ఓ టీచర్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది.
కర్నూలు: ఓ టీచర్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న లక్ష్మీగా పోలీసులు తెలిపారు.
ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.