ఆమెతో పెళ్లి వద్దు.. వధువు మేకప్‌ ప్లాన్‌ ఎంత పనిచేసింది! | Woman Face Disfigured During Makeup At Karnataka | Sakshi
Sakshi News home page

ఆమె నాకు వద్దు.. వధువు చిన్న తప్పు కారణంగా షాకిచ్చిన వరుడు!

Published Sat, Mar 4 2023 7:32 AM | Last Updated on Sat, Mar 4 2023 7:44 AM

Woman Face Disfigured During Makeup At Karnataka - Sakshi

పెళ్లి వేడుక సందర్బంగా బ్యూటీపార్లర​్‌కు వెళ్లడమే ఆమె పాలిట శాపమైంది. చిన్న మిస్టేక్‌ కారణంగా వివాహం ఆగిపోయిన పరిస్థితి ఎదురైంది. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిదంటే..

వివరాల ప్రకారం.. కర్నాటకలోని హసన్‌ జిల్లాలోని అరసికెరె గ్రామానికి చెందిన ఓ యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కాగా, పెళ్లి కోసమని ఆమె స్థానికంగా ఉన్న ఓ బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా ఫేషియల్‌ అనంతరం ఆవిరి పడుతున్న క్రమంలో వేడి కారణంగా ఆమె ముఖం వాడిపోయింది. దీంతో, ఆమె రూపం మొత్తం మారిపోయింది. ముఖం నల్లగా అయిపోయి.. ఆవిరి కారణంగా ముఖం వాచిపోయింది. అనంతరం, ఆమెను ఆసుపత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతోంది.

ఈ నేపథ్యంలో ఆమెను చూసిన వరుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఆమె ముఖం మారిపోవడంతో వరుడు పెళ్లికి తిరస్కరించాడు. కాగా, వరుడి నిర్ణయంలో వధువు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ ఘటనకు కారణమైన బ్యూటీ పార్లర్ యజమాని గంగపై మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యజమానిని పిలిపించి విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, పెళ్లి ఆనందంలో ఉన్న ఇంట్ల ఈ చిన్న కారణంగా వివాహం ఆగిపోవడంతో ఈ ఘటన స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement