
ట్విటర్‌లో తేజిందర్ పాల్ సింగ్ షేర్ చేసిన ఫొటో
న్యూఢిల్లీ : భారతదేశంలోని అతి పెద్ద అబద్దాల కోరుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అగ్రగణ్యుడని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధికార ప్రతినిధి తేజిందర్ పాల్ సింగ్ మండిపడ్డారు. అబద్దాలు చెప్పడంలో దిట్టైన కేజ్రీవాల్‌కు ‘దేశంలోనే అతి పెద్ద అబద్దాల కోరు అవార్డు’ను ప్రకటించారు.
ఢిల్లీ ప్రజలకు ఎన్నికల సమయంలో వందల కొద్దీ వాగ్ధానాలు చేసిన కేజ్రీవాల్ ఒక్కదాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయారని దుయ్యబట్టారు. అంతేకాకుండా హామీలను అమలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై నిరాధారమైన ఆరోపణలు కేజ్రీ చేశారని అన్నారు.
ఈ మేరకు కేజ్రీవాల్ ఫొటోతో తయారు చేసిన అవార్డు చిత్రాన్ని ట్వీట్ చేశారు తేజిందర్ పాల్ సింగ్. అంతేకాకుండా కేజ్రీవాల్ ఆడిన అతిపెద్ద అబద్ధాన్ని 9115929292కు వాట్సాప్ చేయాలని ఢిల్లీ ప్రజలను కోరారు. కేజ్రీవాల్ ఆడిన అతిపెద్ద అబద్ధాన్ని తెలిపిన వ్యక్తికి కేజ్రీవాల్ అవార్డుతో పాటు, రూ. 5,100/-ను బహుమతిగా ఇస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment