Nizamabad: Young Woman Commits Suicide Over Wedding Issue - Sakshi
Sakshi News home page

పెళ్లి బాజా మోగాల్సిన ఇంట విషాదం.. ఓ ప్రబుద్ధుడు పెళ్లి చెడగొట్టడంతో

Dec 28 2021 12:36 PM | Updated on Dec 28 2021 12:58 PM

Young Woman Commits Suicide in Nizamabad Over Wedding Issue  - Sakshi

పెళ్లి చెడగొట్టాలన్న దురుద్దేశంతో ఆ యువతికి కాబోయే భర్తకు ఫోన్‌ చేశాడు. తాను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో పెళ్లి ఆగిపోయింది.

సాక్షి, నిజామాబాద్‌(మాచారెడ్డి): కొద్ది రోజుల్లో పెళ్లి భాజా మోగాల్సిన ఇంట విషాదం అలుముకుంది. ఓ ప్రబుద్ధుడు పెళ్లి చెడగొట్టడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఫరీదుపేట గ్రామానికి చెందిన కవిత (21)కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. అయితే అదే గ్రామానికి చెందిన వివాహితుడైన గోదూరి ప్రవీణ్‌ అనే వ్యక్తి ఆమెను ప్రేమిస్తున్నానంటూ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. ఈ విషయమై గతంలో గ్రామంలో పంచాయితీ నిర్వహించి జరిమానా సైతం విధించారు. అయినా అతడి బుద్ధి మారలేదు.

చదవండి: (Uday Kumar Reddy: ఎస్సైగా ఇక్కడే.. ఎస్పీగా ఇక్కడికే!) 

పెళ్లి చెడగొట్టాలన్న దురుద్దేశంతో ఆ యువతికి కాబోయే భర్తకు ఫోన్‌ చేశాడు. తాను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో పెళ్లి ఆగిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన కవిత సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో బహిర్భూమికని వెళ్లి గ్రామశివారులోని బండారి చెరువు కాలువ వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురు ఆత్మహత్యకు గోదూరి ప్రవీణ్‌ కారణమని యువతి తండ్రి ఎల్లయ్య, తల్లి మణెవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.    

చదవండి: (దేవుడా ఎంతపని చేశావయ్యా.. పెళ్లై నెలైనా కాలేదు.. ఇంతలోనే..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement