Tajinder Pal Singh Bagga
-
Asian indoor athletics championships: షాట్‌పుట్‌లో తజీందర్ పాల్‌కు స్వర్ణం
అస్తానా (కజకిస్తాన్): ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజే భారత్ నాలుగు పతకాలతో అదరగొట్టింది. పురుషుల షాట్‌పుట్‌లో తజీందర్ పాల్ సింగ్ తూర్ పసిడి పతకం గెలిచాడు. తజీందర్ ఇనుప గుండును 19.49 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. కరణ్వీర్ సింగ్ 19.37 మీటర్లతో రెండో స్థానంలో నిలిచి భారత్‌కు రజతం అందించాడు. ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రావెల్ 16.98 మీటర్ల దూరం గెంతి జాతీయ ఇండోర్ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకం సాధించాడు. మహిళల పెంటాథ్లాన్‌లో స్వప్నా బర్మాన్ 4119 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకుంది. -
ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. తజీందర్ బగ్గాకు రిలీఫ్
చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్, హర్యానా హైకోర్టు షాక్ ఇచ్చింది. బీజేపీ నేతలు తజీందర్ సింగ్ బగ్గా, కుమార్ విశ్వాస్‌లపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. వారు తమ హక్కులు, రాజకీయ హోదాకు అనుగుణంగానే మాట్లాడారని, కేజ్రీవాల్‌పై విమర్శలు రాజకీయపరమైనవేనని స్పష్టం చేసింది. ఈమేరకు బుధవారం తీర్పు వెలువరించింది. ఆప్ మాజీ నేతలైన తజీందర్ బగ్గా, కుమార్ విశ్వాస్ కొద్ది రోజుల క్రితం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఢిల్లీలో పన్ను మినాహాయింపు ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే వీరిపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని ఇద్దరూ హైకోర్టులో సవాల్ చేయగా.. న్యాయస్థానం అనుకూలంగా తీర్పునిచ్చింది. తీర్పు అనంతరం తజీందర్ బగ్గా స్పందించారు. సత్యమే గెలుస్తుందని నిరూపితమైందని, అరవింద్ కేజ్రీవాల్‌కు ఇది చెంపపెట్టులాంటి తీర్పు అని విమర్శలు గుప్పించారు. చదవండి: నిప్పంటించుకోబోయిన భార్యాభర్తలు.. రెప్పపాటులో.. -
కేజ్రీవాల్ కిడ్నాప్ చేసేందుకు యత్నించారు: తజిందర్ బగ్గా
న్యూఢిల్లీ: పంజాబ్ పోలీసులను ఉపయోగించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గా ఆరోపించారు. ఆయన గుండాయిజాన్ని ప్రదర్శించి మరీ తనను కిడ్నాప్ చేశారంటూ విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ కిడ్నాప్ చేసేందుకు యత్నించారంటే నిజంగా ఆయన ఎంతలా భయపడుతున్నారో అర్థమవుతందని ఎద్దేవా చేశారు. అంతేకాదు అరవింద్ కేజ్రీవాల్‌కు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా పోలీసులను రంగంలోకి దింపి వారిని అణిచేస్తారని బగ్గా ఆరోపించారు. భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) జాతీయ కార్యదర్శి తజిందర్ రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని, మతపరమైన శత్రుత్వాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ ఆప్ నాయకుడు సన్నీసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మే 6న తాజిందర్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు మార్చి 30న జరిగిన నిరసనల్లో అరవింద్ కేజ్రీవాల్‌ను బగ్గా బెదిరించినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. అలాంటి ఆరోపణలు చేసినప్పుడూ ఎఫ్ఐఆర్లో పంజాబ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించానని పేర్కొనాలి కానీ కేజ్రీవాల్‌ని చంపుతానని బెదిరించినట్లు పేర్కొన్నారు. అయినా తాను ఎవర్నీ బెదిరించలేదని ఇది కేవలం వ్యావహారిక వ్యక్తీకరణ మాత్రమే అని బగ్గా అన్నారు. అయినా తన పై వెయ్యి ఎఫ్ఐఆర్లు నమోదు చేసినప్పటికీ గురుగ్రంథ సాహిబ్‌ను అపవిత్రం చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని తాను ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. ఈ మేరకు బగ్గా ఢిల్లీ డిప్యూటీ సీఎం సహాయకుడు అల్లర్ల కేసులో జైలు కెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తూ...కేజ్రీవాల్‌ను ఇతర పార్టీల్లో లోపాలను వేలెత్తి చూపించే ముందు తమ సొంత పార్టీలోని లోపాలను సరిదిద్దుకోమని నొక్కి చెప్పారు. (చదవండి: దేశానికి తదుపరి ప్రధాని అమిత్ షా?.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు) -
చిత్ర విచిత్ర మలుపులు.. తజిందర్ బగ్గాపై మరోసారి అరెస్ట్ వారెంట్ జారీ
అనేక రాజకీయ మలుపుల అనంతరం పంజాబ్ బీజేపీ నాయకుడు తజిందర్ పాల్ సింగ్‌పై మోహాలీ కోర్టు శనివారం తాజా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తాజిందర్ బగ్గాపై ఐపీసీ సెక్షన్ 153ఏ, 505,505(2), 506 కింద కేసులు నమోదయ్యాయి. దీంతో మోహాలీ కోర్టు ఆదేశాలను అనుసరించి జిల్లా మెజిస్ట్రేట్ తజిందర్ బగ్గాను అరెస్టుచేసి కోర్టు ముందు హాజరు పరచాలని సైబర్ క్రైం పోలీసులను కోరింది. కాగా ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలపై తజిందర్ పాల్ సింగ్ బగ్గాను శుక్రవారం పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పంజాబ్ పోలీసులు ఢిల్లీలో ఆయన నివాసానికెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అయితే బగ్గాను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని, కనీసం తలపాగా కూడా కట్టుకోనివ్వలేదని బగ్గా తల్లిదండ్రులు ఆరోపించారు. ఢిల్లీలో తన కొడుకును కిడ్నాప్ చేశారని తేజిందర్ పాల్ సింగ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పంజాబ్ పోలీసులపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చదవండి: వీడియో: వెంటపడి మరీ మహిళను చితకబాదిన లాయర్ తేజిందర్‌ను మొహాలీకి తీసుకెళ్తున్న పంజాబ్ పోలీసులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. బగ్గాను అరెస్ట్ చేయడంలో సరైన నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. పంజాబ్ పోలీసుల నుంచి ఆయన్ను విడిపించి ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. అనంతరం పంజాబ్ పోలీసులు తేజిందర్‌ను హర్యానా పోలీసులకు అప్పగించాలని, ఢిల్లీకి అప్పగించొద్దని పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అయితే పంజాబ్ ప్రభుత్వ డిమాండ్‌ను హైకోర్టు తప్పుబట్టింది. కిడ్నాపింగ్ ఫిర్యాదు ఆధారంగా తమకు అప్పగించాలని ఢిల్లీ పోలీసులు అభ్యర్థించింది దీంతో సెర్చ్ వారంట్ కోసం కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం నుంచి సెర్చ్ వారంట్ తీసుకుని కురుక్షేత్ర పోలీస్ స్టేషన్‌కెళ్లి తేజిందర్ బగ్గాను తమ ఆధీనంలోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. -
బగ్గా అరెస్ట్; మూడు రాష్ట్రాల పోలీసుల ‘టగ్ ఆఫ్ వార్’
న్యూఢిల్లీ: బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గాను పంజాబ్ పోలీసులు ఇవాళ ఢిల్లీలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బగ్గా అరెస్ట్ మూడు రాష్ట్రాల పోలీసుల మధ్య ‘టగ్ ఆఫ్ వార్’గా మారింది. బగ్గా అరెస్ట్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే.. 50 మంది పోలీసులు.. అరెస్ట్ శుక్రవారం ఉదయం 8:30 గంటల సమయంలో ఢిల్లీలో బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 50 మంది పోలీసులు మిస్టర్ బగ్గా ఢిల్లీ ఇంటిలోకి చొరబడి అతడిని అరెస్టు చేశారని ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి నవీన్ కుమార్ జిందాల్ ఆరోపించారు. తలపాగా ధరించే సమయం కూడా ఇవ్వకుండా అతడిని బలవంతంగా లాక్కుపోయారని అన్నారు. కిడ్నాప్ అంటూ కేసు దాదాపు 10-15 మంది పోలీసులు తమ ఇంట్లోకి ప్రవేశించి, తన కుమారుడిని కొట్టి బయటకు లాక్కొచ్చారని బగ్గా తండ్రి ప్రీత్ పాల్ ఆరోపించారు. వీడియో రికార్డ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు తన ఫోన్‌ను లాక్కున్నారని.. బగ్గా ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. తన కొడుకును కిడ్నాప్ చేశారంటూ ఆయన కేసు పెట్టారు. దీంతో పంజాబ్ పోలీసులపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముందస్తు సమాచారం లేదు తజిందర్ సింగ్ అరెస్ట్‌పై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అయితే పంజాబ్ పోలీసులు మాత్రం ఈ ఆరోపణను తోసిపుచ్చారు. ముందస్తు సమాచారం ఇచ్చామని.. దీనికి అనుగుణంగానే తమ బృందం ఒకటి గురువారం సాయంత్రం నుంచి జనక్‌పురి పోలీస్ స్టేషన్లో ఉందని వెల్లడించారు. హరియాణా టు ఢిల్లీ తజిందర్ సింగ్‌ను మొహాలి తీసుకెళుతుండగా హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. తజిందర్ సింగ్ తండ్రి కిడ్నాప్ కేసు పెట్టడంతో ఈ మేరకు వ్యవహరించినట్టు హరియాణా పోలీసులు తెలిపారు. దీంతో హరియాణా నుంచి ఢిల్లీకి తజిందర్ సింగ్‌ను తీసుకొచ్చారు. బగ్గాను కిడ్నాప్ చేయలేదని, తమ రాష్ట్రంలో నమోదైన కేసు ఆధారంగా అతడిని అరెస్ట్ చేశామని హరియాణా పోలీసు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా వివరించినా వినిపించుకోలేదని పంజాబ్ పోలీసులు వాపోయారు. టార్గెట్ కేజ్రీవాల్ తజిందర్ సింగ్‌పై మొహాలి జిల్లాలోని సాహిబ్జాదా అజిత్ సింగ్ నగర్‌లోని సైబర్ సెల్లో కేసు నమోదైంది. విద్వేష ప్రకటనలు చేయడం, మతపరమైన శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, నేరపూరిత బెదిరింపుల ఆరోపణల కింద అతడిపై కేసు నమోదు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని ట్విటర్లో బగ్గా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాడు. ముఖ్యంగా 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాపై కేజ్రీవాల్ స్పందనపై అసంతృప్తితో అతడు రెచ్చిపోయి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. విచారణకు సహకరించనందుకే.. బగ్గాపై కేసు వ్యవహారంలో పంజాబ్ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఐదుసార్లు నోటీసులు పంపిన తర్వాత కూడా విచారణకు సహకరించేందుకు బగ్గా నిరాకరించడంతో అతడిని అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన, విషపూరితమైన, ద్వేషపూరితమైన పదజాలం వాడుతూ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించాడని వెల్లడించారు. పంజాబ్ అభ్యర్థనకు హైకోర్టు నో తజిందర్ సింగ్‌ను హరియాణాలోనే ఉంచాలన్న పంజాబ్ ప్రభుత్వ అభ్యర్థనను పంజాబ్- హరియాణా హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. హరియాణా పోలీసులు బగ్గాను ఢిల్లీ పోలీసులకు అప్పగించడంతో పంజాబ్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో హరియాణా పోలీసుల జోక్యం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పంజాబ్ అడ్వకేట్ జనరల్ (ఏజీ) అన్మోల్ రతన్ సిద్ధూ. హైకోర్టులో వాదించారు. ఢిల్లీ పోలీసులను బగ్గాతో కలిసి హరియాణా సరిహద్దు దాటనివ్వవద్దని కూడా కోర్టును అభ్యర్థించారు. (క్లిక్: సీఎంకు బెదిరింపులు.. బీజేపీ నేత అరెస్ట్) -
సీఎంను చంపేస్తానంటూ వార్నింగ్.. బీజేపీ నేత అరెస్ట్
ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తజిందర్ సింగ్ బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, బగ్గా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తానని వ్యాఖ్యలు చేసిన కారణంగా అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. మార్చి 30వతేదీన జరిగిన నిరసన ప్రదర్శనలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను బగ్గా బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలను ఆప్ నేతలు పోలీసులకు అందజేశారు. దీంతో అతడిని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిట్టు తెలిపారు. ఈ మేరకు బగ్గాను అరెస్టు చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి కపిల్ మిశ్రా స్పందిస్తూ.. తన రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకే కేజ్రీవాల్ ఇలా అరెస్టులు చేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. लुच्चे-लफ़ंगो की पार्टी भाजपा नेता @TajinderBagga को पंजाब पुलिस ने गिरफ़्तार किया। मुख्यमंत्री अरविंद केजरीवाल जी को दिया था “जीने नही देंगे” की धमकी। pic.twitter.com/LzZmPVaDRQ — MLA Naresh Balyan (@AAPNareshBalyan) May 6, 2022 ఇది కూడా చదవండి: మమత, అమిత్ షా పరస్పర విమర్శలు -
Tajinder Toor: ఒలింపిక్స్‌కు తజిందర్ అర్హత
పాటియాలా: ఇండియన్ గ్రాండ్‌ప్రి–4 అథ్లెటిక్స్ మీట్లో మూడు జాతీయ రికార్డులు బద్దలయ్యాయి. పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో తజిందర్ పాల్ సింగ్ తూర్ కొత్త జాతీయ రికార్డు, ఆసియా రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ మీట్లో పంజాబ్‌కు చెందిన 26 ఏళ్ల తజిందర్ ఇనుప గుండును 21.49 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్ అర్హత ప్రమాణం 21.10 మీటర్లను అతను అధిగమించాడు. 20.92 మీటర్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును తజిందర్ సవరిం చాడు. తజిందర్ ధాటికి 12 ఏళ్ల ఆసియా రికార్డు కూడా తుడిచి పెట్టుకుపోయింది. 21.13 మీటర్లతో 2009లో సుల్తాన్ అబ్దులుమ్ అల్ హెబ్షీ (సౌదీ అరేబియా) సాధించిన ఆసియా రికార్డును తజిందర్ బద్దలు కొట్టాడు. ద్యుతీ చంద్ కూడా... మహిళల 100 మీటర్ల విభాగంలో ఒడిశా స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ కూడా కొత్త జాతీయ రికార్డు సృష్టించింది. ఆమె 11.17 సెకన్లలో రేసును ముగిం చి 11.21 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును సవరించింది. 4్ఠ100 మీటర్ల రిలేలో ద్యుతీ చంద్, హిమా దాస్, ధనలక్ష్మి, అర్చనలతో కూడిన భారత ‘ఎ’ జట్టు 43.37 సెకన్లలో గమ్యానికి చేరి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. 43.42 సెకన్ల తో 2016లో మెర్లిన్, జ్యోతి, శ్రావణి ద్యుతీ బృం దం చేసిన జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. జాతీయ రికార్డే కానీ... మహిళల డిస్కస్ త్రోలో కమల్‌ప్రీత్ సింగ్ కూడా కొత్త జాతీయ రికార్డు ప్రదర్శనను నమోదు చేసింది. కమల్‌ప్రీత్ డిస్క్‌ను 66.59 మీటర్ల దూరం విసిరింది. గత మార్చిలో ఫెడరేషన్ కప్‌లో కమల్‌ప్రీత్ 65.06 మీటర్లతో జాతీయ రికార్డు నెలకొల్పింది. అయితే కమల్‌ప్రీత్ తాజా ప్రదర్శనను జాతీయ రికార్డుగా గుర్తించడం లేదు. రికార్డుగా గుర్తించాలంటే నిబంధనల ప్రకారం ఒక కేటగిరీలో కనీసం ముగ్గురు బరిలో ఉండాలి. సోమవారం జరిగిన మీట్లో కమల్‌ప్రీత్ కేటగిరీలో ఆమె ఒక్కరే పాల్గొన్నారు. -
అబద్దాల కోరుల్లో అగ్రగణ్యుడు అతడే..!!
న్యూఢిల్లీ : భారతదేశంలోని అతి పెద్ద అబద్దాల కోరుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అగ్రగణ్యుడని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధికార ప్రతినిధి తేజిందర్ పాల్ సింగ్ మండిపడ్డారు. అబద్దాలు చెప్పడంలో దిట్టైన కేజ్రీవాల్‌కు ‘దేశంలోనే అతి పెద్ద అబద్దాల కోరు అవార్డు’ను ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు ఎన్నికల సమయంలో వందల కొద్దీ వాగ్ధానాలు చేసిన కేజ్రీవాల్ ఒక్కదాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయారని దుయ్యబట్టారు. అంతేకాకుండా హామీలను అమలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై నిరాధారమైన ఆరోపణలు కేజ్రీ చేశారని అన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఫొటోతో తయారు చేసిన అవార్డు చిత్రాన్ని ట్వీట్ చేశారు తేజిందర్ పాల్ సింగ్. అంతేకాకుండా కేజ్రీవాల్ ఆడిన అతిపెద్ద అబద్ధాన్ని 9115929292కు వాట్సాప్ చేయాలని ఢిల్లీ ప్రజలను కోరారు. కేజ్రీవాల్ ఆడిన అతిపెద్ద అబద్ధాన్ని తెలిపిన వ్యక్తికి కేజ్రీవాల్ అవార్డుతో పాటు, రూ. 5,100/-ను బహుమతిగా ఇస్తామని పేర్కొన్నారు. -
తీవ్ర నిరసన : పాక్ హై కమిషన్‌కు చెప్పులు
సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ నేవీ ఆఫీసర్ కుల్‌భూషణ్ జాధవ్ కుటుంబసభ్యులతో పాకిస్తాన్ వ్యవహరించిన అమానుష ప్రవర్తనకు వ్యతిరేకంగా భారత్ పెద్ద ఎత్తున్న నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ నిరసనలో భాగంగా ఢిల్లీ బీజేపీ లీడరు, పాకిస్తాన్ హై కమిషన్‌కు ఆన్లైన్లో చెప్పులను డెలివరీ చేశారు. కులభూషణ్ తల్లి, భార్యతో వ్యవహరించిన తీరు పట్ల నిరసన వ్యక్తంచేస్తూ ఆయన ఈ చెప్పులను డెలివరీ చేసినట్టు పేర్కొన్నారు. కులభూషణ్‌ను చూసేందుకు వెళ్లిన అతడి తల్లి, భార్య కుంకుమ, తాళిని పాక్ అధికారులు బలవంతంగా తీసేయించిన సంగతి తెలిసిందే. అది తెలియని కులభూషణ్ వారిని కలిసిన వెంటనే నాన్నకు ఏమైంది? అంటూ ప్రశ్నించారు. కులభూషణ్ కుటుంబ సభ్యుల్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని, ఆయన తల్లిని, భార్యను వితంతువులుగా మార్చేసిందని ఆవేదన వ్యక్తంచేస్తూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంట్‌లోనే కన్నీరు పెట్టుకున్నారు. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తాజిందర్ పాల్ సింగ్ బగ్గా, ఆన్లైన్ చెప్పులను కొనుగోలు చేశారు. వాటి డెలివరీ కోసం పాకిస్తాన్ హై కమిషన్ అడ్రస్ ఇచ్చారు. ''పాకిస్తాన్‌కు మన చెప్పులు కావాలి. వారికి చెప్పులు పంపండి. నేను చెప్పులు ఆర్డర్ చేశా. పాకిస్తాన్ హై కమిషన్‌కు పంపాను'' అని తాజిందర్ పాల్ సింగ్ ట్వీట్ చేశారు. అంతేకాక పాకిస్తాన్‌కు చెప్పులు పంపండంటూ ఆన్లైన్ క్యాంపెయిన్‌కు కూడా లాంచ్ చేశారు. ఈ ఆన్లైన్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ హై కమిషన్‌కు వందల మంది భారతీయులు ఫుట్‌వేర్ పంపించారు. -
కృష్ణుడికి అవమానం: లాయర్‌పై బీజేపీ కేసు
ప్రముఖ లాయర్, కొత్త పార్టీ స్వరాజ్ అభియాన్ సహ స్థాపకుడు ప్రశాంత్ భూషణ్‌పై బీజేపీ కేసు పెట్టింది. హిందు దేవుడు శ్రీకృష్ణుడిపై రెచ్చగొట్టేవిధంగా ట్వీట్లు చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తజిందర్‌పాల్ సింగ్ బగ్గా తిలక్ మార్గ్ పోలీసు స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఉత్తరప్రదేశ్‌లో కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యాంటీ రోమియో స్క్వాడ్లు ఏర్పాటుచేయడాన్ని ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్లో తప్పుబట్టారు. 'రోమియో ఒక్క అమ్మాయిని మాత్రమే ప్రేమించాడు. కానీ కృష్ణుడు లెజండరీ ఈవ్‌టీజర్. తన విజిలెంట్స్‌ను యాంటికృష్ణస్క్వాడ్ అని పిలిచే దమ్ము ఆదిత్యనాథ్‌కు ఉందా' అంటూ భూషణ్ ట్విట్టర్లో సవాల్ చేశారు. అయితే, ఈ ట్వీట్ హిందూయిజాన్ని, హిందువులను కించపరచడమే అంటూ పలువురు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత బగ్గా ప్రశాంత్ భూషణ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు ప్రకటించారు.