
సాక్షి, కృష్ణా జిల్లా: ఫేస్‌బుక్ పరిచయం ఓ యువతి జీవితాన్ని నాశనం చేసింది. స్నేహం, సానిహిత్యం పేరుతో ఓ వ్యక్తికి దగ్గరైన యువతి.. అతనితో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ అతన్ని కాదని యువతి మరో వ్యక్తికి పెళ్లికి సిద్ధమైంది.అతినితోనూ శారీరకంగా దగ్గరైంది. చివరికి యువతికి చెందిన పర్సనల్ వీడియోలు బయటకు రావడంతో ఆమెతో నిశ్చయమైన పెళ్లిని రద్దు చేసుకున్నాడు సదరు యవకుడు. ఈ ఘటన జిల్లాలోని గుడివాడలో చోటుచేసుకుంది. బాధితురాలు గుడివాడ పోలీసులను ఆశ్రయించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గుడివాడ బంటుమిల్లి రోడ్డుకు చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన కర్రా న్యూటన్ బాబుతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో అతడి కోరిక మేరకు ఆమె నగ్నంగా వీడియో కాల్ చేసింది. ఈ క్రమంలో యువతికి ఇటీవల ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన గుర్రం పరంజ్యోతితో వివాహం నిశ్చయమైంది. కాబోయే భర్త పరంజ్యోతితోతో కూడా యువతి శారీరకంగా దగ్గరైంది. ఈనెల 14వ తేదీన వివాహం జరగాల్సి ఉంది.
చదవండి: ‘నా వల్ల కావట్లేదు..’ భర్తమామల్ని ఫేస్‌బుక్ లైవ్‌లో పెట్టి మరీ సనా..
అయితే న్యూటన్ బాబు యువతితో మాట్లాడిన న్యూడ్ వీడియోను పెళ్లి కొడుకు పరంజ్యోతికి నగ్న వీడియోలు పంపాడు. ఈ వీడియోను వరుడు తన కుటుంబానికి పంపి ఈ పెళ్లి వద్దని నిరాకరించాడు. ఈ క్రమంలో పెళ్లి పెద్ద అయిన ఓ వ్యక్తి సదరు వీడియోను యువతి కుటుంబానికి పంపి పెళ్లి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇదే వీడియో తమ బంధువుల్లోని కొంతమందికి సైతం చేరడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది.
దీనిపై విచారణ చేపట్టిన గుడివాడ టూ టౌన్ పోలీసులు న్యూటన్ బాబు అతని బంధువులు బాపట్ల కోటేశ్వరరావు, కొండ్రు రణధీర్‌ళు మరికొందరికి షేర్ చేసినట్లు గుర్తించారు. నూటన్‌బాబుపై అత్యాచారయత్నం కేసు, పరంజ్యోతిపై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు మరో ముగ్గురు పై 109,120b ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment