Hasan district
-
ఆమెతో పెళ్లి వద్దు.. వధువు మేకప్ ప్లాన్ ఎంత పనిచేసింది!
పెళ్లి వేడుక సందర్బంగా బ్యూటీపార్లర్‌కు వెళ్లడమే ఆమె పాలిట శాపమైంది. చిన్న మిస్టేక్ కారణంగా వివాహం ఆగిపోయిన పరిస్థితి ఎదురైంది. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిదంటే.. వివరాల ప్రకారం.. కర్నాటకలోని హసన్ జిల్లాలోని అరసికెరె గ్రామానికి చెందిన ఓ యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కాగా, పెళ్లి కోసమని ఆమె స్థానికంగా ఉన్న ఓ బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా ఫేషియల్ అనంతరం ఆవిరి పడుతున్న క్రమంలో వేడి కారణంగా ఆమె ముఖం వాడిపోయింది. దీంతో, ఆమె రూపం మొత్తం మారిపోయింది. ముఖం నల్లగా అయిపోయి.. ఆవిరి కారణంగా ముఖం వాచిపోయింది. అనంతరం, ఆమెను ఆసుపత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో ఆమెను చూసిన వరుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఆమె ముఖం మారిపోవడంతో వరుడు పెళ్లికి తిరస్కరించాడు. కాగా, వరుడి నిర్ణయంలో వధువు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ ఘటనకు కారణమైన బ్యూటీ పార్లర్ యజమాని గంగపై మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యజమానిని పిలిపించి విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, పెళ్లి ఆనందంలో ఉన్న ఇంట్ల ఈ చిన్న కారణంగా వివాహం ఆగిపోవడంతో ఈ ఘటన స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. -
Manjarabad Fort: మంజారాబాద్.. స్టార్ఫోర్ట్
ఆకాశంలో మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాన్ని చూడాలంటే తలెత్తి చూస్తే చాలు. నేల మీద ఉన్న ఈ నక్షత్రాన్ని చూడాలంటే మాత్రం ఆకాశంలో విహరించాల్సిందే. ఈ టూర్లో ఈ నక్షత్రకోటతోపాటు పశ్చిమ కనుమల ప్రకృతి విన్యాసాలన్నీ ఆస్వాదించవచ్చు. కర్ణాటక ఊటీ... నక్షత్రం ఆకారంలో ఉన్న ఈ కోట కర్ణాటక, హసన్ జిల్లాలో ఉంది. ఈ కోట సందర్శన పెద్ద సాహసం అనే చెప్పాలి. నాచు మధ్య జాగ్రత్తగా అడుగులు వేస్తూ దిగుడుబావి ఒడ్డుకు చేరడం యువతకే సాధ్యం. ఏడాది మొత్తం ఇక్కడ చల్లగానే ఉంటుంది. ఈ చల్లదనానికి పశ్చిమ కనుమల పచ్చదనం కూడా కారణమే. సక్లేశ్‌పురా నుంచి ఈ కోటకు ప్రయాణం మొదలైనప్పటి నుంచి కాఫీ గింజల పరిమళం ఉత్సాహాన్నిస్తుంది. ఆకాశాన్నంటుతున్న పోక చెట్లు మీ ప్రయాణం కూడా ఆకాశం వైపేనని గుర్తు చేస్తాయి. యాలకుల చెట్లు వాతావరణాన్ని సుగంధభరితం చేస్తుంటే మిరియాల గుత్తులు ఒకింత ఘాటు వాసనతో ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్నిస్తుంటాయి. చల్లటి వాతావరణంలో గొంతు గరగర అనిపిస్తే రెండు మిరియాలను నమిలితే పర్యటన ఆరోగ్యంగా ముందుకు సాగుతుంది. మధ్యలో చిన్న చిన్న నీటి కాలువలు పాదాలను కడుగుతుంటాయి. కొండల్లో ప్రవహించే స్వచ్ఛమైన నీరు చల్లగా పాదాలను స్పృశిస్తుంటే చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఈ హిల్స్టేషన్ను ఊటీతో పోలుస్తారు. ఊటీ సంపన్నుల పర్యాటక క్షేత్రం అయితే ఇది పేదవారి పర్యాటక ప్రదేశమని చెబుతారు. మంచులో మెరిసిన నక్షత్రం... హసన్ జిల్లా కేంద్రానికి 45 కి.మీల దూరంలో మల్నాడు రీజియన్, సక్లేశ్‌పురా పట్టణానికి దగ్గరలో ఉన్న స్టార్ఫోర్ట్ అసలు పేరు మంజారాబాద్ కోట. మంజు అంటే కన్నడలో మంచు అని అర్థం. ఎప్పుడూ మంచు తెర కమ్మినట్లే ఉంటుంది ఇక్కడి వాతావరణం. ఇది మైసూరు పాలకుల వేసవి విడిదిగా ఉండేది. ఈ కోటలో పెద్ద ఆయుధాగారం ఉండేదని ఇప్పుడున్న ఆనవాళ్లు చెబుతుంటాయి. మైసూర్ కోట నుంచి ఈ కోటకు రహస్య మార్గం ఉండేదని స్థానిక కథనం. ఎనిమిది కోణాల నిర్మాణం ఇది. నిజానికి దీనిని ఎనిమిది రెక్కల పద్మం ఆకారం అనే చెప్పాలి. అయితే మూలలు కోసుగా కోణాకారంలో ఉండడంతో నక్షత్రకోటగా వాడుకలోకి వచ్చింది. -
చెత్తకుప్పలో మెతుకులే పరమాన్నం
బనశంకరి: మానవాళికి కరోనా తెచ్చిన కష్టాలు అన్నీఇన్నీ కావు. అప్పటివరకు సాఫీగా సాగిపోతున్న లక్షలాది కుటుంబాలు సుడిగుండాల్లో చిక్కుకున్నాయి. ఉద్యోగాలు, ఉపాధి పోయి రోడ్డున పడ్డవారెందరో. ఒక కూలీ పని కోల్పోయి చేతిలో చిల్లిగవ్వ లేక చెత్తకుప్పలో మెతుకులు ఏరుకుతింటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సంఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లాలో జరిగింది. ఆలూరు తాలూకా కోనపేటే రోడ్డులో పొరుగూరికి చెందిన రాజు అనే వ్యక్తి చెత్త కుప్పలో ఆహారం ఏరుకుని తిన్నాడు. దారినపోయేవారు గమనించి విచారించగా ఆకలిని తట్టుకోలేక ఇలా చేస్తున్నానని సమాధానమిచ్చాడు. అల్లంతోటలో ఏడాది కిందట పని కోసం వచ్చానని, లాక్‌డౌన్‌తో పని పోయిందని, ఊరికి వెళ్లడానికి కూడా డబ్బులు లేవని చెప్పాడు. తెలిసినవారు కూడా ఎవరూ లేరని రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. విషయం తెలిసిన తాలూకా కట్టడ కార్మికుల సంఘం అధ్యక్షుడు ఆనంద్ అన్నం, సాంబారు తెప్పించి రాజుకు అందజేశాడు. తాలూకా ఆరోగ్యాధికారి డాక్టర్ తిమ్మయ్య ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. రాజుకి తానే తాపీ పని ఇప్పిస్తానని ఆనంద్ చెప్పాడు. చదవండి: మనిషిని అనుకరించిన ఏనుగు.. ఏకంగా తొండంతో -
హీరో యశ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు
యశవంతపుర: కేజీఎఫ్ ఫేమ్.. హీరో యశ్‌పై రాజ్య రైతు సంఘం కార్యాధ్యక్షుడు అణ్ణాజప్ప హాసన్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. యశ్ తల్లిదండ్రులు ఇటీవల దుద్ధ హోబళి తిమ్మాపుర గ్రామంలో కొనుగోలు చేసిన భూమిలో అక్రమంగా ప్రహరీ నిర్మించి రైతులకు ఇబ్బందులకు గురి చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గూండాలను రప్పించి గ్రామస్తులను యశ్ భయపెడుతున్నట్లు ఆరోపించారు. రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవలే యశ్ తల్లికి, గ్రామస్థులకి మధ్య గొడవ జరిగింది. యశ్ తల్లి కర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందినవారు. హాసన్‌లో సొంత ఇల్లు ఉంది. హాసన్ సమీపంలోని తిమ్మాపుర గ్రామంలో ఇటీవల 80 ఎకరాల భూమిని యశ్ కుటుంబం కొనుగోలు చేసింది. తమ పొలాలకు దారిని మూసివేశారని గ్రామస్థులు యశ్ తల్లి పుష్పలతతో గొడవ పడ్డారు. వివాదం పెద్దది కావంతో గ్రామస్థులు దుద్ద పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చదవండి: భూ వివాదంలో హీరో యశ్ కుటుంబం -
బలవంతంగా యువతికి తాళి కట్టాడు
-
బలవంతంగా యువతికి తాళి కట్టాడు
బెంగళూరు: కర్ణాటకలోని హసన్ జిల్లాలో అనూహ్య ఘటన జరిగింది. బస్సు కోసం ఎదురు చూస్తున్న ఓ యువతిని అందరూ చూస్తుండగానే కొందరు దుండగులు అపహరించుకుపోయారు. ఆ యువతిని కారులోకి లాక్కెళ్లగా, వారిలో ఒకరు ఆమెకు బలవంతంగా తాళి కట్టారు. యువతికి వరుసకు బావ అయిన మను అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. యువతి వివాహానికి నిరాకరించిందన్న ఆగ్రహంతో ఆమెను అపహరించించాడు. తనను వదిలేయాలని యువతి ఎంత బతిమిలాడినా వినకుండా బలవంతంగా తాళి కట్టాడు. బాధిత యువతి ఎంత పెనుగులాడినా ఫలితం లేకుండా పోయింది. మనుకి మరో ఇద్దరు సహకరించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువతిని మను తన స్నేహితుడి వద్ద దాచినట్లు ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
#మీటూ: ‘ముద్దుకు ఒక రేటు, వస్తే అడిగినంత’
యశవంతపుర: మీటూ లైంగిక వేధింపుల ఆరోపణలు సినిమా రంగానికే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. తమకు జరిగిన అన్యాయంపై అనేక మంది యువతులు మీ టూ అని గళమెత్తుతున్నారు. కర్ణాటకలోకి హాసన్ ప్రాంతానికి చెందిన ఓ నిరుద్యోగ యువతి ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకంపై మీటూ అంటూ సెల్ఫీ వీడియోను తీసి ఫేస్బుక్, వాట్సప్‌లలో పోస్ట్ చేసింది. ఆ పోస్టు విస్తృతంగా షేర్ అవుతోంది. ఉద్యోగమిప్పిస్తానని.. బాధిత యువతి తన పేరును వెల్లడించకుండా.. తనను వేధించిన వ్యక్తి ఎవరో చాటిచెప్పింది. హాసన్ కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కృష్ణేగౌడ ఉద్వోగం ఇప్పిస్తానంటూ నమ్మించి తన మొబైల్ నంబర్‌ను తీసు కుని లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిపింది. ముద్దుకు ఒక రేటు, పిలిచినప్పుడు వస్తే అడిగినంత డబ్బులు ఇస్తానంటూ తనపై ఒత్తిడి చేసిన్నట్లు గోడును వెళ్లబోసుకుంది. పత్రికలు, టీవీలో వస్తున్న మీటూ ఉద్యమం స్ఫూర్తితో తన బాధను వెల్లడిస్తున్నట్లు ఆమె తెలిపింది. కామాంధునిపై చర్యలకు జిల్లా ఎస్పీ ప్రకాశ్‌గౌడ సాయం కావాలని, కృష్ణేగౌడ లాంటి కీచకుడికి చట్టం ప్రకారం శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. రిటైరయ్యే వయస్సులోనున్న అతడు.. రూ.15 వేలు ఇస్తా, ఒక ముద్దు పెట్టించుకోవాలని తనను వేధించినట్టు ఆమె వెల్లడించింది. నువ్వూ ఒక తండ్రివేనా?: గురుప్రసాద్‌పై భార్య ఆగ్రహం మీ టూను కొందరు నటీమణులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించిన దర్శకుడు గురుప్రసాద్‌పై అతని మొదటి భార్య ఆరతి విరుచుకుపడ్డారు. 