Sleeping pills
-
చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తను హత్య చేసిన భార్య
మడకశిర: నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన గుర్తు తెలియని శవం కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్ వివరాలను తెలియజేశారు. 2023 జనవరి 12న మడకశిర మండలం కోడిగానిపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలువకు ఏర్పాటు చేసిన బ్రిడ్జి కింద గుర్తు తెలియని శవాన్ని గుర్తించారు. వీఆర్ఓ హారతి స్థానిక పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.మిస్సింగ్ కేసుల ఆధారంగా ..మడకశిర పోలీసులు వివిధ ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి మడకశిర సీఐ సురేష్‌బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆయన బదిలీపై వెళ్లిపోవడంతో ప్రస్తుత మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్, గుడిబండ ఎస్ఐ మునిప్రతాప్ కేసు దర్యాప్తు కొనసాగించారు. ఇందులో భాగంగా కర్ణాటకలోని తుమకూరు జయనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఓ మిస్సింగ్ కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. తుమకూరుకు చెందిన నాగరత్నమ్మ అనే మహిళ తన పెద్ద కుమారుడు మోహన్‌కుమార్ (52) తప్పిపోయినట్లు 2023 జనవరి 21న జయనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వివరాలను మడకశిర పోలీసులు సేకరించారు. ఆ తర్వాత శవం ఫొటోను నాగరత్నమ్మకు చూపించగా మృతుడు తన పెద్ద కుమారుడేనని గుర్తు పట్టింది. మృతుడి సోదరులైన అరుణ్‌కుమార్, కిరణ్‌కుమార్‌లను కూడా మడకశిర పోలీసులు విచారించారు. తప్పిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు.విచారణలో పోలీసులకు దొరికిన క్లూమృతుడి తల్లి, సోదరుల విచారణలో ఈ కేసుకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడికి, అతని భార్య కవితకు మనస్పర్థలు ఉన్నాయి. దీంతో మృతుడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి తుమకూరులోనే శిరా గేట్లో వేరుగా తన కుమారుడు కౌశిక్, కుమార్తె దీక్షితతో కలిసి ఉంటోందని వారు పోలీసులకు వివరాలు అందించారు. ఈవివరాల మేరకు మడకశిర పోలీసులు మృతుడి భార్య కవితను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు.భార్య విచారణతో వీడిన మిస్టరీమృతుడి భార్య కవితను పోలీసులు విచారణ చేయడంతో మోహన్‌కుమార్‌ను హత్య చేసినట్లు తేలింది. కవితకు తుమకూరు జిల్లా గుబ్బిలో పనిచేసే విద్యుత్‌శాఖ జేఈగా పని చేసే అక్తర్‌పాషాతో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అతనితో సహ జీవనం కూడా చేసేది. అక్తర్‌పాషాతో కవిత డబ్బులు ఇప్పించుకుని తుమకూరులోనే ఓ హోటల్ పెట్టింది. ఈ క్రమంలో మృతుడు మోహన్‌కుమార్ పలుసార్లు హోటల్ వద్దకు వెళ్లి భార్య కవిత, ప్రియుడు అక్తర్‌పాషా, హోటల్లో పని చేసే వంట మనిషి మోహన్‌ప్రసాద్, కుమారుడు కౌశిక్‌ను దూషించేవాడు. తన ఆస్తిని మీకు ఇవ్వనని, తన సోదరులకు ఇస్తానని భార్య, కుమారుడితో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో భార్య కవిత, కుమారుడు కౌశిక్, ప్రియుడు అక్తర్‌పాషాలు మోహన్‌కుమార్‌ను చంపడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనికి హోటల్ వంట మనిషి మోహన్‌ప్రసాద్‌తో సుపారీ మాట్లాడారు. రూ.లక్షకు ఒప్పందం చేసుకొని రూ.50 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చారు.చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి హత్యపథకం ప్రకారం కుమార్తె దీక్షతకు ఆరోగ్యం బాగా లేదని మోహన్‌కుమార్‌ను భార్య కవిత 2023 జనవరి 11న రాత్రి 9 గంటల సమయంలో ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు వేసి మోహన్‌కుమార్‌కు పెట్టారు. భోజనం చేసిన తర్వాత మృతుడు మత్తులోకి పోయాడు. ఈక్రమంలో భార్య కవిత, కుమారుడు కౌశిక్, వంట మనిషి మోహన్‌ప్రసాద్... మోహన్‌కుమార్ తలపై రోకలిబండతో కొట్టారు. మృతుడి భార్య ప్రియుడు అక్తర్‌పాషా కత్తితో గొంతుకోశారు. మోహన్‌కుమార్ మృతి చెందగా శవాన్ని ఓ ప్లాస్టిక్ సంచిలో కట్టి వంట మనిషి ఓ కారులో వేసుకుని మడకశిర మండలంలోని కోడిగానిపల్లి హంద్రీనీవా కాలువ బ్రిడ్జి కింది భాగాన పడేసి వెళ్లారు.నలుగురు నిందితుల అరెస్ట్పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్, గుడిబండ ఎస్ఐ మునిప్రతాప్ సిబ్బంది ఆదివారం నిందితులను తుమకూరులో అరెస్ట్ చేశారు. శవాన్ని తరలించడానికి ఉపయోగించిన కారు, మరణాయుధాలు కూడా సీజ్ చేశారు. నిందితులైన కవిత, అక్తర్‌పాషా, కౌశిక్, మోహన్‌ప్రసాద్‌లను కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ రాజ్‌కుమార్, ఎస్ఐ మునిప్రతాప్ తదితర పోలీసులను ఎస్పీ రత్న అభినందించినట్లు పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. -
ఏదో ఒక కారణంతో..ఆ పిల్స్‌ని అదేపనిగా వాడుతున్నారా?!
నిద్రపట్టడం లేదు.. ఆందోళనగా ఉంది. మూడ్ బాగోలేదు.. స్ట్రెస్‌గా ఉంది. వీటన్నింటికీ మనవాళ్లు ఎంచుకుంటున్న మార్గం ‘పిల్’. ఒక మోతాదులో టాబ్లెట్ వాడితే సమస్య తగ్గిపోతుంది కదా! అనుకుంటారు. ఇది చెడు అలవాటు కాదనుకుంటారు. కానీ, ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు టాబ్లెట్ వేసుకోవడం కూడా వ్యసనమే. నేటి రోజుల్లో చాలామంది వర్క్ టెన్షన్ అనో, స్ట్రెస్ అవుతున్నామనో స్లీపింగ్ పిల్స్‌కు అలవాటు పడిపోయేవారు పెరుగుతున్నారు. వీటిని ముందుగా డాక్టర్ని కలిసి వారి సలహాతో తీసుకోవడం మొదలుపెడతారు. ఆ టాబ్లెట్ వేసుకున్న కొన్ని రోజులు బాగా అనిపించి, ఆ పాత ప్రిస్క్రిప్షన్ పైన ఆ టాబ్లెట్లను అలాగే కంటిన్యూ చేస్తుంటారు. యాంగ్జైటీ పిల్స్, స్ట్రెస్ పిల్స్, మూడ్ ఎలివేటర్స్.. ఇలా విభిన్న రకాలుగా ఉండే ఈ పిల్స్‌ను ఆందోళనగా అనిపింనప్పుడల్లా వాడతారు, క్రమేణా వాటికి అలవాటు పడిపోయి మరిన్ని సమస్యల్లోకి కూరుకుపోతున్నారు. ∙∙ వసుధ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ప్రాజెక్ట్ టీమ్ లీడర్‌గా బిజీ షెడ్యూల్ తనది. ఓ వైపు కుటుంబం, మరోవైపు ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం. కొన్నాళ్లు బాగానే మేనేజ్ చేసినా ఎదురయ్యే సమస్యలు టెన్షన్ పెట్టేవి. దీంతో ఆందోళన పెరిగిపోయేది. ఒత్తిడిని తగ్గించుకోవాలంటే బాగా నిద్రపోవాలని చెబుతుండేవారు స్నేహితులు. కానీ, ఆ ఒత్తిడి వల్లే నిద్ర పట్టడం లేదనేది వసుధ కంప్లైంట్. ఫ్రెండ్ సలహా మేరకు డాక్టర్ని కలిసింది. కొన్ని రోజులు ఆందోళన తగ్గడానికి ఒక మెడికల్ కోర్సును వాడమని చెప్పాడు డాక్టర్. ఆ కోర్స్ వాడాక తనకు చాలా రిలీఫ్‌గా అనిపింంది. ఆందోళనగా అనిపించినా, పనిభారంతో తల బరువుగా అనిపించినా అవే టాబ్లెట్స్ తెచ్చుకొని వాడటం మొదలుపెట్టింది. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు టాబ్లెట్ లేనిదే పరిష్కారం కాదు అనేంత స్థాయికి వచ్చేసింది. నిద్ర పట్టడం లేదని రాత్రిళ్లు స్లీపింగ్ పిల్స్ వేసుకునేది. కానీ, ఆఫీసుకు వెళ్లినా ఆ మత్తు ఆమెను వదిలేది కాదు. దీంతో తీసుకున్న ప్రాజెక్ట్ వర్క్స్ చేయడంలో ఆలస్యం అవుతూ ఉండేది. రోజులో ఎక్కువ సమయం మత్తుగా ఉండటంతో జాబ్ పోయే పరిస్థితి ఎదురైంది. లాయర్, డాక్టర్, ఇంజినీర్.. ప్రతీ వృత్తి, ఉద్యోగం చేస్తున్నవారిలో ఎన్నో ఆందోళనలు ఎదుర్కోవడం చూస్తున్నాం. ఈ ఆందోళన స్థాయి వారి శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో సమస్యను సాల్వ్ చేసుకోవడానికి టాబ్లెట్స్‌ను ఆశ్రయించేవారు పెరుగుతున్నారు. శరీరానికి ఏ కొద్దిగా కెమికల్‌ను బయట నుంచి అలవాటు చేసినా మైండ్ మరికొంత మోతాదు పెంచేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా కెమికల్ మోతాదు శరీరంపై చెడు ప్రభావం చూపడానికి దోహదం చేస్తాయి. సహజమే కానీ.. ఈ సమస్యను ఎదుర్కొనేవారిలో అధిక శాతం చదువుకున్నవారే. ‘ఇదేమీ చెడు అలవాటు కాదు కదా! నేను సరైన విధంగా మానేజ్ చేసుకోగలుగుతున్నాను కదా’ అనుకుంటారు. బయటి వాళ్లకు కూడా వీళ్లు ‘పిల్స్’వాడుతున్నారనే విషయం తెలియదు. కొంత కాలం బాగానే గడిచిపోతుంది. కానీ, సమస్య మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఏ వ్యక్తిలో అయినా భావోద్వేగాలు మారిపోతుండటం సహజంగా జరుగుతుంది. కొందరు మాత్రం ప్రతిదానికి ఆందోళన పడే వారుంటారు. మన వ్యక్తిత్వం ఇలాంటిది అని అర్థం చేసుకొని, ఈ సమస్యనుం బయటకు రావడానికి నిపుణులు సాయం తీసుకోవాలి. కొందరికి రకరకాల ఫోబియాలు ఉంటాయి. వీటిని అధిగమించడానికి కూడా టాబ్లెట్స్‌ని ఆశ్రయిస్తుంటారు. ఇవీ వనసిక సమస్యలే అని గుర్తించాలి. బయటపడాలంటే టెక్నిక్స్: మనకు తెలియదు కానీ, చాలామంది మహిళల పర్సులలో కొన్ని టాబ్లెట్లు ఉంటాయి. అవి, పెయిన్ కిల్లర్స్, మూడ్ స్టెబిలైజర్స్, స్ట్రెస్ పిల్స్, స్లీపింగ్ పిల్స్... వంటి వాటిలో ఏవైనా ఉండచ్చు. ముందుగా వాటిని బయట పడేయాలి. ఏ సమస్య బాధిస్తోందో దానిని కుటుంబ సభ్యుల మధ్య లేదా నిపుణుల ముందు వ్యక్తం చేయాలి. ఆ సమస్యకు సంబంధించిన బ్లాక్స్‌ను క్లియర్ చేసుకుంటే సులువుగా బయటపడచ్చు. ప్రతి ఒక్కరిలోనూ సాధారణ ఆందోళనలు ఉంటాయి. కానీ, కొంతమంది మాత్రం ప్రతి చిన్న విషయానికీ ఆందోళన పడిపోతుంటారు. ఇది కొన్నిరోజులకు పెద్ద ఆందోళనగా వరుతుంటుంది. ఆందోళన తగ్గించుకోవడానికి పిల్స్ వాడకం బదులు, దానిని అధిగమించేలా మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాలి. శరీరం కెమికల్ మీద ఎంతవరకు డిపెండ్ అయిందో గుర్తించి దానిని బ్రేక్ చేస్తాం. మైండ్‌ను రిలాక్స్‌గా ఉంచే యోగా, ధ్యానంతోపాటు సరైన పోషకాహారం మీదా దృష్టి పెట్టాలి. శరీరం బయట నుంచి తీసుకునే కెమికల్ కాకుండా సహజసిద్ధంగా మార్పులకు లోనయ్యేలా అలవాటు చేసుకున్నప్పుడు ఇంటర్నల్ సిస్టమ్ రీ యాక్టివేట్ అవుతుంది. – డాక్టర్ గిడియన్, డి–అడిక్షన్ థెరపిస్ట్ లివింగ్ సోబర్, హైదరాబాద్ (చదవండి: కీళ్లనొప్పులా?.. ఈ ఆహారం తీసుకోండి!) -
టీసీ ఇవ్వలేదని నిద్రమాత్రలు మింగిన విద్యార్థిని
సాక్షి, హైదరాబాద్: విద్యార్ధుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామరంగారెడ్డి, చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహగుప్తా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చైతన్యపురి డివిజన్ మున్సిపల్ కాలనీలోని శకుంతల ఉన్నత పాఠశాల యాజమాన్యం కారణంగా నిద్రమాత్రలు మింగి ఓ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలుసుకున్న కార్పొరేటర్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాఠశాల వద్దకు చేరుకున్నారు. కరోనా కారణంగా ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాలలో చేరిన ఏడో తరగతి విద్యార్థిణి తల్లి టీసీ కావాలని పాఠశాల యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినా ఫీజు మొత్తం బకాయి కడితేనే టీసీ ఇస్తామని ఇబ్బందికి గురి చేయటంతో విద్యార్థిని తల్లిదండ్రులు, కాలనీలోని పిల్లల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. బాధితులకు న్యాయం చేసేవరకు ఉద్యమిస్తామని సామ రంగా రెడ్డి స్పష్టం చేశారు. మండల విద్యా శాఖ అధికారులు వెంటనే స్పందించి పాఠశాల అక్రమాలను బయటపెట్టి సీల్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపి జిల్లా ఉపాధ్యక్షుడు రుద్రారపు శంకర్, డివిజన్ అధ్యక్షుడు వినోద్‌యాదవ్ స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు. చదవండి: ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం.. -
అయ్యో ధరణి.. ఎంతపని చేశావమ్మా..
దుగ్గిరెడ్డిపాలెం(మర్రిపూడి)/ప్రకాశం జిల్లా: పరీక్షలు సరిగా రాయలేదని మనస్తాపం చెంది విద్యార్థిని నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని దుగ్గిరెడ్డిపాలెంలో గురువారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముచ్చుమూరి ధరణి (20) కనిగిరిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. చదవండి: మహిళా ప్రొఫెసర్‌కు అశ్లీల వీడియోలు, అసభ్యకర మెసేజ్‌లు.. పరీక్షలు సరిగ్గా రాయలేదని మనస్తాపం చెందింది. బుధవారం రాత్రి నిద్రమాత్రలు మింగింది. విషయం తెలుసుకున్న బంధువులు ఆమెను వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ అంకమ్మరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. మృతదేహాన్ని పొస్టుమార్టం కోసం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆస్తి కోసం.. బిర్యానిలో నిద్రమాత్రలు కలిపి
జమ్మలమడుగు రూరల్: మానవ సంబంధాలు రోజురోజుకు మంట గలుస్తున్నాయి. ఆస్తి కోసం మమతానురాగాలను మరిచి మానవ మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ వాటాకు వస్తాడోనని కిరాతకానికి ఒడిగట్టాడు మేనమామ. తన బావ మొదటి భార్య కుమారుడుని అంతమొందించాలని కుట్ర పన్నాడు. అతన్ని అడ్డు తొలగిస్తే యావదాస్తికి తన అక్క కుమారుడే వారసుడని భావించాడు. బిరియాని ప్యాకెట్టులో నిద్రమాత్రలు కలిపి హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. ఈ సంఘటన బుధవారం దేవగుడిలో చొటు చేసుకొంది. పట్టణ సీఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. జమ్మలమడుగు మండలం దేవగుడికి చెందిన సైలాస్‌కు 15 ఏళ్ల కిందట కనకమ్మతో వివాహం జరిగింది. వీరికి అఖిల్ అనే కుమారుడు జన్మించాడు. కొన్నేళ్ల తర్వాత కనకమ్మ మృతి చెందింది. సైలాస్ పుష్పలత అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మొదటి భార్య కుమారుడు అఖిల్ జమ్మలమడుగు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు. సైలాస్‌కు రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఆస్తిలో అఖిల్ వాటాకు వస్తాడని పుష్పలత తమ్ముడు రమేష్ దుర్బుద్ధితో ఆలోచించాడు. ఎలాగైనా అతన్ని అంతమొందించాలనుకున్నాడు. బుధవారం పట్టణానికి వచ్చి బిరియాని పాకెట్టు కొనుగోలు చేశాడు. అందులో కొన్ని నిద్రమాత్రలు వేసి మరో వ్యక్తి చేతికి ఇచ్చాడు. ‘మీ తండ్రి పంపించాడని అఖిల్‌కు ఇవ్వమని’చెప్పాడు. అఖిల్ తన స్నేహితులతో కలిసి బిరియాని తిన్నారు. కాసేపైన తర్వాత ముగ్గురు కుప్పకూలిపోయారు. గ్రహించిన అధ్యాపకులు, విద్యార్థులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ తెలియజేశారు. -
నాలుగేళ్ల ప్రేమ, పెళ్లి.. ఇప్పుడు కులం చిచ్చు!
ఇల్లందకుంట(హుజూరాబాద్): ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఇతరుల మాటలు విని కాపురానికి తీసుకెళ్లక పోవడం, అత్తింటివారు కులం పేరుతో దూషించడంతో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లికి చెందిన చిట్యాల సంధ్యకు కేశవపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన అన్నె సంతోష్‌తో నాలుగేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. వేర్వేరు కులాలు కావడంతో 2020 మార్చి 16న ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం ఇప్పలపల్లికి వెళ్లారు. దాదాపు 10 నెలలు సజావుగా సాగిన వీరి కాపురంలో కులం చిచ్చు రగిలింది. సంతోష్ తండ్రి సమ్మయ్య, వారి బంధువులు గుంటి తిరుపతి, కొండయ్యలు కులం పేరుతో సంధ్యను దూషించడం మొదలుపెట్టారు. దీనికితోడు సంతోష్ సంధ్యను పట్టించుకోవడం మానేశాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. సంతోష్ తనను కాపురానికి తీసుకెళ్లడం లేదని సంధ్య ఇల్లందకుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సోమవారం ఇల్లందకుంటలో పంచాయితీ చేసుకుందామని చెప్పిన సంతోష్ కుటుంబీకులు అక్కడికి రాకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. దీంతో ఠాణాకు కొద్ది దూరంలో వారు పెళ్లి చేసుకున్న ఆలయం ఎదుటే నిద్రమాత్రలు మింగింది. కుటుంబసభ్యులు జమ్మికుంటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు. హుజూ రాబాద్ ఫస్ట్ క్లాస్ అడిషనల్ జడ్జి స్వాతిభవాని సంధ్య నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. చదవండి: నా కూతుర్నే ప్రేమిస్తావా.. యువకుడిపై దారుణం -
ఆస్తి కోసం డిగ్రీ విద్యార్థినికి వేధింపులు
చీరాల: ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులు పెడుతున్న వేధింపులు తాళలేక డిగ్రీ చదువుతున్న విద్యార్థిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చుట్టుపక్కల వారు గమనించి 108లో చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుని వైద్య సేవలు పొందుతోంది. వివరాలు.. మండలంలోని రామకృష్ణాపురం గ్రామ పంచాయతీకి చెందిన గుర్రం డైసీ చీరాల పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు చిన్న తనంలో చనిపోవడంతో తాతయ్య జార్జి, నాయనమ్మల వద్ద నివాసం ఉంటోంది. డిగ్రీ చదువుతున్న డైసీ బొడ్డురాయి ప్రాంతానికి చెందిన పవన్ అనే యువకుడిని ప్రేమిస్తోందని బంధువులకు తెలిసింది. ఉమ్మడి ఆస్తి డైసీ ప్రేమిస్తున్న పవన్ అనే యువకుడికి వెళ్తుందన్న అక్కసుతో నెల నుంచి బంధువులు తనను మానసికంగా వేధిస్తున్నారని బాధితురాలు చెబుతోంది. ఆస్తి వారికి చెందేలా సంతకాలు చేయాలని తాతయ్య జార్జి, పెద్దమ్మ సంతోషం, పెదనాన్న, ఇతర కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెడుతుండటంతో వాటిని భరించలేక నిద్రమాత్రలు మింగినట్లు ఆమె ఔట్ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధిక మొత్తంలో నిద్రమాత్రలు మింగిన బాధితురాలిని 108లో చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా ఔట్‌పోస్టు పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. -
నిద్రమాత్రలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
నాగోలు: అనుమతి లేకుండా నిద్ర మాత్రలు విక్రయిస్తున్న వ్యక్తిని రంగారెడ్డి జోన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం అరెస్టు చేసి అతడి నుంచి 358ట్యాబ్లెట్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జోన్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి సమీపంలో చక్రవర్తుల వెంకటాచారి అనే వ్యక్తి నిట్రాజెపం ట్యాబ్లెట్లను విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించిన పోలీసులు నిందితుడు వెంకటాచారిని అరెస్టు చేసి అతడి నుంచి భారీగా నిద్రమాత్రలు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐ కల్పన, కుమారయ్య, సిబ్బంది కృష్ణ, రవికుమార్, శ్రీశైలం, శంకర్ పాల్గొన్నారు. -
బెదిరించిన మాజీ ప్రియున్ని నమ్మించి..
సాక్షి, న్యూఢిల్లీ : తన నగ్న ఫొటోలు ఇంటర్నెట్లో పెడతానని బెదిరింపులకు దిగిన మాజీ ప్రియుడిని ఓ యువతి కిరాతకంగా హతమార్చింది. కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ప్రాణాలు తీసింది. అనంతరం మరో యువకుడి సాయంతో మృతదేహాన్ని యమునా నదిలో విసిరేసింది. ఈ ఘటనలో యువతికి సహాయం చేసింది ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఈ ఘటన మూడు వారాల క్రితం జరిగింది. వివరాలు.. సుశీల్ కుమార్ (23), డాలీ చౌదరీ (20) కొంతకాలం కలిసి ఉండి విడిపోయారు. అనంతరం తనకు నొయిడాలో ఉద్యోగం ఇప్పించిన మోహిత్ మావితో డాలీ స్నేహం చేసింది. ఈ విషయం తెలుసుకున్న సుశీల్ డాలీపై బెదిరింపులకు దిగాడు. మళ్లీ తనతో కలిసి ఉండాలనీ, లేదంటే తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు దిగిన ప్రయివేటు ఫొటోలను ఇంటర్నెట్లో పెట్టి పరువు తీస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. మాజీ ప్రియుడి వ్యవహారంతో ఆందోళనకు గురైన డాలీ అతన్ని అంతమొందించాలని భావించింది. తను పెళ్లిచేసుకోబోతున్న మనీష్ చౌదరీతో పథకం రచించింది. ఓ హోటల్లో ఆగస్టు 11న డాలీ సుశీల్ కలుసుకున్నారు. అక్కడ ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించిన డాలీ సుశీల్‌ను నమ్మించింది. నిద్రమాత్రలు కలిపిన కూల్‌డ్రింక్‌ని అతడి చేత తాగించింది. మనీష్ ప్రాణాలు విడిచిన అనంతరం మృతదేహాన్ని కాబోయే భర్త మనీష్‌తో కలిసి యమునా నదిలో పడేసింది. బయటపడిందిలా..! తన కొడుకు కనిపించడం లేదని సుశీల్ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సుశీల్ తన ప్రేయసి చేతిలో హత్యకు గురయ్యాడని కనుగొన్నారు. కాగా, నిందితులు డాలీ, మనీష్‌లను అరెస్టు చేశామని మథుర డీసీపీ మనుదీప్‌సింగ్ రంధ్వా తెలిపారు. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి..! -
నిద్ర మాత్రలతో అల్జీమర్స్ ముప్పు
లండన్ : నిద్ర మాత్రలను నిర్ధిష్ట కాలానికి మించి వాడితే అల్జీమర్స్ ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. నిద్ర మాత్రలను అదేపనిగా వాడేవారిలో మతిమరుపు లక్షణాలను గుర్తించినట్టు పరిశోధకులు వెల్లడించారు. వైద్యులు సూచించిన కాలానికి మించి అధిక మోతాదుతో కూడిన నిద్ర మాత్రలను తీసుకునేవారిలో అల్జీమర్స్ ముప్పు అధికంగా ఉందని తమ అథ్యయనంలో వెల్లడైందని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ర్టన్ ఫిన్లాండ్ స్పష్టంచేసింది. బెంజోస్, జడ్ డ్రగ్స్ తీసుకునేవారిలో అల్జీమర్స్ ముప్పును గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు. ఈ మందులను నాలుగు వారాల మించి తీసుకోరాదని వారు చెబుతున్నారు. యాంగ్జైటీ, నిద్రలేమిని నివారించేందుకు డాక్టర్స్ బెంజోస్ డ్రగ్‌ను సిఫార్సు చేస్తారు. అథ్యయనంలో భాగంగా దీర్ఘకాలంగా బెంజోస్, జడ్ డ్రగ్స్ తీసుకునేవారిలో 3,53,000 మందికి అల్జీమర్స్ ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. మరికొందరు తమకు 2005-2011 మధ్య కాలంలోనే డిమెన్షియా వ్యాధి ఉందని వెల్లడించారు. -
భార్యను కడతేర్చేందుకే..
సూర్యాపేట క్రైం : భార్యను అడ్డుతొలగించుకోవాలని.. ఓ భర్త ఆమె తాగేనీటిలో నిద్రమాత్రలు కలిపి ఆమెకు ఇచ్చాడు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. బాధితురాలు అల్లి అనూష తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన మట్టపల్లి సత్యనారాయణ– మాధవి దంపతులకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అనూషను పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన మాధవి సొంత సోదరుడు అల్లి వరప్రసాద్ కుమారుడు సాయిశివకు ఇచ్చి గతేడాది ఏప్రిల్‌లో వివాహం చేశారు. పెళ్లి జరిగిన నాటి నుంచి భర్త సాయిశివ అనుషతో కాపురం చేయకుండా అనుమానంతో వేధించసాగాడు. కొద్దిరోజుల నుంచి సైకోలాగా మారి భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. తమ కొడుకు చేష్టలు అత్త కౌసల్య, వదినలు శ్వేత, శృతికి చెప్పినా పట్టించుకోలేదు. పైగా అనూషపైనే ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో గురువారం సాయిశివ ఆవేశం తారస్థాయికి చేరుకుని భార్యపై బ్లేడు దాడిచేసి గాయపరిచాడు. అప్పటికీ సంతృప్తి చెందని సాయిశివ శుక్రవారం రాత్రి ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకుని తాగేనీళ్లలో నిద్రమాత్రలను పొడి చేసి కలిపి అనూషతో తాగించాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన అనూష తల్లిదండ్రుల సాయంతో స్థానిక ఏరియాస్పత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు అనూష నుంచి ఫిర్యాదు స్వీకరించారు. పట్టణ ఎస్ఐ పి.శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోజూ ప్యాకెట్ సిగరెట్ల కన్నా అది డేంజర్..!
లండన్: మారుతున్న జీవనశైలి ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది. బ్రిటన్‌లో ప్రతి 10 మందిలో ఒకరు ఈ నిద్రలేమి(ఇన్సోమ్నియా) మూలంగా నిద్రమాత్రల(స్లీపింగ్ పిల్స్)ను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇది ఎంతమాత్రం సరైన విధానం కాదని, రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్లు కాల్చడం కన్నా నిద్రమాత్రలు ప్రమాదకరమని పరిశోధకులు తేల్చారు. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు నిద్రమాత్రలు కలగజేసే దుష్ఫలితాలపై నిర్వహించిన పరిశోధనలో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. నిద్రమాత్రలతో క్యాన్సర్‌తో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతుందని పరిశోధకుడు షాన్ యంగ్‌స్టెడ్ వెల్లడించారు. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో ఇటీవల డైజిఫామ్ లాంటి నిద్రమాత్రల వాడకం కొంత తగ్గినప్పటికీ.. కొత్తగా వచ్చిన 'జెడ్-డ్రగ్స్' వాడకం పెరిగిందని వెల్లడించారు. అయితే.. ఇవి కూడా హార్ట్ ఎటాక్ అవకాశాన్ని 50 శాతం పెంచుతున్నాయని తెలిపారు. నిద్రమాత్రలను ఆశ్రయించడం కంటే వ్యాయామం చేయడం ద్వారా సహజనిద్ర లభిస్తుందని షాన్ వెల్లడించారు. -
