హనీప్రీత్‌ అరెస్ట్‌పై సీఎం సంచలన వ్యాఖ్యలు | Haryana CM Comments on Honeypreet Arrest | Sakshi
Sakshi News home page

హనీప్రీత్‌ అరెస్ట్‌.. సీఎం సంచలన వ్యాఖ్యలు

Published Fri, Oct 6 2017 8:20 AM | Last Updated on Fri, Oct 6 2017 12:08 PM

Haryana CM Comments on Honeypreet Arrest

సాక్షి, పంచకుల :  డేరా బాబా దత్త పుత్రిక హనీప్రీత్‌ ఇన్‌సాన్‌ అరెస్ట్‌ వ్యవహారంపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె అరెస్ట్‌ విషయంలో పంజాబ్‌ పోలీసుల పాత్రపై ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాల్‌ మే కుచ్‌ కాలా హై (అనుమానించదగ్గ విషయం ఏదో ఉంది) అని పేర్కొన్నారు. వారికి(పంజాబ్‌ పోలీసులకు) అంతా తెలుసు.  హనీప్రీత్‌ ను ట్రాకింగ్‌ చేయటం.. అరెస్ట్‌ అంతా వారి మాధ్యమంగానే జరిగింది. మా(హర్యానా) ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంది. కానీ, వాళ్లు అలా చేయలేదు. అందుకే అరెస్ట్‌ లో జాప్యం జరిగింది అని ఖట్టర్‌ వ్యాఖ్యానించారు. 

హనీప్రీత్‌ను మంగళవారం ఛండీగఢ్‌ హైవేలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమెతోపాటు మరో మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పంజాబ్‌ నేత హర్మిందర్‌ సింగ్‌ జస్సీ కూతురు రామ్‌ రహీమ్‌ కొడుకును పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె సహకారంతోనే హనీప్రీత్‌ తప్పించుకోవాలని ప్రయత్నించిందని.. తన పరపతిని ఉపయోగించి హనీకి భద్రత కల్పించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పంజాబ్‌ ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. గతంలో హర్యానా ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవటంతోనే పంచకుల రణరంగంగా మారిందని పంజాబ్‌ సీఎం కెప్టెన్ అమరీందర్‌ సింగ్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం పంచకుల సెక్టార్‌-20 లోని రాంపూర్‌ జైల్లో విచారణ ఎదుర్కుంటున్న హనీప్రీత్‌ ఎలాంటి విషయాలను వెల్లడించకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెపై లైడిక్టర్ టెస్ట్ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు కోర్టు అనుమతి తీసుకోనున్నట్లు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement