
జంగారెడ్డిగూడెం ఓ లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయుడు పొట్నూరి భాస్కరరావు(38)
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: ఎన్నికల విధులకు వచ్చిన ఒక ఉపాధ్యాయుడు పట్టణంలోని ఓ లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి ఏఎస్సై ఎస్‌వీపీకేహెచ్ భూపతిదేవ్ తెలిపిన వివరాలు ప్రకారం పట్టణంలో బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో పొట్నూరి భాస్కరరావు (38) ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. భాస్కరరావు నరసాపురంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని, ఈ నెల 11న పోలవరం నియోజకవర్గంలో ఎన్నికల విధులకు వచ్చినట్లు తెలిపారు.
విధులు ముగిసిన అనంతరం 11వ తేదీ రాత్రి పట్టణంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకుని నిద్రించినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం లాడ్జి సిబ్బంది పరిశీలించే సరికి భాస్కరరావు ఫ్యానుకు ఉరివేసుకుని మృతిచెందినట్లు తెలిపారు. ఈ మేరకు లాడ్జి యజమాని రావూరి సూరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై చెప్పారు. మృతుడి భార్య, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు ఏఎస్సై తెలిపారు. కాగా భాస్కరరావు మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment