వహెద ఉన్నిస (ఫైల్)
నల్లకుంట(హైదరాబాద్): ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఓ యువతి అదృశ్యమైన ఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రమాదేవి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేట్ ఎల్రక్టీషియన్ సయ్యద్‌అసద్ తన కుటుంబసభ్యులతో కలిసి విద్యానగర్ అంజయ్యనగర్‌లో నివాసం ఉంటున్నాడు. తన పెద్ద కుమార్తె వహెద ఉన్నీస(18) అడిక్‌మెట్ అచ్యుతారెడ్డి మార్గ్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది.
రోజూలాగే ఈనెల 26న ఉదయం 10 గంటల సమయంలో తండ్రి తన బైక్‌పై కుమార్తెను స్కూల్ వద్ద వదిలి వచ్చాడు. సాయంత్రం పొద్దుపోయే వరకు చూసినా.. స్కూల్‌కు వెళ్లిన కుమార్తె ఇంటికి రాలేదు. దీంతో తండ్రి కుమార్తె పనిచేస్తున్న పాఠశాలకు వెళ్లి విచారించగా.. ఆమె ఉదయం 10.15 గంటల సమయంలో పాఠశాల నుంచి వెళ్లిపోయిందని పాఠశాల యాజమాన్యం చెప్పారు. దీంతో ఆయన శుక్రవారం రాత్రి నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో కొత్త కోణం..
Comments
Please login to add a commentAdd a comment