
ధరణి (ఫైల్)
దుగ్గిరెడ్డిపాలెం(మర్రిపూడి)/ప్రకాశం జిల్లా: పరీక్షలు సరిగా రాయలేదని మనస్తాపం చెంది విద్యార్థిని నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని దుగ్గిరెడ్డిపాలెంలో గురువారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముచ్చుమూరి ధరణి (20) కనిగిరిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది.
చదవండి: మహిళా ప్రొఫెసర్‌కు అశ్లీల వీడియోలు, అసభ్యకర మెసేజ్‌లు..
పరీక్షలు సరిగ్గా రాయలేదని మనస్తాపం చెందింది. బుధవారం రాత్రి నిద్రమాత్రలు మింగింది. విషయం తెలుసుకున్న బంధువులు ఆమెను వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ అంకమ్మరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. మృతదేహాన్ని పొస్టుమార్టం కోసం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment