
పోలీసుల అదుపులో నిందితుడు
నాగోలు: అనుమతి లేకుండా నిద్ర మాత్రలు విక్రయిస్తున్న వ్యక్తిని రంగారెడ్డి జోన్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం అరెస్టు చేసి అతడి నుంచి 358ట్యాబ్లెట్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జోన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్‌బీనగర్ కామినేని ఆస్పత్రి సమీపంలో చక్రవర్తుల వెంకటాచారి అనే వ్యక్తి నిట్రాజెపం ట్యాబ్లెట్లను విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించిన పోలీసులు నిందితుడు వెంకటాచారిని అరెస్టు చేసి అతడి నుంచి భారీగా నిద్రమాత్రలు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఎక్సైజ్ ఎస్‌ఐ కల్పన, కుమారయ్య, సిబ్బంది కృష్ణ, రవికుమార్, శ్రీశైలం, శంకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment