లండన్ : నిద్ర మాత్రలను నిర్ధిష్ట కాలానికి మించి వాడితే అల్జీమర్స్ ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. నిద్ర మాత్రలను అదేపనిగా వాడేవారిలో మతిమరుపు లక్షణాలను గుర్తించినట్టు పరిశోధకులు వెల్లడించారు. వైద్యులు సూచించిన కాలానికి మించి అధిక మోతాదుతో కూడిన నిద్ర మాత్రలను తీసుకునేవారిలో అల్జీమర్స్ ముప్పు అధికంగా ఉందని తమ అథ్యయనంలో వెల్లడైందని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ర్టన్ ఫిన్‌లాండ్ స్పష్టంచేసింది. బెంజోస్, జడ్ డ్రగ్స్ తీసుకునేవారిలో అల్జీమర్స్ ముప్పును గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు.
ఈ మందులను నాలుగు వారాల మించి తీసుకోరాదని వారు చెబుతున్నారు. యాంగ్జైటీ, నిద్రలేమిని నివారించేందుకు డాక్టర్స్ బెంజోస్ డ్రగ్‌ను సిఫార్సు చేస్తారు. అథ్యయనంలో భాగంగా దీర్ఘకాలంగా బెంజోస్, జడ్ డ్రగ్స్ తీసుకునేవారిలో 3,53,000 మందికి అల్జీమర్స్ ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. మరికొందరు తమకు 2005-2011 మధ్య కాలంలోనే డిమెన్షియా వ్యాధి ఉందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment