teacher suicide
-
భర్త వేధింపులు తాళలేక టీచర్ ఆత్మహత్య
ఆత్రేయపురం: మండల పరిధిలోని ర్యాలి గ్రామంలో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆలమూరు ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన సుంకర నాగ వెంకటలక్ష్మి (36) ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు ఆమె సోదరుడు సుంకర కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అక్క ఆలమూరు ప్రభుత్వ బాలికల పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోందని, భర్త రమేష్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతురాలి భర్త ఫార్మా కంపెనీలో ఏరియా మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై బీవై కిరణ్‌కుమార్ పరిశీలించి గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
సతాయిస్తున్నాడు.. అందుకే చనిపోతున్నా!
కర్నూలు, వెల్దుర్తి: ‘నా భర్త వై.సుధాకర్ చిన్న మల్కాపురంలో టీచర్‌గా పని చేస్తున్నాడు. ప్రతిరోజూ తాగొచ్చి నన్ను, పిల్లల్ని సతాయిస్తున్నాడు. అందువల్లే నేను సూసైడ్ చేసుకుంటున్నా. దయచేసి.. నా ముగ్గురు ఆడపిల్లల్ని వాడి చేతికి అప్పజెప్పొద్దు’ అంటూ టీచర్ పి.నాగమల్లీశ్వరీబాయి(40) సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్యాపిలి మండలం నేరేడుచెర్లకు చెందిన నాగమల్లీశ్వరీ బాయి, కల్లూరు మండలం బొల్లవరానికి చెందిన ఎరుకలి సుధాకర్ తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. సుధాకర్‌కు ఇది రెండో వివాహం. వృత్తిరీత్యా ఇద్దరూ ఉపాధ్యాయులే. సుధాకర్ డోన్ మండలం చిన్న మల్కాపురంలో ఎస్జీటీగా, ఆమె వెల్దుర్తి మండలం బోయనపల్లెలో హిందీ టీచర్‌గా పనిచేస్తున్నారు. విషాదంలో మల్లీశ్వరీబాయి కుమార్తెలు వీరికి 4వ తరగతి చదువుతున్న జ్యోత్స్న, యూకేజీ, ఎల్కేజీ చదువుతున్న జీవన సుధ, చైత అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెళ్లి చేసుకున్న నాటి నుంచే తన భర్త తాగొచ్చి వేధింపులకు గురిచేసేవారని నాగమల్లీశ్వరి పలుమార్లు పోలీసులను ఆశ్రయించారు. అలాగే పెద్దల పంచాయితీలు కూడా జరిగిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఈ నెల 19న శుక్రవారం బోయనపల్లెలోని నివాస గృహంలో సెల్ఫీ వీడియో తీసుకుని కేశాలంకరణకు ఉపయోగించే సూపర్ వాస్మోల్ ద్రావకాన్ని తాగారు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా.. కోలుకోలేక ఈ నెల 21న ఆమె చనిపోయారు. అంత్యక్రియలు మంగళవారం స్వగ్రామం నేరేడుచెర్లలో ముగిశాయి. మల్లీశ్వరీ బాయి తమ్ముడు రమేశ్ ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు సుధాకర్‌పై కేసు నమోదు చేశారు. అలాగే అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుసమాచారం. -
ఎన్నికల విధులకు వచ్చిన ఉపాధ్యాయుడు ఆత్మహత్య
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: ఎన్నికల విధులకు వచ్చిన ఒక ఉపాధ్యాయుడు పట్టణంలోని ఓ లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి ఏఎస్సై ఎస్వీపీకేహెచ్ భూపతిదేవ్ తెలిపిన వివరాలు ప్రకారం పట్టణంలో బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో పొట్నూరి భాస్కరరావు (38) ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. భాస్కరరావు నరసాపురంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని, ఈ నెల 11న పోలవరం నియోజకవర్గంలో ఎన్నికల విధులకు వచ్చినట్లు తెలిపారు. విధులు ముగిసిన అనంతరం 11వ తేదీ రాత్రి పట్టణంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకుని నిద్రించినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం లాడ్జి సిబ్బంది పరిశీలించే సరికి భాస్కరరావు ఫ్యానుకు ఉరివేసుకుని మృతిచెందినట్లు తెలిపారు. ఈ మేరకు లాడ్జి యజమాని రావూరి సూరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై చెప్పారు. మృతుడి భార్య, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు ఏఎస్సై తెలిపారు. కాగా భాస్కరరావు మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు చెప్పారు. -
పండగకు పుట్టింటికి వెళ్లివచ్చి..
నల్లగొండ (మునుగోడు) : ఉరేసుకుని ఉపాధ్యాయురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండకు చెందిన తేజస్విని(33), నాగార్జునసాగర్‌కు చెందిన సునీల్ ఏడు సంవత్సరాల క్రితం ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారు. తేజస్విని మండల కేంద్రంలోని ఆదర్శపాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా సునీల్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరు సంస్థాన్ నారాయణపురంలోనే అద్దెకుంటున్నారు. వీరికి అద్విత అని నాలుగున్నర ఏళ్ల పాప ఉంది. అయితే తేజస్విని ఆనారోగ్యంతో బాధపడుతోందని, దంపతుల మధ్య సఖ్యత లేదని ఆరోపణలు ఉన్నాయి. పండగకు పుట్టింటికి వెళ్లివచ్చి.. దసరా పండుగకు నల్లగొండకు వెళ్లిన వారు శుక్రవారం సంస్థాన్ నారాయణ పురానికి వచ్చారు. మంగళవారం పాఠశాలకు వెళ్లకుండా తేజస్విని సెలవు పెట్టి ఇంట్లోనే ఉంది. పాపను పాఠశాలకు పంపించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఏమి జరిగిందో తెలియదు కానీ సజ్జ కొక్కేనికి చున్నీతో ఉరి వేసుకుంది. పాపని తీసుకుని వచ్చిన వ్యక్తి పిలిచినా తలుపు తీయకపోయేసరికి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్ఐ మల్లేశ్వరి, ఏఎస్ఐ యాదవరెడ్డి వచ్చి చూడగా అప్పటికే మృతి చెందింది. చౌటుప్పల్ రూరల్ సీఐ పార్థసారథి ఘటన స్థలాన్ని పరిశీలించారు. తేజస్విని భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
నా చావుకు కారణం భార్య ప్రవర్తనే
కడప అర్బన్ : కడప నగరం మరాఠీ వీధిలో నివసిస్తున్న పప్పుశెట్టి శ్రీనివాసులు (34) అనే అధ్యాపకుడు మంగళవారం అర్ధరాత్రి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం స్థానికులు కిటికీలో నుంచి చూడగా శ్రీనివాసులు ఫ్యాన్ కొక్కేనికి వేలాడుతుండటం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని తాలూకా ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డి తమ సిబ్బందితో పరిశీలించారు. ఈ సంఘటనపై మృతుని తమ్ముడు మధుబాబు, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని వివిధ కళాశాలల్లో 10 సంవత్సరాలుగా ఫిజిక్స్ విభాగం అధ్యాపకునిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న పప్పుశెట్టి శ్రీనివాసులుకు, సిద్ధవటంకు చెందిన సరస్వతమ్మ కుమార్తె కామాక్షితో 2011 జూన్ 26న వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య మనస్ఫర్థలు పొడసూపాయి. పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లారు. ఇటీవల తాలూకా పోలీస్ స్టేషన్లో మృతునిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టయి రిమాండ్‌కు కూడా వెళ్లాడు. తర్వాత కొన్ని రోజుల నుంచి మృతుని భార్య, అత్త తరచూ వేధింపులకు గురి చేసేవారు. తమతో రాజీ కావాలంటే అనేక రకాలైన ఆంక్షలను పెట్టారు. దీంతో మానసికంగా తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. భర్తతో విభేదాల నేపథ్యంలో మృతుని భార్య కామాక్షి, తన పిల్లలతో కలిసి తల్లి దగ్గరే ఉంటోంది. మంగళవారం రాత్రి భార్య, అత్తతో ఇతను ఫోన్లో మాట్లాడాడు. తెల్లవారేసరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. కాగా,మృతుని తల్లి జీవనోపాధి కోసం కువైట్‌లో ఉంటోంది. నా చావుకు భార్య, అత్త ప్రవర్తనే కారణం మృతుడు శ్రీనివాసులు సూసైడ్ నోట్లో ‘తన చావుకు భార్య కామాక్షి, అత్త ప్రవర్తనే కారణం’ అంటూ రాసి ఉంది. ఈ నోట్‌ను, సెల్ ఫోన్‌ను ఎస్ఐ సీజ్ చేశారు. మృతుని తమ్ముడు మధుబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కామాక్షి, ఆమె తల్లి సరస్వతమ్మపై ఆత్మహత్య ప్రేరేపణ క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డి తెలిపారు. -
నిద్రమాత్రలు మింగి టీచర్ ఆత్మహత్యాయత్నం
కర్నూలు: ఓ టీచర్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న లక్ష్మీగా పోలీసులు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.