wedding cancel
-
వరుడి మొబైల్‌కు వధువు పర్సనల్ వీడియో.. ఆగిన వివాహం
సాక్షి, కృష్ణా జిల్లా: ఫేస్బుక్ పరిచయం ఓ యువతి జీవితాన్ని నాశనం చేసింది. స్నేహం, సానిహిత్యం పేరుతో ఓ వ్యక్తికి దగ్గరైన యువతి.. అతనితో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ అతన్ని కాదని యువతి మరో వ్యక్తికి పెళ్లికి సిద్ధమైంది.అతినితోనూ శారీరకంగా దగ్గరైంది. చివరికి యువతికి చెందిన పర్సనల్ వీడియోలు బయటకు రావడంతో ఆమెతో నిశ్చయమైన పెళ్లిని రద్దు చేసుకున్నాడు సదరు యవకుడు. ఈ ఘటన జిల్లాలోని గుడివాడలో చోటుచేసుకుంది. బాధితురాలు గుడివాడ పోలీసులను ఆశ్రయించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడివాడ బంటుమిల్లి రోడ్డుకు చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన కర్రా న్యూటన్ బాబుతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో అతడి కోరిక మేరకు ఆమె నగ్నంగా వీడియో కాల్ చేసింది. ఈ క్రమంలో యువతికి ఇటీవల ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన గుర్రం పరంజ్యోతితో వివాహం నిశ్చయమైంది. కాబోయే భర్త పరంజ్యోతితోతో కూడా యువతి శారీరకంగా దగ్గరైంది. ఈనెల 14వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. చదవండి: ‘నా వల్ల కావట్లేదు..’ భర్తమామల్ని ఫేస్బుక్ లైవ్‌లో పెట్టి మరీ సనా.. అయితే న్యూటన్ బాబు యువతితో మాట్లాడిన న్యూడ్ వీడియోను పెళ్లి కొడుకు పరంజ్యోతికి నగ్న వీడియోలు పంపాడు. ఈ వీడియోను వరుడు తన కుటుంబానికి పంపి ఈ పెళ్లి వద్దని నిరాకరించాడు. ఈ క్రమంలో పెళ్లి పెద్ద అయిన ఓ వ్యక్తి సదరు వీడియోను యువతి కుటుంబానికి పంపి పెళ్లి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇదే వీడియో తమ బంధువుల్లోని కొంతమందికి సైతం చేరడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన గుడివాడ టూ టౌన్ పోలీసులు న్యూటన్ బాబు అతని బంధువులు బాపట్ల కోటేశ్వరరావు, కొండ్రు రణధీర్ళు మరికొందరికి షేర్ చేసినట్లు గుర్తించారు. నూటన్బాబుపై అత్యాచారయత్నం కేసు, పరంజ్యోతిపై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు మరో ముగ్గురు పై 109,120b ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు. -
కట్నం సరిపోలేదని వరుడికి షాకిచ్చిన వధువు.. పెళ్లికి గంట ముందు..
సాక్షి, మేడ్చల్ జిల్లా: జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. కట్నం సరిపోలేదని ఓ వధువు ముహూర్తానికి గంట ముందు పెళ్లి రద్దు చేసుకుంది. హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన ఓ యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. అబ్బాయి తరఫు వారు అమ్మాయికి రూ.2 లక్షలు కట్నం ఇచ్చేలా కులపెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కుదిరింది. గురువారం రాత్రి 7:21 గంటలకు పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. అబ్బాయి కుటుంబ సభ్యులు ఘట్కేసర్లోని ఓ ఫంక్షన్హాల్లో పెళ్లి జరుగుతుందని ఆహ్వాన పత్రికలు బంధుమిత్రులకు పంపిణీ చేశారు. ముహూర్తానికి ముందే అబ్బాయి, కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ముహూర్తానికి సమయం అవుతున్నా.. అమ్మాయి, వారి కుటుంబసభ్యులు రాకపోవడంతో వరుడి తరఫు వారు ఆరాతీశారు. అబ్బాయి తరఫున ఇచ్చే కట్నం సరిపోవడం లేదని, అదనంగా కావాలని వధువు డిమాండ్ చేసింది. వివాహ సమయానికి గంట ముందు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసింది. వరుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో వారు అమ్మాయి కుటుంబ సభ్యులను పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు. తొలుత ఇచ్చిన రూ.2 లక్షలు సైతం అబ్బాయి కుటుంబసభ్యులు వదులుకున్నారు. తర్వాత ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. చదవండి: మహిళతో బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు!.. నీ భర్త బతికే ఉన్నాడు కదా అంటూ.. -
ఆమెతో పెళ్లి వద్దు.. వధువు మేకప్ ప్లాన్ ఎంత పనిచేసింది!
పెళ్లి వేడుక సందర్బంగా బ్యూటీపార్లర్‌కు వెళ్లడమే ఆమె పాలిట శాపమైంది. చిన్న మిస్టేక్ కారణంగా వివాహం ఆగిపోయిన పరిస్థితి ఎదురైంది. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిదంటే.. వివరాల ప్రకారం.. కర్నాటకలోని హసన్ జిల్లాలోని అరసికెరె గ్రామానికి చెందిన ఓ యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కాగా, పెళ్లి కోసమని ఆమె స్థానికంగా ఉన్న ఓ బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా ఫేషియల్ అనంతరం ఆవిరి పడుతున్న క్రమంలో వేడి కారణంగా ఆమె ముఖం వాడిపోయింది. దీంతో, ఆమె రూపం మొత్తం మారిపోయింది. ముఖం నల్లగా అయిపోయి.. ఆవిరి కారణంగా ముఖం వాచిపోయింది. అనంతరం, ఆమెను ఆసుపత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో ఆమెను చూసిన వరుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఆమె ముఖం మారిపోవడంతో వరుడు పెళ్లికి తిరస్కరించాడు. కాగా, వరుడి నిర్ణయంలో వధువు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ ఘటనకు కారణమైన బ్యూటీ పార్లర్ యజమాని గంగపై మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యజమానిని పిలిపించి విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, పెళ్లి ఆనందంలో ఉన్న ఇంట్ల ఈ చిన్న కారణంగా వివాహం ఆగిపోవడంతో ఈ ఘటన స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. -
పెళ్లి పీటలపై వరుడికి షాకిచ్చిన వధువు.. రెండడుగులు కలిసి నడిచి..
లక్నో: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడుతాయంటారు. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవితాంతం కలిసి ఉంటామని పెళ్లిలో ప్రమాణం చేస్తారు. కానీ ఈ మధ్య కాలంలో పెళ్లయ్యాక విడాకుల బాట పట్టే జంటలు ఎక్కువవుతున్నాయి. అంతేగాక మెడలో మూడు మూళ్లు పడకముందే పెళ్లిని పెటాకులు చేస్తున్నారు. కారణాలు ఏవైనా పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఎటావా జిల్లా భర్తనా పట్టణానికి చెందిన యువతికి ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఓ మంచి మూహుర్తం చూసి పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. అతిథులను పిలిచి, అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. చివరికి వివాహం జరగుతుండగా నాకు ఈ పెళ్లి వద్దు అంటూ వధువు షాకిచ్చింది. పెళ్లి చూపుల సమయంలో చూసిన వ్యక్తి ఇతను కాదని పెళ్లి పీటలపై వివాహాన్ని రద్దు చేసింది. ‘ఫోటోలో చూసిన వ్యక్తి ఇతను కాదు. అతను చాలా అందంగా ఉన్నాడు. ఇతను నల్లగా ఉన్నాడు. వీళ్లు నన్ను మోసం చేశారని బోరున విలపించింది. ఫోటోలో తెల్లగా ఉన్న వ్యక్తిని చూపించారని, పీటల మీద వరుడు మారిపోయాడని ఆరోపించింది. అయితే వధువును ఒప్పించేందుకు ఇరు కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా యువతి మాత్రం ససేమిరా అంది. చదవండి: Heavy Rains Forecast: కుండపోత వర్షాలు.. ఈ నగరాలకు రెడ్ అలెర్ట్ జారీ ఈ పంచాయితీ కాస్తా చివరికి పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు దాదాపు ఆరుగంటల పాటు రెండు కుంటుంబాలకు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో చివరికి పెళ్లి రద్దు చేశారు. పెళ్లి ఆగిపోవడంతో ఆగ్రహించిన వరుడు కుంటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు శారు. పెళ్లి సమయంలో ఇచ్చిన నగలను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. -
ఇంటర్ విద్యార్థినితో ప్రేమ.. మరో యువతితో పెళ్లి.. వివాహం రోజే!
సాక్షి, గుంటూరు: పెళ్లి పందిరి నిరసనలకు వేదికగా మారింది. పెళ్లి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయటంతో వివాహం రద్దు అయ్యింది. కట్నం కింద ఇచ్చిన నగదు ఇవ్వాలని వధువు కుటుంబసభ్యులు, బంధువులు పట్టుబట్టడంతో వివాదం జరిగింది. పెళ్లి కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతూ ముట్లూరు రోడ్డులో బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన సంఘటన చేబ్రోలు మండలం పాతరెడ్డిపాలెంలో సోమవారం చోటుచేసుకుంది. చేబ్రోలు మండలం పాతరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎం పవన్‌కుమార్‌కు చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయం అయింది. కట్నం కింద కొంత డబ్బులు ఇచ్చారు. సోమవారం వివాహం జరగాల్సి ఉంది. పవన్‌కుమార్ ఇదేప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థినిని ప్రేమించాడు. వీరి వివాహానికి యువకుని తల్లిదండ్రులు నిరాకరించారు. సోమవారం వివాహం జరుగుతుందని తెలిసిన ప్రేమికురాలు పవన్‌ను నిలదీసింది. మూడు రోజుల కిందట కళాశాల వద్దకు వస్తానని చెప్పిన యువకుడు రాకపోవటంతో మనస్థాపానికి చెందిన యువతి కళాశాల రెండో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గాయాలతో బయటపడిన విద్యార్థిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుంది. మోసం చేసిన పవన్‌కుమార్‌ను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పెళ్లి రద్దు అయ్యింది. విషయం తెలుసుకున్న పెళ్లి కుమార్తె కుటుంబసభ్యులు సోమవారం మధ్యా హ్నం పాతరెడ్డిపాలెం వచ్చారు. కట్నం కింద ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని, ఆడపిల్లకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక ముట్లూరు రోడ్డులో ఎండలో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలకు చెందిన వారితో మాట్లాడి పెళ్లి కుమార్తె కుటుంబసభ్యులు ఇచ్చిన డబ్బులు చెల్లించటానికి అంగీకరించటంతో సమస్య పరిష్కారమైంది. ఎస్ఐ వై సత్యనారాయణ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. చదవండి: దొంగనోట్లు మారుస్తూ పట్టుబడిన భార్యాభర్తలు -
ఒక్క ఫోన్‌కాల్‌తో పీటలపై ఆగిన పెళ్లి; బావా.. ఎంత పని చేస్తివి!
సాక్షి, మహబూబాబాద్ రూరల్: మరికొద్ది గంటల్లో జరగాల్సిన పెళ్లి అంతలోనే వచ్చిన ఓ ఫోన్‌కాల్‌తో పీటల మీదే ఆగిపోయింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని కేసముద్రం మండలం పరిధి గ్రామానికి చెందిన వధువుకు బయ్యారం మండలం పరిధిలో గల వరుడితో వివాహం నిశ్చయమైంది. బుధవారం ఉదయం 10 గంటలకు కురవి మండల కేంద్రంలో వివాహం జరిపేందుకు పెద్దలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెళ్లి మరికొద్ది గంటల్లో ఉందనగా వధువు అక్క భర్త వరుడి తండ్రికి ఫోన్‌చేసి వివాహం ముచ్చట్లు మాట్లాడాడు. బాబాయ్ పెళ్లి ఎక్కడ, ఎలా రావాలి, ఏర్పాట్లు ఎలా చేశారని మంచి చెడు అడిగి తెలుసుకున్నాడు. కాగా, మంగళవారం ప్రధానం వేడుక జరగగా పెళ్లి కుమార్తె వరుడి ఇంట్లో ఉంది. అదే క్రమంలో పెళ్లి కుమార్తె అక్కడే ఉందా అని అడిగాడు. దీంతో వరుడి తండ్రి ఫోన్‌ను నూతన వధువుకు ఇచ్చాడు. ఆమె బావ మాట్లాడుతూ నిన్న నేను అలిగి ప్రధానం సమయంలో నీతో ఫొటో ఎందుకు దిగలేదో తెలుసా.. నీ మీద కోపంతో నేను ఫొటో దిగలేదని మాట్లాడాడు. ఆ మాటలను కాల్ రికార్డ్‌లో విన్న పెళ్లి కుమారుడు తనకు ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని మొరాయించాడు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రాంతంలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు నివాసం ఉంటుండగా వారు పోలీసులను ఆశ్రయించారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ పోలీసులు నూతన వరుడికి కౌన్సెలింగ్ ఇచ్చినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అతడు ఆమెను పెళ్లి చేసుకోనని పట్టుబట్టాడు. టౌన్ సీఐ సతీష్‌ను వివరణ కోరగా బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు. చదవండి: సరూర్ నగర్ హత్య: ‘కాపాడమని కాళ్లు పట్టుకున్నా.. ఎవరూ ముందుకు రాలేదు’ -
ఒమిక్రాన్ ఎఫెక్ట్: న్యూజిలాండ్ ప్రధాని పెళ్లి వాయిదా!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. లక్షలాది కొత్త పాజిటివ్ కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్లతో.. పలు దేశాలు అప్రమత్తమై కఠిన ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వీకెండ్ లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యూలను విధిస్తున్నాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్‌లో కరోనా వైరస్, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంతో న్యూజిలాండ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఒమిక్రాన్ ఆంక్షలు.. ఆ దేశ ప్రధానమంత్రి జసిందా అర్డర్న్ పెళ్లికి అడ్డొచ్చాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో తన పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రధాని జెసిందా ప్రకటించారు. క్లార్క్ గేఫోర్డ్, జెసిందా ఇద్దరు స్నేహితులు. ఇప్పటికే జెసిందా, గేఫోర్డ్ కరోనా కారణంగా పలుమార్లు తమ పెళ్లిని వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కరోనా ఆంక్షల నేపథ్యంలో మరోసారి తమ వివాహాన్ని వాయిదా వేసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతం వివాహ తేదీని అధికారికంగా ప్రకటించలేదు. ప్రధాని జెసిందా ఆదివారం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోందని.. ప్రజలతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనాతో ఇబ్బందులను అనుభవిస్తున్నవారిలో తాను కూడా చేరానని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తోందని దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
పెళ్లి బాజా మోగాల్సిన ఇంట విషాదం.. ఓ ప్రబుద్ధుడు పెళ్లి చెడగొట్టడంతో
సాక్షి, నిజామాబాద్(మాచారెడ్డి): కొద్ది రోజుల్లో పెళ్లి భాజా మోగాల్సిన ఇంట విషాదం అలుముకుంది. ఓ ప్రబుద్ధుడు పెళ్లి చెడగొట్టడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఫరీదుపేట గ్రామానికి చెందిన కవిత (21)కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. అయితే అదే గ్రామానికి చెందిన వివాహితుడైన గోదూరి ప్రవీణ్ అనే వ్యక్తి ఆమెను ప్రేమిస్తున్నానంటూ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. ఈ విషయమై గతంలో గ్రామంలో పంచాయితీ నిర్వహించి జరిమానా సైతం విధించారు. అయినా అతడి బుద్ధి మారలేదు. చదవండి: (Uday Kumar Reddy: ఎస్సైగా ఇక్కడే.. ఎస్పీగా ఇక్కడికే!) పెళ్లి చెడగొట్టాలన్న దురుద్దేశంతో ఆ యువతికి కాబోయే భర్తకు ఫోన్ చేశాడు. తాను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో పెళ్లి ఆగిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన కవిత సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో బహిర్భూమికని వెళ్లి గ్రామశివారులోని బండారి చెరువు కాలువ వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురు ఆత్మహత్యకు గోదూరి ప్రవీణ్ కారణమని యువతి తండ్రి ఎల్లయ్య, తల్లి మణెవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. చదవండి: (దేవుడా ఎంతపని చేశావయ్యా.. పెళ్లై నెలైనా కాలేదు.. ఇంతలోనే..) -
మద్యం మత్తులో వరుడు.. షాక్ ఇచ్చిన వధువు
తిరువొత్తియూరు: మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. వధువు, ఆమె బంధువులు ఆలయానికి చేరుకున్నారు. వరుడు ఎంతకూ రాకపోవడంతో అతని ఇంటికి వెళ్లి చూడగా మద్యం మత్తులో పడివున్నాడు. తీరా అతన్ని తీసుకురాగా వివాహం చేసుకోవడానికి వధువు నిరాకరించింది. మద్యం జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలిపే ఈ ఉదంతం కృష్ణగిరిలో జరిగింది. వివరాలు.. ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలోని తొట్ట హడక్కాన్ హళ్లికి చెందిన శరవణన్ (32) కార్మికుడు. ఇతనికి తిరువణ్ణామలైలోని చెంగం నెహ్రునగర్‌కు చెందిన యువతి (22)తో శుక్రవారం పెళ్లి నిశ్చయించారు. రాయకోటై వజ్రపళ్లం శివాలయంలో ఏర్పాట్లు చేశారు. ఉదయం వధువు తరఫు వారు ఆలయానికి చేరుకున్నారు. చాలా సమయం అయినా వరుడి ఇంటి వారు రాకపోవడంతో అతని ఇంటికి వెళ్లి చూశారు. శరవణన్ మద్యం మత్తులో లేవడానికి వీలుకాని స్థితిలో పడి ఉన్నాడు. అతన్ని మారండహళ్లి పోలీసులకు అప్పగించారు. మద్యం మత్తు నుంచి తేరుకున్న శరవణన్ క్షమించమని కోరినా వధువు ఒప్పుకోకపోవడంతో వివాహం ఆగిపోయింది. వివాహానికి చేసిన ఖర్చును వరుడి ఇంటి వారు తిరిగి ఇవ్వాలని పోలీసుస్టేషన్లో ఒప్పందం చేసుకున్నారు. -
వధువు చీర గురించి గొడవ.. చివరికి
బెంగళూరు: మంచి కాఫీ లాంటి సినిమా ‘ఆనంద్’ గుర్తుందా? పెళ్లికూతురు కట్టుకున్న చీర బాగోలేదని, వెంటనే చీర మార్చుకోమని చెబుతుంది కాబోయే అత్తగారు. లేదు, నాకీ చీరే బాగుంది. ఇది మా అమ్మ చీర అని చెబుతుంది పెళ్లికూతురు. ఆ మాటలకు కాబోయే అత్తగారు ఉరిమి చూసి, నానా మాటలూ అంటుంది. అప్పుడు పెళ్లికూతురే ఆ పెళ్లి క్యాన్సిల్ చేస్తుంది. అందరూ ఆమెను నానా మాటలూ అంటారు చీరకోసం పెళ్లి రద్దు చేసుకుంటావా అని. అచ్చం ఇటువంటి ఘటనే కర్ణాటకలోని హసన్‌లో జరిగింది. బీఎన్ రఘుకుమార్, సంగీత అనే అమ్మాయి ఏడాది కాలంగా పరస్పరం ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెద్దలను ఒప్పించి వీరిద్దరు పెళ్లికి సిద్ధపడ్డారు. ఈ మేరకు గురువారం పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాలు నిశ్చయించాయి. అయితే పెళ్లికూతురికి ఆమె తల్లిదండ్రులు పెట్టిన పెళ్లి చీర నాసిరకంగా ఉందన్న కారణంతో రఘుకుమార్ తల్లిదండ్రులు పెళ్లిమండపంలో గొడవ చేశారు. ‘అమ్మాయిని చీర మార్చుకు రమ్మనండి, తను కట్టుకుని ఉన్నది బొత్తిగా నాసిరకంగా ఉంది’ అంటూ వధువు తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే వాళ్లు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఆ వాదన చివరికి పెళ్లి రద్దు చేసేందుకు దారితీసింది. ఈ క్రమంలో తల్లిదండ్రుల మాట మేరకు రఘుకుమార్ పెళ్లి మండపానికి రాకుండానే అదృశ్యమైపోయాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికొడుకు మీద, అతని అమ్మానాన్నల మీద స్థానిక మహిళా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మంచి కాఫీ లాంటి ఆనంద్ సినిమాలా ఈ కథ కూడా సుఖాంతం అవుతుందేమో చూడాలి! -
'ఆయన ముక్కు బాలేదు.. నాకీ పెళ్లొద్దు'
బెంగళూరు: పెళ్లి కొడుకు ఎత్తు సరిగా లేకపోయినా, బట్టతల ఉన్నా, పొట్ట ఉన్న అబ్బాయిలు అమ్మాయిలకు నచ్చకపోవడం మనందరం వింటూ ఉంటాం. కానీ.. ఓ యువతికి విచిత్రంగా యువకుడి ముక్కు నచ్చలేదు. అది కూడా పెళ్లి పీటల వరకు వచ్చాక అతని ముక్కు నచ్చలేదని చెప్పి పెళ్లిని క్యాన్సిల్ చేసింది. ఈ విచిత్ర ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. కోరమంగలకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జ్యోతిప్రకాశ్కు ఓ మాట్రిమోనీ సైట్ ద్వారా హిమబిందు అనే యువతితో పరిచయమైంది. దీంతో ఇద్దరూ చాటింగ్ చేసుకుని ప్రేమలో పడ్డారు. కొంతకాలం ప్రేమించుకున్నాక, పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లికి సిద్ధపడ్డారు. చదవండి: రైలులో చిన్న వివాదం ఎంత పనిచేసింది? గతేడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నెల 30న వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లికి లక్షలు ఖర్చు చేశారు. శుభలేఖలు కూడా పంచేశారు. ఇరు కుటుంబాల వారు పెళ్లి దుస్తులు కొనుగోలు చేస్తూ హడావిడిగా ఉన్నారు. ఇంతలో పెళ్లికుమార్తె బాంబు పేల్చింది. పెళ్లికొడుకు ముక్కు పొడవుగా ఉందని తనకు అతడి ముక్కు నచ్చట్లేదని చెప్పింది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని, లేదంటే పెళ్లికి ఒప్పుకోనని తేల్చి చెప్పింది. ఇంత డబ్బు ఖర్చు చేసి పెళ్లి చేస్తుంటే ఇలా చేయడం సరికాదని ఆమెపై పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు కోరమంగల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చదవండి: బాలికపై ఇద్దరు యువకుల దాష్టీకం -
పెళ్లి చేసుకుంటామన్న మైనర్లు..
సాక్షి, సీతానగరం: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని జాలిమూడికి చెందిన ఇద్దరు మైనర్లు పెళ్లి చేసుకుంటామంటూ పెద్దలను ఎదిరించడంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. జాలిమూడికి చెందిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటామని గురువారం రాత్రి పెద్దలకు చెప్పారు. 100 నంబర్‌కు కాల్ వెళ్లడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇంటర్ సెకండియర్ చదువుతున్న అమ్మాయి, ఎదురింటిలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న అబ్బాయి ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి తల్లి విదేశాల్లో ఉండడంతో మేనమామ ఇంటి వద్ద ఉంటోంది. పెళ్లి విషయం వ్యతిరేకించిన మేనమామతో గొడవపడి ఎదురింటిలోని అబ్బాయి ఇంటికి వెళ్లింది. దీంతో గొడవ జరుగుతుందని భావించిన అబ్బాయి తరఫు వారు 100 నంబర్‌కు కాల్ చేయడంతో స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి, సర్టిఫికెట్లు పరిశీలించి నాలుగు నెలలో అబ్బాయికి, ఇరవై రోజుల్లో అమ్మాయికి మైనార్టీ తీరుతుందని చెప్పి, ఇరు కుటుంబాల వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇరు కుటుంబాలవారు వివాహం చేసేందుకు ఒప్పుకొన్నారు. చదవండి: స్ర్కీన్ మీదనే కాదు.. నిజజీవితంలోనూ హీరోనే..! -
అతడి వాలకం చూసి.. పెళ్లి వద్దన్న వధువు
భువనేశ్వర్: కాబోయే భర్త మద్యానికి బానిసయ్యాడని తెలిసిన ఓ వధువు ఆ పెళ్లిని నిరాకరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఈ వివాహం చేసుకోనని తెగేసి చెప్పడంతో ఆఖరి నిమిషంలో వివాహం రద్దు అయ్యింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఒడిశాలో మంగళవారం జరిగింది. పశ్చిమ ఒడిశాలోని సంబల్పూర్ జిల్లా జుజుమురా సమితి గోవర్ధన్ బడమల్ గ్రామంలో మంగళవారం ఓ వివాహం జరుగుతోంది. వరుడు పూటుగా మద్యం తాగి వచ్చాడు. అతను తూలిపోతూ కనీసం తాళి కూడా కట్టలేకపోయాడు. ఇది చూసిన వధువు అతనితో పెళ్లి వద్దని పీటల మీద నుంచి లేచి వచ్చేసింది. దీంతో అబ్బాయి తరఫు వారు వధువుని కాసేపు బతిమలాడారు. కానీ వధువు మాత్రం పెళ్లి సమయంలో ఇలా తాగివచ్చిన వాడితో తాను జీవితాన్ని పంచుకోలేనని స్పష్టం చేసింది. చేసేదేమిలేక చివరి నిమిషంలో పెళ్లిని రద్దు చేశారు. వరుడు, అతడి కుటుంబ సభ్యులు తమకు ఇచ్చిన కట్నకానులను తిరిగిచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాగుబోతును పెళ్లి చేసుకోనని కరాకండీగా చెప్పేసిన వధువును పలువురు అభినందించారు. -
'నేను భర్తను కొనను.. నాకు ఆ పెళ్లి వద్దు'
తిరువనంతపురం: వరకట్నం గురించి ప్రస్తుతం ఎవరూ అంతగా మాట్లాడుకోకపోయినా అది చాపకింద నీరులా నేటి అమ్మాయిల కుటుంబాలను ఇప్పటికీ వెంటాడుతున్న సమస్యే. ముసుగులు ధరించి బ్రతుకుతున్న నేటి రోజుల్లో ఈ సమస్యపై నోరు విప్పేవారు అతి కొద్దిమంది మాత్రమే. వరకట్న నిషేధ చట్టం 1961 సెక్షన్ 304బీ, 498 ఏ ప్రకారం కట్నం ఇవ్వడం, కట్నం కోరడం నేరమే అవుతుంది. ఈ విషయం నేటి రోజుల్లో చాలామంది మరిచిపోయారనే అనుకోవచ్చు. కానీ, కేరళలో మాత్రం ఓ యువతి ధైర్యంగా వరకట్నంపై తన గొంతును విప్పింది. పెళ్లిపీటల వరకు వచ్చిన పెళ్లిన వరుడు తరుపువాళ్లు కట్నం అడుగుతున్నారని, అలాంటి కుటుంబానికి తాను కోడలిగా వెళ్లాలనుకోవడం లేదని బహిరంగంగా ప్రకటించి తన వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు చెప్పింది. కేరళలోని త్రిశూర్‌కు చెందిన రమ్యా రామచంద్రన్ అనే యువతికి ఈ మధ్య నిశ్చితార్థం అయింది. నిశ్చితార్థం సమయంలో ఎలాంటి డిమాండ్ చేయని అబ్బాయి తరుపువాళ్లు అనంతరం మాత్రం రూ.ఐదు లక్షల వరకట్నం, బంగారం కావాలని డిమాండ్ చేశారు. దీంతో ముందునుంచే వరకట్నం విషయంలో ఒక స్పష్టమైన అభిప్రాయం ఉన్న రమ్యా తన వివాహాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. 'నేను భర్తను.. అతడి కుటుంబాన్ని కొనుక్కోవాలనుకోవడం లేదు. నేను వరకట్నానికి పూర్తిగా వ్యతిరేకిని. మాట తప్పిన వారితో మాకు ఎలాంటి సంబంధం వద్దు. అందుకే నేను నా వివాహాన్ని రద్దు చేసుకోవాలని అనుకుంటున్నాను' అని ఆమె ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేసింది. దీనిని చూసి నెటిజన్లు ఆమెను మెచ్చుకున్నారు.