బెదిరించిన మాజీ ప్రియున్ని నమ్మించి.. | Delhi Woman Murdered Ex Boyfriend After He Blackmailing Her | Sakshi
Sakshi News home page

Sep 2 2018 12:59 PM | Updated on Sep 2 2018 12:59 PM

Delhi Woman Murdered Ex Boyfriend After He Blackmailing Her - Sakshi

నిందితులు మనీష్‌, డాలీ

అనంతరం తనకు నొయిడాలో ఉద్యోగం ఇప్పించిన మోహిత్‌ మావితో డాలీ స్నేహం చేసింది. ఈ విషయం తెలుసుకున్న సుశీల్‌ డాలీపై..

సాక్షి, న్యూఢిల్లీ : తన నగ్న ఫొటోలు ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరింపులకు దిగిన మాజీ ప్రియుడిని ఓ యువతి కిరాతకంగా హతమార్చింది. కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ప్రాణాలు తీసింది. అనంతరం మరో యువకుడి సాయంతో మృతదేహాన్ని యమునా నదిలో విసిరేసింది. ఈ ఘటనలో యువతికి సహాయం చేసింది ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఈ ఘటన మూడు వారాల క్రితం జరిగింది.

వివరాలు.. సుశీల్‌ కుమార్‌ (23), డాలీ చౌదరీ (20) కొంతకాలం కలిసి ఉండి విడిపోయారు. అనంతరం తనకు నొయిడాలో ఉద్యోగం ఇప్పించిన మోహిత్‌ మావితో డాలీ స్నేహం చేసింది. ఈ విషయం తెలుసుకున్న సుశీల్‌ డాలీపై బెదిరింపులకు దిగాడు. మళ్లీ తనతో కలిసి ఉండాలనీ, లేదంటే తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు దిగిన ప్రయివేటు ఫొటోలను ఇంటర్నెట్‌లో పెట్టి పరువు తీస్తానని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. 

మాజీ ప్రియుడి వ్యవహారంతో ఆందోళనకు గురైన డాలీ అతన్ని అంతమొందించాలని భావించింది. తను పెళ్లిచేసుకోబోతున్న మనీష్‌ చౌదరీతో  పథకం రచించింది. ఓ హోటల్‌లో ఆగస్టు 11న డాలీ సుశీల్‌ కలుసుకున్నారు. అక్కడ ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించిన డాలీ సుశీల్‌ను నమ్మించింది. నిద్రమాత్రలు కలిపిన కూల్‌డ్రింక్‌ని అతడి చేత తాగించింది. మనీష్‌ ప్రాణాలు విడిచిన అనంతరం మృతదేహాన్ని కాబోయే భర్త మనీష్‌తో కలిసి యమునా నదిలో పడేసింది. 

బయటపడిందిలా..!
తన కొడుకు కనిపించడం లేదని సుశీల్‌ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సుశీల్‌ తన ప్రేయసి చేతిలో హత్యకు గురయ్యాడని కనుగొన్నారు. కాగా, నిందితులు డాలీ, మనీష్‌లను అరెస్టు చేశామని మథుర డీసీపీ మనుదీప్‌సింగ్‌ రంధ్వా తెలిపారు.

మరిన్ని వార్తలకు క్లిక్‌ చేయండి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement