'ఆయన ముక్కు బాలేదు.. నాకీ పెళ్లొద్దు' | Techie Goes To Court After Fiancee Dumps Him Over Long Nose | Sakshi
Sakshi News home page

లక్షలు ఖర్చు చేశారు.. చివరికి ముక్కు బాగోలేదని

Published Mon, Jan 6 2020 10:26 AM | Last Updated on Mon, Jan 6 2020 10:27 AM

Techie Goes To Court After Fiancee Dumps Him Over Long Nose - Sakshi

బెంగళూరు: పెళ్లి కొడుకు ఎత్తు సరిగా లేకపోయినా, బట్టతల ఉన్నా, పొట్ట ఉన్న అబ్బాయిలు అమ్మాయిలకు నచ్చకపోవడం మనందరం వింటూ ఉంటాం. కానీ.. ఓ యువతికి విచిత్రంగా యువకుడి ముక్కు నచ్చలేదు. అది కూడా పెళ్లి పీటల వరకు వచ్చాక అతని ముక్కు నచ్చలేదని చెప్పి పెళ్లిని క్యాన్సిల్ చేసింది. ఈ విచిత్ర ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. కోరమంగలకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జ్యోతిప్రకాశ్‌కు ఓ మాట్రిమోనీ సైట్‌ ద్వారా హిమబిందు అనే యువతితో పరిచయమైంది. దీంతో ఇద్దరూ చాటింగ్ చేసుకుని ప్రేమలో పడ్డారు. కొంతకాలం ప్రేమించుకున్నాక, పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లికి సిద్ధపడ్డారు. 

చదవండి: రైలులో చిన్న వివాదం ఎంత పనిచేసింది?

గతేడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నెల 30న వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లికి లక్షలు ఖర్చు చేశారు. శుభలేఖలు కూడా పంచేశారు. ఇరు కుటుంబాల వారు పెళ్లి దుస్తులు కొనుగోలు చేస్తూ హడావిడిగా ఉన్నారు. ఇంతలో పెళ్లికుమార్తె బాంబు పేల్చింది. పెళ్లికొడుకు ముక్కు పొడవుగా ఉందని తనకు అతడి ముక్కు నచ్చట్లేదని చెప్పింది. ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోవాలని, లేదంటే పెళ్లికి ఒప్పుకోనని తేల్చి చెప్పింది. ఇంత డబ్బు ఖర్చు చేసి పెళ్లి చేస్తుంటే ఇలా చేయడం సరికాదని ఆమెపై పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు కోరమంగల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

చదవండి: బాలికపై ఇద్దరు యువకుల దాష్టీకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement