
ఏఎస్సైకి సంఘీభావంగా ప్లకార్డులు పట్టుకున్న పోలీసులు
హిమాయత్ నగర్: ఇటీవల పంజాబ్ లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సై హర్‌జీత్ సింగ్ చెయ్యి నరకడం చాలా బాధాకరం అని అబిడ్స్ డివిజన్ ఏసీపీ భిక్షం రెడ్డి అన్నారు. అర్జీత్ సింగ్ కి మద్దతుగా సోమవారం కింగ్ కోఠి వైద్య విధాన పరిషత్ హాస్పిటల్ వద్ద పంజాబ్ ఏఎస్సై కి సంఘీభావంగా ‘మే భీ హర్‌జీత్ సింగ్’అనే ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఏసీపీ రామదాసు, ఇన్‌స్పెక్టర్ రమేష్ కుమార్, క్రైం ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ఎస్సైలు కర్ణాకర్ రెడ్డి, సైదులు, నవీన్ పాల్గొన్నారు.
ఖైరతాబాద్: అలాగే ఘటనలో ఏఎస్‌ఐ గాయపడి కోలుకున్న సందర్భంగా సోమవారం సాయంత్రం సైఫాబాద్ పోలీసులు ’హర్‌జీత్ సింగ్‌కు మీకు మేము అండగా ఉంటాం’ అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, సైఫాబాద్ ఇన్స్‌స్పెక్టర్ సైదిరెడ్డి, డీఐ రాజునాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment