
మహిళను జీప్‌పై కట్టేసి
అమృత్‌సర్ : పంజాబ్ పోలీసులు ఓ మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఓ మహిళా అనే కనీస గౌరవం లేకుండా ఆమెను జీపు పై భాగంలో కట్టేసి ఊరంతా తిప్పారు. ఈ దారుణ సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. అమృత్‌సర్‌లోని చవిందా దేవి గ్రామానికి చెందిన బాధితురాలి మామ ఓ ఆస్తివివాదంలో నిందితుడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేయడానికి వాళ్ల ఇంటికి వెళ్లగా అతను లేడు. దీంతో వారు ఆమె భర్తను తీసుకెళ్లడానికి ప్రయత్నించగా అడ్డుకుంది.
ఆగ్రహానికిలోనైన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను బలవంతగా జీపు పైభాగాన్ని కట్టేసి ఊరంతా తిప్పారు. వాహనాన్ని వేగంగా పోనివ్వడంతో ఆమె కిందపడిపోయింది. ఈ ఘటనలో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బంధువులు తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు సైతం పోలీసుల తీరుపై మండిపడుతున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ పోలీసులు ముస్లిం యువకుడిని ప్రేమించిందని ఓ యువతిని జీపులో ఎక్కించి కొడుతూ అమానుషంగా ప్రవర్తించిన వీడియో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. (చదవండి: ప్రేమ వ్యవహారం: యువతిని హింసించిన పోలీసులు)
Comments
Please login to add a commentAdd a comment