నిద్రపట్టడం లేదు.. ఆందోళనగా ఉంది. మూడ్ బాగోలేదు.. స్ట్రెస్‌గా ఉంది. వీటన్నింటికీ మనవాళ్లు ఎంచుకుంటున్న మార్గం ‘పిల్’. ఒక మోతాదులో టాబ్లెట్ వాడితే సమస్య తగ్గిపోతుంది కదా! అనుకుంటారు. ఇది చెడు అలవాటు కాదనుకుంటారు. కానీ, ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు టాబ్లెట్ వేసుకోవడం కూడా వ్యసనమే.
నేటి రోజుల్లో చాలామంది వర్క్ టెన్షన్ అనో, స్ట్రెస్ అవుతున్నామనో స్లీపింగ్ పిల్స్‌కు అలవాటు పడిపోయేవారు పెరుగుతున్నారు. వీటిని ముందుగా డాక్టర్ని కలిసి వారి సలహాతో తీసుకోవడం మొదలుపెడతారు. ఆ టాబ్లెట్ వేసుకున్న కొన్ని రోజులు బాగా అనిపించి, ఆ పాత ప్రిస్క్రిప్షన్ పైన ఆ టాబ్లెట్లను అలాగే కంటిన్యూ చేస్తుంటారు. యాంగ్జైటీ పిల్స్, స్ట్రెస్ పిల్స్, మూడ్ ఎలివేటర్స్.. ఇలా విభిన్న రకాలుగా ఉండే ఈ పిల్స్‌ను ఆందోళనగా అనిపింనప్పుడల్లా వాడతారు, క్రమేణా వాటికి అలవాటు పడిపోయి మరిన్ని సమస్యల్లోకి కూరుకుపోతున్నారు.
∙∙ వసుధ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ప్రాజెక్ట్ టీమ్ లీడర్‌గా బిజీ షెడ్యూల్ తనది. ఓ వైపు కుటుంబం, మరోవైపు ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం. కొన్నాళ్లు బాగానే మేనేజ్ చేసినా ఎదురయ్యే సమస్యలు టెన్షన్ పెట్టేవి. దీంతో ఆందోళన పెరిగిపోయేది. ఒత్తిడిని తగ్గించుకోవాలంటే బాగా నిద్రపోవాలని చెబుతుండేవారు స్నేహితులు. కానీ, ఆ ఒత్తిడి వల్లే నిద్ర పట్టడం లేదనేది వసుధ కంప్లైంట్. ఫ్రెండ్ సలహా మేరకు డాక్టర్ని కలిసింది. కొన్ని రోజులు ఆందోళన తగ్గడానికి ఒక మెడికల్ కోర్సును వాడమని చెప్పాడు డాక్టర్. ఆ కోర్స్ వాడాక తనకు చాలా రిలీఫ్‌గా అనిపింంది. ఆందోళనగా అనిపించినా, పనిభారంతో తల బరువుగా అనిపించినా అవే టాబ్లెట్స్ తెచ్చుకొని వాడటం మొదలుపెట్టింది.
ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు టాబ్లెట్ లేనిదే పరిష్కారం కాదు అనేంత స్థాయికి వచ్చేసింది. నిద్ర పట్టడం లేదని రాత్రిళ్లు స్లీపింగ్ పిల్స్ వేసుకునేది. కానీ, ఆఫీసుకు వెళ్లినా ఆ మత్తు ఆమెను వదిలేది కాదు. దీంతో తీసుకున్న ప్రాజెక్ట్ వర్క్స్ చేయడంలో ఆలస్యం అవుతూ ఉండేది. రోజులో ఎక్కువ సమయం మత్తుగా ఉండటంతో జాబ్ పోయే పరిస్థితి ఎదురైంది. లాయర్, డాక్టర్, ఇంజినీర్.. ప్రతీ వృత్తి, ఉద్యోగం చేస్తున్నవారిలో ఎన్నో ఆందోళనలు ఎదుర్కోవడం చూస్తున్నాం. ఈ ఆందోళన స్థాయి వారి శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో సమస్యను సాల్వ్ చేసుకోవడానికి టాబ్లెట్స్‌ను ఆశ్రయించేవారు పెరుగుతున్నారు. శరీరానికి ఏ కొద్దిగా కెమికల్‌ను బయట నుంచి అలవాటు చేసినా మైండ్ మరికొంత మోతాదు పెంచేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా కెమికల్ మోతాదు శరీరంపై చెడు ప్రభావం చూపడానికి దోహదం చేస్తాయి.
సహజమే కానీ..
- ఈ సమస్యను ఎదుర్కొనేవారిలో అధిక శాతం చదువుకున్నవారే. ‘ఇదేమీ చెడు అలవాటు కాదు కదా! నేను సరైన విధంగా మానేజ్ చేసుకోగలుగుతున్నాను కదా’ అనుకుంటారు. బయటి వాళ్లకు కూడా వీళ్లు ‘పిల్స్’వాడుతున్నారనే విషయం తెలియదు. కొంత కాలం బాగానే గడిచిపోతుంది. కానీ, సమస్య మాత్రం పెరుగుతూనే ఉంటుంది.
- ఏ వ్యక్తిలో అయినా భావోద్వేగాలు మారిపోతుండటం సహజంగా జరుగుతుంది.
- కొందరు మాత్రం ప్రతిదానికి ఆందోళన పడే వారుంటారు. మన వ్యక్తిత్వం ఇలాంటిది అని అర్థం చేసుకొని, ఈ సమస్యనుం బయటకు రావడానికి నిపుణులు సాయం తీసుకోవాలి.
- కొందరికి రకరకాల ఫోబియాలు ఉంటాయి. వీటిని అధిగమించడానికి కూడా టాబ్లెట్స్‌ని ఆశ్రయిస్తుంటారు. ఇవీ వనసిక సమస్యలే అని గుర్తించాలి.
బయటపడాలంటే టెక్నిక్స్:
- మనకు తెలియదు కానీ, చాలామంది మహిళల పర్సులలో కొన్ని టాబ్లెట్లు ఉంటాయి. అవి, పెయిన్ కిల్లర్స్, మూడ్ స్టెబిలైజర్స్, స్ట్రెస్ పిల్స్, స్లీపింగ్ పిల్స్... వంటి వాటిలో ఏవైనా ఉండచ్చు. ముందుగా వాటిని బయట పడేయాలి.
- ఏ సమస్య బాధిస్తోందో దానిని కుటుంబ సభ్యుల మధ్య లేదా నిపుణుల ముందు వ్యక్తం చేయాలి. ఆ సమస్యకు సంబంధించిన బ్లాక్స్‌ను క్లియర్ చేసుకుంటే సులువుగా బయటపడచ్చు.
- ప్రతి ఒక్కరిలోనూ సాధారణ ఆందోళనలు ఉంటాయి. కానీ, కొంతమంది మాత్రం ప్రతి చిన్న విషయానికీ ఆందోళన పడిపోతుంటారు. ఇది కొన్నిరోజులకు పెద్ద ఆందోళనగా వరుతుంటుంది. ఆందోళన తగ్గించుకోవడానికి పిల్స్ వాడకం బదులు, దానిని అధిగమించేలా మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాలి.
- శరీరం కెమికల్ మీద ఎంతవరకు డిపెండ్ అయిందో గుర్తించి దానిని బ్రేక్ చేస్తాం. మైండ్‌ను రిలాక్స్‌గా ఉంచే యోగా, ధ్యానంతోపాటు సరైన పోషకాహారం మీదా దృష్టి పెట్టాలి. శరీరం బయట నుంచి తీసుకునే కెమికల్ కాకుండా సహజసిద్ధంగా మార్పులకు లోనయ్యేలా అలవాటు చేసుకున్నప్పుడు ఇంటర్నల్ సిస్టమ్ రీ యాక్టివేట్ అవుతుంది.
– డాక్టర్ గిడియన్, డి–అడిక్షన్ థెరపిస్ట్ లివింగ్ సోబర్, హైదరాబాద్
(చదవండి: కీళ్లనొప్పులా?.. ఈ ఆహారం తీసుకోండి!)
Comments
Please login to add a commentAdd a comment