14 ఏళ్ల వయస్సున్న కూతురు, భార్యను అర్ధరాత్రి ఇంటి నుండి గెంటేసిన సంగతి మరిచావా అని ప్రశ్నించారు. ఒక తండ్రిగా ఆయన ప్రవర్తించలేదని, గురుప్రసాద్‌కు ఒక కూతురుందనే విషయం మరిచి మాట్లాడటం సరికాదన్నారు. ఇంటి నుంచి తనను గెంటివేస్తే ఎలాంటి గొడవ చేయకుండా బయటకు వచ్చానన్నారు. తండ్రిగా బాధ్యతలను నిర్వహించలేని గురుప్రసాద్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. తాను విడాకులు తీసుకోవాలనుకున్నా ఆయన సిద్ధంగా లేరని చెప్పారు. సంగీతభట్ భర్త సైతం.. యశవంతపుర: దర్శకుడు గురుప్రసాద్ చేసిన వ్యాఖ్యలను నటి సంగీతాభట్ భర్త సుదర్శన్ భట్ ఖండించారు. సంగీత ఇప్పుడు చిత్రరంగాన్ని వదిలేశారు. ప్రచారం కోసం మీటూ ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేశారు. -
బాలుడిని చిరుతే తినేసింది
* కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఘోరం బెంగళూరు, న్యూస్‌లైన్: ఎప్పటిలానే.. ఆరోజూ స్కూల్లో చివరిబెల్ మోగింది. ఆరేళ్ల బాలుడు పుస్తకాల బ్యాగుతో ఆదుర్దాగా ఇంటికి చేరుకున్నాడు. తనను ప్రేమగా చూసుకునే అవ్వ, తాత కనిపించలేదు. అమ్మను అడిగితే.. పొలానికి వెళ్లార్రా అని చెప్పింది. వారిని వెతుక్కుంటూ పొలంవైపు ఆ చిన్నారి ఒక్కడే అడుగులు వేస్తూ ధైర్యంగా వెళ్లాడు. ఇంతలో ఎక్కడి నుంచో మాయదారి చిరుత పులి ఊడిపడింది. రాక్షసంగా ఆ పసివాడిపై దాడి చేసి తినేసింది. అమ్మా అంటూ ఆ చిన్నారి చేసిన ఆర్తనాదాలు.. ఆ తల్లి చెవిని చేరేలోపే పసివాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కన్నీళ్లు తెప్పించే ఈ ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లా లో బుధవారం జరిగింది. హాసన్ జిల్లా హొసళేహొసళ్లి సమీపంలోని నాగేనహళ్లి గ్రామానికి చెందిన అణ్గేగౌడ కుమారుడు తేజస్(6) బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చాడు. పొలంలో ఉన్న అవ్వ, తాత కోసం వెళుతుండగా.. మార్గ మధ్యంలో ఓ చిరుత పులి తేజస్‌ను ఈడ్చుకుని పొదల్లోకి లాక్కెళ్లి తినేసింది. రాత్రి అయినా తేజస్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సమీప ప్రాంతాల్లో గాలించారు. పొలం సమీపంలోని పొదల్లో బాలుడు వేసుకున్న చొక్కా, నిక్కర్ రక్తపు మరకలతో కనిపిం చాయి. అక్కడే ఎముకలు కూడా పడి ఉన్నాయి. దీంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి గాలించినా తేజస్ మృతదేహం కనిపించలేదు. పైగా ఆ ప్రాంతంలో చిరుత అడుగులు కనిపించడంతో బాలుడిని అది తినేసి ఉంటుందని భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల న ష్టపరిహారం చెల్లిస్తామని అటవీ అధికారి అప్పారావు హామీ ఇచ్చారు.