అమృత్‌సర్: పంజాబ్‌లో పేలుడు కలకలం రేపింది. అమృత్‌సర్‌లోని ఇస్తామాబాద్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ పేలుడు తమ పనేనంటూ జర్మనీకి చెందిన గ్యాంగ్‌స్టర్ జీవన్ ఫౌజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో 10 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
ఈ నెల 4న అమృత్‌సర్‌లోని మజితా పోలీస్‌స్టేషన్‌లోనూ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ అద్దాలు పగిలిపోయాయి. పోలీస్ స్టేషన్ గేటు సమీపంలోని బహిరంగ ప్రదేశంలో పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ గేట్లను మూసివేసిన పోలీసులు.. భద్రతను పెంచారు.
Reportedly, a blast was heard in the early hours of Tuesday near the Islamabad police station in Amritsar. However, the police have yet to provide an official statement on the incident. pic.twitter.com/1tzYeyjidG
— Ravinder Singh Robin ਰਵਿੰਦਰ ਸਿੰਘ رویندرسنگھ روبن (@rsrobin1) December 17, 2024
Comments
Please login to add a commentAdd a comment