నిద్రమాత్రలు మింగి టీచర్ ఆత్మహత్యాయత్నం
కర్నూలు: ఓ టీచర్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న లక్ష్మీగా పోలీసులు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎంపీ కునాల్ ఆత్మహత్యాయత్నం
కోల్‌కతా సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న తృణమూల్ బహిష్కృత నేత నిద్ర మాత్రలు మింగడంతో ఆస్పత్రిలో చేర్పించిన అధికారులు శారదా స్కామ్ కేసులో సంచలన పరిణామం కోల్‌కతా: శారదా చిట్‌ఫండ్స్ స్కామ్ దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ కునాల్ ఘోష్ కోల్‌కతాలోని కేంద్ర కారాగారంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. గతేడాది నవంబర్ 23న సీబీఐ ఘోష్‌ను అరెస్ట్ చేయగా, అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. నిద్ర మాత్రలు మింగినట్లు ఘోష్ వెల్లడించగా ఆయన్ను ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలో చేర్పించామని పశ్చిమబెంగాల్ రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి హెచ్ఏ సాఫ్వి తెలిపారు. ఘోష్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆస్పత్రి డెరైక్టర్ ప్రదీప్ మిత్ర ప్రకటించారు. ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో ఆయన మగత స్థితిలో ఉన్నట్లు తెలిపారు. తాను 40 నిద్ర మాత్రలు మింగినట్లు చెప్పారని వెల్లడించారు. సీసీయూ విభాగంలో చేర్చిన అనంతరం ఘోష్ కడుపు భాగాన్ని శుభ్రం చేసి, నమూనాలను పరీక్షల కోసం పంపామని వివరించారు. ముందుగా హెచ్చరించి మరీ... శారదా చిట్స్ స్కామ్ కేసు విచారణలో భాగంగా ఘోష్‌ను ఈ నెల 10న ఇక్కడి ఓ కోర్టులో హాజరు పరిచిన సందర్భంలో... ఈ కేసులో అసలు నిందితులు బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే తాను జైల్లో ఉన్నానని, నిందితులపై సీబీఐ మూడు రోజుల్లోపు తగిన చర్య తీసుకోకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఘోష్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అరవింద్ మిశ్రా ముందు చెప్పినట్లు ఓ జైలు అధికారి వెల్లడించారు. ఈ హెచ్చరిక నేపథ్యంలో గత రెండు రోజుల నుంచి ఘోష్‌పై మరింత నిఘా పెట్టామని, గురువారం రాత్రి నిద్రించే ముందు కూడా అతన్ని పూర్తిగా తనిఖీ చేశామని, ఎలాంటి నిద్రమాత్రలు లభించలేదని జైలు అధికారి తెలిపారు. అయితే, శుక్రవారం వేకువజామున 2.30 గంటల సమయంలో శ్వాస ఆడటం కష్టంగా ఉందని, తాను నిద్రమాత్రలు మింగానని ఘోష్ చెప్పగా... వెంటనే వైద్యులను పిలిపించామని, వారు ఘోష్‌ను పరిశీలించి అంతా సాధారణంగానే ఉందని చెప్పినట్లు ఆ అధికారి వివరించారు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఆయన్ను ఎస్ఎస్కేఎం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఆత్మహత్నాయత్నం చేసిన ఘోష్‌పై జైలు అధికారుల ఫిర్యాదు మేరకు హాస్టింగ్ స్టేషన్ పోలీసులు సెక్షన్ 309 కింద కేసు నమోదు చేశారు. స్వతహాగా జర్నలిస్టు అయిన ఘోష్ గతంలో శారదా గ్రూపు కంపెనీ ‘బెంగాల్ మీడియా’కు సీఈఓగా వ్యవహరించారు. ఇన్వెస్టర్లకు భారీ లాభాల ఆశ చూపించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన శారదా చిట్స్ స్కామ్ కేసులో ఘోష్‌కు కూడా పాత్ర ఉందని పేర్కొంటూ సీబీఐ గతేడాది ఆయన్ను అరెస్ట్ చేసింది. శారదా స్కామ్‌లో పలువురు తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేతల ప్రమేయం ఉందని ఘోష్ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. జైలు అధికారులపై చర్య: ఈ సంచలన పరిణామంతో, కోల్‌కతాలోని కేంద్ర కారాగారం సూపరింటెండెంట్, ఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది, జైలు డాక్టర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం మమతా బెనర్జీ శాసనసభలో ప్రకటించారు. విచారణకు రాష్ట్ర హోం కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీని వేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఘోష్ ఆత్మహత్యాయత్నాన్ని బీజేపీ రాజకీయ కుట్రగా అభివర్ణించింది. ఈ కేసులో ఆధారాలను అణగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతోందని ఆరోపించింది. -
ఉపాధ్యాయురాలినంటూ బురిడీ
బడా బాబులకు వల కాఫీ, కూల్ డ్రింకుల్లో నిద్రమాత్రలు వేసి నిలువు దోపిడీ ‘అనంత’ వ్యాపారి ఫిర్యాదుతో లేడీ కిలాడి అరెస్ట్ పరప్పన అగ్రహార జైలులో ఊచలు లెక్కిస్తున్న శివమొగ్గ యువతి బెంగళూరు : ఉపాధ్యాయురాలినంటూ మాయ మాటలు చెప్పి పలువురిని మోసగిస్తున్న యువతిని ఇక్కడి ఉప్పరపేట పోలీసులు అరెస్టు చేశారు. శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన రేణుకా అలియాస్ రేణు ఆలియాస్ రంజని (30)ని అరెస్టు చేశామని శనివారం ఉప్పరపేట పోలీసులు చెప్పారు. ఈమె నుంచి రూ. 2.30 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని, నిందితురాలిని పరప్పన అగ్రహార జైలుకు తరలించామని శనివారం పోలీసు లు తెలిపారు. టీచర్నంటూ బిల్డప్ ... : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తిని రేణుకా వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. చుట్టుపక్కల వారితో తాను టీచర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకునేది. ఉద యం అందంగా తయారై బయటకు వచ్చేది. అదే సమయంలో బాగా డబ్బున్న వ్యక్తులకు వలవేసేది. వారిని లాడ్జిలకు తీసుకెళ్లి అనంతరం వారి దృష్టి మరల్చి కాఫీ, కూల్ డ్రింకుల్లో నిద్రమాత్రలు వేసి వారు నిద్రలోకి జారుకున్న అనంతరం వారి వద్ద ఉన్న నగలు, నగదుతో అక్కడి నుంచి జారుకునేది. భార్య అసలు విషయం తెలుసుకున్న భర్త ఆమెను విడిచి పెట్టి దూరంగా ఉంటున్నాడు. అనంత వ్యాపారి ఫిర్యాదుతో ఊచలు : కొన్ని నెలల క్రితం రేణుకా ఆంధ్రప్రదేశ్‌లోని ఒక దేవాలయానికి వెళ్లింది. అదే సమయంలో అనంతపురంకు చెందిన సంజీవ రెడ్డి అనే వ్యాపారి ఈమెకు పరిచయమయ్యాడు. ఇద్దరు తరచూ మొబైళ్లలో మాట్లాడుకునేవారు. ఈనెల 4న సంజీవ రెడ్డి వ్యాపారం నిమిత్తం స్నేహితులతో కలిసి బెంగళూరు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న రేణుక టీచర్స్ డే సందర్భంగా తాను బెంగళూరు వస్తున్నానని లాడ్జిలో రూం ఏర్పాటు చేయాలని కోరింది. దీంతో సంజీవరెడ్డి ఇక్కడి కాటన్‌పేటలో ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. ఐదో తారీఖున రేణుక లాడ్జికి వచ్చింది. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్న అనంతరం కాఫీ ఆర్డర్ ఇచ్చారు. ఇదే సమయంలో సంజీవరెడ్డి బాత్రూంకు వెళ్లాడు. అదునుకోసం వేచి చూస్తున్న రేణుక కాఫీలో నిద్రమాత్రలు వేసింది. అనంతరం బయటకు వచ్చిన సంజీవరెడ్డి కాఫీ తాగాడు. కొద్దిసేపటికే అతను నిద్రలోకి జారకున్నాడు. క్షణాల్లో అతని వద్ద ఉన్న బంగారు గొలుసు, రెండు ఉంగరాలు, మొబైల్, నగదు తీసుకుని రేణుక అక్కడి నుంచి ఉడాయించింది. రాత్రి పొద్దుపోయిన తరువాత నిద్రలేచిన సంజీవరెడ్డి విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాలుగు రోజుల క్రితం ఇక్కడి ఓ లాడ్జిలో ఇదే తరహాలో దోపిడీ జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు లాడ్జిల్లోని సీసీ కెమెరాల ఫుటేజీల పరిశీలించి, బాధితుడి ఫోన్ నెంబర్ ఆధారంగా రేణుకను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కిలాడీ లేడీ పరప్పన అగ్రహార జైలులో ఊచలు లెక్కబెడుతోంది. -
విజయలక్ష్మి నిద్రలోనే చనిపోయారు
నిద్ర మాత్రలు మింగి మృతి.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి హైదరాబాద్, న్యూస్‌లైన్: తండ్రిలేని లోకంలో జీవించలేనంటూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్న నిమ్స్ కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ శేషగిరిరావు భార్య డి.విజయలక్ష్మి నిద్రలోనే చనిపోయినట్లు శవపరీక్షలో వెల్లడైంది. ఆ నివేదికను ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు గురువారం వెల్లడించారు. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని తేల్చారు. గత నెల 28వ తేదీన సుమారు 20 నిద్ర మాత్రలు మింగిన విజయలక్ష్మి.. తమ నివాసం స్టోర్ రూంలో లోపలి నుంచి గడియ వేసుకొని పడుకున్నారు. రెండు రోజుల అనంతరం నిద్రలోనే ఆమె ప్రాణాలు పోయాయని వైద్య పరీక్షల్లో తేలింది. ఆమె కడుపులో తెల్లని పదార్థాన్ని గుర్తించిన వైద్యులు అది నిద్రమాత్రలదేనని స్పష్టం చేశారు. గత నెల 30వ తేదీన ఆమె మరణించి ఉంటుందని భావిస్తున్నారు.