ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తజిందర్ సింగ్ బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, బగ్గా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తానని వ్యాఖ‍్యలు చేసిన కారణంగా అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
వివరాల ప్రకారం.. మార్చి 30వతేదీన జరిగిన నిరసన ప్రదర్శనలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను బగ్గా బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలను ఆప్ నేతలు పోలీసులకు అందజేశారు. దీంతో అతడిని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిట్టు తెలిపారు. ఈ మేరకు బగ్గాను అరెస్టు చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి కపిల్ మిశ్రా స్పందిస్తూ.. తన రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకే కేజ్రీవాల్ ఇలా అరెస్టులు చేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.
लुच्चे-लफ़ंगो की पार्टी भाजपा नेता @TajinderBagga को पंजाब पुलिस ने गिरफ़्तार किया। मुख्यमंत्री अरविंद केजरीवाल जी को दिया था “जीने नही देंगे” की धमकी। pic.twitter.com/LzZmPVaDRQ
— MLA Naresh Balyan (@AAPNareshBalyan) May 6, 2022
ఇది కూడా చదవండి: మమత, అమిత్ షా పరస్పర విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment