుంది. కేవలం డిగ్రీ పూర్తి చేయాలనే చదివాను. నేను అన్ని సబ్జెక్ట్‌లో పాస్ అయ్యాను. ప్రతి సర్టిఫికేట్ లీగలే. ఢిల్లీలో నేను పరీక్షలు రాశాను. నాసబ్జెక్ట్లు సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, ఇంగ్లీష్, జనరల్ అవార్నెస్’ అని తెలిపారు. అయితే ఈ మహిళా క్రికెటర్‌ను ఏకకాలంలొ కష్టాలు చుట్టుముట్టాయి. ఓ వైపు ఆసియా టీ20 టోర్నీ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి ఒత్తిడిలో ఉండగా.. మరోవైపు ఈ నకిలీ సర్టిఫికేట్స్ వివాదం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఆమె తన డీఎస్పీ ఉద్యోగాన్ని కోల్పోయారు. గతేడాది మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఒంటి చేత్తో హర్మన్ ప్రీత్ భారత్‌ను గెలిపించారు. ఈ ప్రదర్శనకు మెచ్చి పంజాబ్ ప్రభుత్వం ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. అయితే పోలీస్ శాఖకు సమర్పించిన డిగ్రీ సర్టిఫికేట్స్ నకిలీవని తేలడంతో వారు ఉద్యోగం నుంచి తొలిగించారు. చదవండి: హర్మన్ ఇప్పుడు డీఎస్పీ కాదు! -
హర్మన్ ప్రీత్ డీఎస్పీ హోదా తొలగింపు..!
చంఢీఘడ్ : భారత మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ డీఎస్పీ హోదాను తొలిగిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమె ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్స్ సమర్పించారని ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన పోలీస్ శాఖ అవి నకిలీవేనని తేల్చింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకుంటూ డీఎస్పీ ర్యాంకు హోదాను తొలిగించారని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత శతకంతో భారత్‌కు ఫైనల్‌కు చేర్చిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనతో ఆమె ఓవర్‌నైట్ స్టార్ అయ్యారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం పోలీసు శాఖలో డీఎస్పీ జాబ్‌ని ఆఫర్ చేయగా.. ఈ ఏడాది మార్చి 1న పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ చేతుల మీదుగా ఆమె బాధ్యతలు చేపట్టారు. 2011లో చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి తాను డిగ్రీ పాసైనట్లు హర్మన్‌ప్రీత్ కౌర్ పోలీసు శాఖకి సర్టిఫికేట్స్ సమర్పించారు. కానీ.. విచారణలో అవి నకిలీవని తేలింది. దీంతో.. ఇక నుంచి హర్మన్‌ప్రీత్‌ని 12వ తరగతి మాత్రమే పాసైనట్లుగా పంజాబ్ ప్రభుత్వం చూస్తుందని.. ఆమె అర్హతకి పోలీసు శాఖలో ఒప్పుకుంటే కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఓ అధికారి మీడియాకు తెలిపారు. హర్మన్‌ప్రీత్ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆమెపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన వివరించారు. ఒకవేళ హర్మన్‌ప్రీత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే.. ఇప్పటికే ఆమె అందుకున్న అర్జున అవార్డుని కూడా కోల్పోవాల్సి ఉంటుంది. ఈ ఘటనపై హర్మన్‌ప్రీత్ కౌర్ మేనేజర్ స్పందిస్తూ.. ఈ విషయంలో ఇప్పటి వరకు పంజాబ్ పోలీస్ శాఖ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు. ఇదే సర్టిఫికేట్‌తో ఆమె రైల్వేలో ఉద్యోగం చేసిందని, అది ఇప్పుడేలా నకిలీది అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇక ఆమె పంజాబ్ పోలీస్ శాఖలో చేరేంత వరకు రైల్వే ఉద్యోగం చేశారు. -
జగ్దీప్.. బాప్‌రేబాప్..
పాత బాలీవుడ్ సినిమాల్లో ఇదో రొటీన్ సీను.. హీరో ఓ పోలీసు.. విలన్ ఏదో అంటాడు.. అప్పుడు మన హీరో.. ‘కానూన్ కా హాత్ బహుత్ లంబే హోతేహై’అంటూ స్టైల్‌గా ఓ డైలాగు విసురుతాడు. అంటే దానర్థం చట్టం చేతులు చాలా పొడవైనవి.. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరని.. ఇక్కడ చట్టం చేతులే కాదు.. మనిషి కూడా చాలా పొడవే!! జగ్దీప్ సింగ్.. పంజాబ్ పోలీసు విభాగంలో ట్రాఫిక్ పోలీసు. ఇతని ఎత్తు 7 అడుగుల 6 అంగుళాలు. బరువు 190 కిలోలు. ప్రపంచంలోనే అతి పొడవైన పోలీసు అని పేరు. త్వరలోనే గిన్నిస్ బుక్ వారు కూడా ఈ రికార్డును గుర్తించనున్నారని జగ్దీప్ చెబుతున్నాడు. ఇతడి షూ సైజు 19. మన దేశంలో దొరకదు. దీంతో విదేశాల నుంచి తెప్పించుకుంటాడు. షోరూంలో బట్టలు దొరకవు. ప్రత్యేకంగా కుట్టించుకోవాల్సిందే. ఇక బైకు, కారు ప్రయాణాల సంగతి చెప్పనక్కర్లేదు. చిన్నకార్లలో అయితే.. మనోడు పట్టడు. బైకులయితే.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం టైపులో ఇతడి ముందు వెలవెలబోతుంటాయి. మొన్నమొన్నటి వరకూ ఇతడికి పిల్లనిచ్చేవారు కూడా కరువయ్యారు. ఇంత ఎత్తు అంటే ఏదో ఆరోగ్య సమస్య ఉంటుందన్న కారణంతో.. అయితే.. మనోడి అదృష్టం కొద్ది.. అమ్మాయి దొరికింది. జగ్దీప్ అంత హైటు కాకున్నా.. ఇతడి సతీమణి ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు. జగ్దీప్ పర్సనాలిటీ చూసి.. సోషల్ మీడియాలో ఇతడిని రాక్షసుడు అన్నవారూ ఉన్నారు. అదే సమయంలో సెల్ఫీల కోసం ఎగబడినవాళ్లూ ఉన్నారు. అలా మనోడి జీవితం కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం టైపులో బాగానే నడిచిపోతోందట. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
డీఎస్పీగా మహిళా టీ20 కెప్టెన్
ఛండీగర్ : భారత మహిళల క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, డిప్యూటీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసుగా కొత్త బాధ్యతలు చేపట్టారు. నేటి(గురువారం) నుంచి ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ) సురేష్ అరోరాలు హర్మన్ ప్రీత్ కౌర్ యూనిఫాంకు స్టార్లను పిన్ చేసి నూతన బాధ్యతలు అప్పజెప్పారు. ''యంగ్ క్రికెటర్ హర్మన్ ప్రీత్‌కు ఈ బాధ్యతలు అప్పజెప్పడంలో పాల్గొనడం ఎంతో గర్వకారణం. హర్మన్ ప్రీత్ పంజాబ్ పోలీసు విభాగంలో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. హర్మన్ ప్రీత్ మాకు ఎంతో గర్వకారకంగా నిలిచింది. ఆమె ఇలానే కొనసాగిస్తుందని నేను నమ్ముతున్నా. నా శుభాకాంక్షలు ఆమెతో ఎప్పటికీ ఉంటాయి'' అని అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. గతేడాది జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్‌కు రావడంతో హర్మన్‌ప్రీత్ కీలక పాత్ర పోషించింది. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్‌కు పంజాబ్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు గత జులైలో ప్రకటించింది. పోలీసు ఉద్యోగం అంటే బాగుంటుందని కాబట్టి డీఎస్పీ పోస్టుని తీసుకునేందుకు గాను హర్మన్ ప్రీత్ తాను చేస్తున్న రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయితే పశ్చిమ రైల్వేతో ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకోవడంతో రిలీవ్ చేసేందుకు అధికారులు నిరాకరించారు. అయినా వెళ్లాలనుకుంటే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐదేళ్ల వేతనం రూ.27 లక్షలు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంలో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ జోక్యం చేసుకుని, రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాస్తూ హర్మన్ సమస్యను వేరే కోణంలో చూడాలని, ఆమె రాజీనామాను ఆమోదించాలని కోరారు. ముఖ్యమంత్రి లేఖతో దిగివచ్చిన రైల్వే, హర్మన్ ప్రీత్‌తో కుదుర్చుకున్న బాండ్‌ను రద్దు చేసింది. దీంతో పోలీసు ఉద్యోగంలో చేరేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ క్రమంలో ఆమె నేడు డీఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించింది. Proud to join DGP Suresh Arora in pinning the stars on the uniform of this young cricketer @ImHarmanpreet as she takes over as DSP in @PunjabPolice. This lady has done us proud and I’m confident she’ll continue to do so. My best wishes are with her. pic.twitter.com/0yuDOdr6j7 — Capt.Amarinder Singh (@capt_amarinder) March 1, 2018 -
రిపబ్లిక్ డే వేడుకల్లో పోలీస్ ఆత్మహత్య
లుధియానా : పంజాబ్‌లో రిపబ్లిక్ డే నాడే విషాదం చోటుచేసుకుంది. జెండా ఆవిష్కరణ జరుగుతుండాగానే ఓ పోలీస్ గన్‌మెన్ తన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జార్గాన్ పట్టణంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. జార్గాన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు డ్రైవర్ కమ్ గన్‌మెన్‌గా వ్యవహరించే మంజీత్ రామ్ తన ఏకే-47 రైఫిల్‌తో కాల్చుకుని బలవన్మరణం పొందాడు. వేడుకలు జరుగుతున్న సమయంలో మంజీత్ బయట కూర్చున్నాడని, వెంటనే అతన్ని సమీప ఆసుపత్రికి తలించామని అప్పటికే అతను మరణంచినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. మిస్‌ఫైర్ అయిందా తనే కాల్చుకున్నాడా అనే కోణంలో ధర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు. -
హనీప్రీత్ అరెస్ట్‌పై సీఎం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, పంచకుల : డేరా బాబా దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ అరెస్ట్ వ్యవహారంపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె అరెస్ట్ విషయంలో పంజాబ్ పోలీసుల పాత్రపై ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాల్ మే కుచ్ కాలా హై (అనుమానించదగ్గ విషయం ఏదో ఉంది) అని పేర్కొన్నారు. వారికి(పంజాబ్ పోలీసులకు) అంతా తెలుసు. హనీప్రీత్ ను ట్రాకింగ్ చేయటం.. అరెస్ట్ అంతా వారి మాధ్యమంగానే జరిగింది. మా(హర్యానా) ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంది. కానీ, వాళ్లు అలా చేయలేదు. అందుకే అరెస్ట్ లో జాప్యం జరిగింది అని ఖట్టర్ వ్యాఖ్యానించారు. హనీప్రీత్‌ను మంగళవారం ఛండీగఢ్ హైవేలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమెతోపాటు మరో మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పంజాబ్ నేత హర్మిందర్ సింగ్ జస్సీ కూతురు రామ్ రహీమ్ కొడుకును పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె సహకారంతోనే హనీప్రీత్ తప్పించుకోవాలని ప్రయత్నించిందని.. తన పరపతిని ఉపయోగించి హనీకి భద్రత కల్పించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పంజాబ్ ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. గతంలో హర్యానా ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవటంతోనే పంచకుల రణరంగంగా మారిందని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పంచకుల సెక్టార్-20 లోని రాంపూర్ జైల్లో విచారణ ఎదుర్కుంటున్న హనీప్రీత్ ఎలాంటి విషయాలను వెల్లడించకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెపై లైడిక్టర్ టెస్ట్ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు కోర్టు అనుమతి తీసుకోనున్నట్లు చెబుతున్నారు. -
పోలీసులపై గ్యాంగ్స్టర్ల కాల్పులు
చండీగఢ్: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో గ్యాంగ్స్టర్లు, పోలీసుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. పక్కా సమాచారం ప్రకారం శనివారం గ్యాంగ్స్టర్లను అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య 100 రౌండ్ల కాల్పులు చోటుచేసుకోవడంతో మాకు పట్టణ పరిసర ప్రాంతాల్లో కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చేసుకోలేదు. నలుగురు గ్యాంగ్స్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల గురుహర్ సహాయ్ పట్టణంలోని ఓ పోలీస్‌ష్టేషన్ వెలుపల కాల్పులు జరగడంతో గ్యాంగ్స్టర్లపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. -
పఠాన్‌కోట్‌లో హై అలర్ట్
గుర్దాస్పూర్ : ఉగ్ర కదలికల సమాచారం నేపథ్యంలో పఠాన్‌కోట్, గుర్దాస్పూర్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలు శనివారం హైఅలర్ట్ ప్రకటించాయి. పఠాన్‌కోట్ లేదా గుర్దాస్పూర్ ప్రాంతాల్లో ఓ ట్రక్ సంచరిస్తుందంటూ శుక్రవారం సాయంత్రం పాకిస్తాన్ నుంచి వచ్చిన అనుమానాస్పద ఫోన్ కాల్‌తో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టీస్ టీమ్ (ఎస్డబ్ల్యూఏటీ), బీఎస్ఎఫ్కు చెందిన 400 మంది సిబ్బందితో పంజాబ్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ఆయా ప్రాంతాల్లో విస్తృత సోదాలు చేపట్టారు. ముఖ్యంగా బటాలా పట్టణాన్ని ఆర్మీ, బీఎస్ఎఫ్ దళాలు జల్లెడ పట్టాయి. పఠాన్‌కోట్, గుర్దాస్పూర్ సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించారు. -
ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేల అరెస్టు
హత్యాయత్నం కేసులో ఒకరు.. దూషించినందుకు మరొకరు న్యూఢిల్లీ/చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ. ఢిల్లీలో అమానతుల్లా ఖాన్ అనే ఎమ్మెల్యే ఓ మహిళను వాహనంతో తొక్కి చంపేందుకు ప్రయత్నించిన కేసులో అరెస్టవగా.. వ్యక్తిని దూషించిన కేసులో మరో ఆప్ ఎమ్మెల్యేను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వివిధ కేసుల్లో అరెస్టయిన పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 11కు పెరిగింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ మహిళ.. ఆప్ ఎమ్మెల్యే, ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అమానతుల్లా ఖాన్ తనను హత్యచేసేందుకు ప్రయత్నించారని జూలై 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల తరచుగా విద్యుత్ కోతలు ఎదుర్కుంటున్నామని చెప్పి తిరిగి వస్తుండగా తనపై వాహనాన్ని ఎక్కించి చంపేందుకు ప్రయత్నించారన్నారు. వాహనంలో ఎమ్మెల్యే కూడా ఉన్నారని మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. అక్కడే ఉన్న ఓ యువకుడు దీన్ని రాజకీయం చేస్తే తనను చంపేస్తానని బెదిరించాడని తెలిపారు. దీంతో కోర్టు ఆదేశాలతో ఆదివారం నాన్‌బెయిలబుల్ వారెంట్ కింద ఖాన్‌ను అరెస్టు చేశారు. దీనిపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘మోదీజీ మరో ఆప్ ఎమ్మెల్యేను అరెస్టు చేయించారు’ అని ట్వీట్ చేశారు. ఓ వర్గం వారిని దూషించినందుకు.. మరోపక్క.. ఆప్ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్‌ను ఆదివారం రాత్రి అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. సోమవారం అతణ్ని కోర్టుకు హాజరుపరుస్తామన్నారు. ఓ వర్గం వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేయగా.. అతను ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ ప్రోద్బలంతోనే దూషించినట్లు తెలిపారన్నారు. దీని ఆధారంగానే ఆప్ ఎమ్మెల్యేను అరెస్టు చేసినట్లు తెలిపారు. -
ఖందిల్ కేసులో పాకిస్థాన్ అనూహ్య నిర్ణయం!
-
ఖందిల్ కేసులో పాకిస్థాన్ అనూహ్య నిర్ణయం!
ముల్తాన్: సంప్రదాయ ముస్లిం దేశమైన పాకిస్థాన్.. సోషల్ మీడియా సెలబ్రిటీ కందిల్ బలోచ్ హత్యకేసులో అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఖందిల్‌ను కిరాతకంగా చంపిన ఆమె సోదరుడిని కుటుంబం క్షమించకుండా ఉండేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మతఛాందసవాదుల నిషేధాజ్ఞలను బేఖాతరు చేస్తూ సోషల్ మీడియాలో నిత్యం ఫొటోలు, వీడియోలు పెడుతూ.. సంచలనం సృష్టించిన ఖందిల్ బలోచ్‌ను ఆమె సోదరుడు మహమ్మద్ వసీం మత్తుమందు ఇచ్చి.. గొంతునులిమి కిరాతకంగా చంపేశాడు. ఖందిల్‌ను చంపినందుకు తనకు ఎలాంటి విచారం లేదని, కుటుంబం పరువు తీస్తున్నదనే ఆమెను చంపాశానని, ఇందుకు గర్వపడుతున్నానని వసీం మీడియా ముందు, కోర్టులో అంగీకరించాడు. ప్రముఖ ఇస్లాం మతగురువు అద్బుల్ ఖవి ఒడిలో కూర్చొని తన సోదరి ఆయనను ఇరకాటంలో పడేసిందని, ఇలాంటి పనులు చేస్తుండటం వల్లే చంపానని అతడు చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించిన ఈ హత్యకేసులో దేశంలో అతిపెద్ద ప్రావిన్స్ అయిన పంజాబ్ అత్యంత అరుదైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పరువు హత్య కేసుల్లో కుటుంబం క్షమాపణ ఇస్తే.. దోషులు కోర్టు శిక్షపడకుండా తప్పించుకోవచ్చు. చట్టంలోని ఈ లొసుగులను దృష్టిలో పెట్టుకొని పరువు హత్యలు చేస్తున్న పలువురు తప్పించుకుంటున్నారు. కందిల్ బలోచ్ హత్యకేసులో ఆమె సోదరుడి ఈ లొసుగును ఉపయోగించుకొని కేసు నుంచి బయటపడకుండా ఉండేందుకు వీలుగా పంజాబ్ పోలీసు అధికారులు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నిందితుడికి ఖందిల్ కుటుంబం ఎట్టిపరిస్థితుల్లో క్షమాపణలు చెప్పకూడదని పోలీసులు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. -
ఆ ఎస్పీగారి ఆస్తి.. రూ. 152 కోట్లు!!
సాధారణంగా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఆస్తుల గురించే ఎక్కువగా చెప్పుకొంటూ ఉంటాం. అప్పుడప్పుడు అవినీతిపరులైన అధికారుల ఆస్తుల గురించి విని కళ్లు తేలేస్తాం. కానీ.. ఒక జిల్లా ఎస్పీ అధికారికంగానే తనకు రూ. 152 కోట్ల ఆస్తి ఉందని ప్రకటించినట్లు ఎపుడైనా విన్నారా? అవును.. పంజాబ్‌లో ఇది జరిగింది. మొహాలి సీనియర్ ఎస్పీగా చాలా కాలం నుంచి పనిచేస్తున్న గుర్ప్రీత్ సింగ్ భుల్లర్ తన ఆస్తి విలువ రూ. 152 కోట్లన్న విషయాన్ని ఏకంగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేసే ఐపీఎస్ అధికారుల ఆదాయ రిటర్నులలో పేర్కొన్నారు. అదే రాష్ట్రంలో 2012 ఎన్నికలలో పోటీ చేసిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు వంద కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లలో చూపించారు. కేవల్ థిల్లాన్‌కు రూ. 137 కోట్లు, కరణ్ కౌర్ బ్రార్‌కు రూ. 128 కోట్లు ఆస్తి ఉంది. కానీ, వీళ్లిద్దరినీ తలదన్నేలా సీనియర్ ఎస్పీ ఆస్తి ఉంది. తనకు 8 నివాస భవనాలు, నాలుగు వ్యవసాయ క్షేత్రాలు, మూడు కమర్షియల్ ప్లాట్లు ఉన్నట్లు భుల్లర్ తెలిపారు. వాటిలో ఢిల్లీలోని బారాఖంబా రోడ్డులో గల కమర్షియల్ ప్లాటు విలువ రూ. 85 లక్షలు. అలాగే ఢిల్లీలోని సైనిక్ ఫామ్స్ అనే ఖరీదైన ప్రాంతంలో 1500 చదరపు గజాల ఖాళీ స్థలం కూడా ఉంది. మొహాలీలోని బరైలీ గ్రామంలో సాగుకు పనికిరాని మరో భూమి విలువ రూ. 45 కోట్లు. వీటిలో చాలావరకు తనకు తన తాతల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులేనని భుల్లర్ చెప్పారు. 2009 నుంచి 2013 వరకు ఒకసారి, 2015 నుంచి ఇప్పటివరకు ఈయన మొహాలీ సీనియర్ ఎస్పీగా ఉన్నారు. -
పఠాన్‌కోట్ కంటోన్మెంట్లో పాక్ గూఢచారి!
వ్యక్తిని అరెస్టు చేసిన పంజాబ్ పోలీసులు పఠాన్‌కోట్: ఉగ్రవాద దాడులకు గురైన పఠాన్‌కోట్ కంటోన్మెంట్లో ఓ భారత జాతీయుడిని పంజాబ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కి అతను ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని నిఘా సంస్థలు సమాచారం అందించడంతో అదుపులోకి తీసుకున్నారు. పఠాన్‌కోట్ కంటోన్మెంట్‌లోని భారత ఆర్మీ 29 డివిజన్ హెడ్ క్వార్టర్ లో ఇష్రాద్ అహ్మద్ సహాయ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతను ఐఎస్ఐకు అండర్ కవర్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నాడని తాజాగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. అతని స్మార్ట్ ఫోన్లో పఠాన్‌కోట్ లోని సున్నితమైన ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలు లభించాయని నిఘావర్గాలు నివేదించినట్టు సమాచారం. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దేశంలోనే అతి పెద్ద ఆర్మీ స్థావరం. వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. గత నెలలో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎయిర్‌బేస్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ దీనిని ఇటీవలికాలంలో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెల జరిగిన ఉగ్రవాద దాడికి, ఇష్రాద్కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో భద్రతా సంస్థలు దర్యాప్తు జరుపుతున్నాయి. సరిహద్దుల ఆవల ఉన్న ఉగ్రవాదుల నుంచి అందిన సూచనల మేరకే అతను నడుచుకున్నట్టు అనుమానిస్తున్నారు. -
మరో వివాదంలో రాధే మా
చండీగఢ్: ఆధ్యాత్మిక గురువు రాధే మా మరో వివాదంలో ఇరుకున్నారు. విచారణకు హాజరు కావాలంటూ పంజాబ్ పోలీసులు రాధే మాకు నోటీసు జారీ చేశారు. ఆమె మత విశ్వాసాలను కించపరిచారని పంజాబ్‌లోని పగ్వారా నివాసి సురీందర్ మిట్టల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధే మా డబ్బులు ఇవ్వాల్సిందిగా తనను డిమాండ్ చేసి, ఇవ్వనందుకు బెదిరించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఓ పోలీస్ అధికారి ముంబైకి వెళ్లి రాధే మాకు నోటీసు జారీ చేశారు. రాధే మాతో పాటు ఆమె సోదరి రజ్జో, కోడలు మేఘ, సహాయకురాలు రీతూ సరీన్, అనుచరుడు సంజీవ్ గుప్తాలపై కూడా కేసు నమోదు చేయాలని సురీందర్ ఫిర్యాదు చేశారు. రాధే మాతో మాట్లాడినప్పడు రికార్డు చేసిన ఫోన్ సంభాషణలను పోలీసులకు అందజేశారు. ఆమె అసభ్యత, అశ్లీలతను ప్రచారం చేస్తూ మత విశ్వాసాలను దెబ్బ తీస్తున్నారని సురీందర్ ఆరోపించారు. వరకట్నం కేసులో ఇటీవల రాధే మాను ముంబై పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఖలిస్తాన్ టెర్రరిస్టు అరెస్టు
న్యూఢిల్లీ : ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన టెర్రరిస్టును శుక్రవారం పంజాబ్ పోలీసులు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. అతడిని హర్మిందర్ మింటూగా గుర్తించారు. థాయిలాండ్ అధికారులు ఆ దేశం నుంచి మింటూను బహిష్కరించారని పోలీసులు తెలిపారు. అతడిని ఆ దేశరాజధాని బ్యాంకాంగ్‌లో అదుపులోకి తీసుకొన్నట్లు తెలిపారు. అత డి సమాచారం సేకరించిన తర్వాత దేశబహిష్కారం చేసినట్లు చెప్పారు. మింటూకు పంజాబ్‌లో పలు ఉగ్రవాద కేసులు ఉన్నాయని తెలిపారు. ఆ ప్రాంతంలో పలు ఉగ్రదాడులకు మింటూ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.