చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్, హర్యానా హైకోర్టు షాక్ ఇచ్చింది. బీజేపీ నేతలు తజీందర్ సింగ్ బగ్గా, కుమార్ విశ్వాస్‌లపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేసింది. వారు తమ హక్కులు, రాజకీయ హోదాకు అనుగుణంగానే మాట్లాడారని, కేజ్రీవాల్‌పై విమర్శలు రాజకీయపరమైనవేనని స్పష్టం చేసింది. ఈమేరకు బుధవారం తీర్పు వెలువరించింది.
ఆప్ మాజీ నేతలైన తజీందర్ బగ్గా, కుమార్ విశ్వాస్ కొద్ది రోజుల క్రితం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఢిల్లీలో పన్ను మినాహాయింపు ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే వీరిపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని ఇద్దరూ హైకోర్టులో సవాల్ చేయగా.. న్యాయస్థానం అనుకూలంగా తీర్పునిచ్చింది.
తీర్పు అనంతరం తజీందర్ బగ్గా స్పందించారు. సత్యమే గెలుస్తుందని నిరూపితమైందని, అరవింద్ కేజ్రీవాల్‌కు ఇది చెంపపెట్టులాంటి తీర్పు అని విమర్శలు గుప్పించారు.
చదవండి: నిప్పంటించుకోబోయిన భార్యాభర్తలు.. రెప్పపాటులో..
Comments
Please login to add a commentAdd a comment