
బెంగళూరు: కర్ణాటకలోని హసన్ జిల్లాలో అనూహ్య ఘటన జరిగింది. బస్సు కోసం ఎదురు చూస్తున్న ఓ యువతిని అందరూ చూస్తుండగానే కొందరు దుండగులు అపహరించుకుపోయారు. ఆ యువతిని కారులోకి లాక్కెళ్లగా, వారిలో ఒకరు ఆమెకు బలవంతంగా తాళి కట్టారు. యువతికి వరుసకు బావ అయిన మను అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. యువతి వివాహానికి నిరాకరించిందన్న ఆగ్రహంతో ఆమెను అపహరించించాడు.
తనను వదిలేయాలని యువతి ఎంత బతిమిలాడినా వినకుండా బలవంతంగా తాళి కట్టాడు. బాధిత యువతి ఎంత పెనుగులాడినా ఫలితం లేకుండా పోయింది. మనుకి మరో ఇద్దరు సహకరించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువతిని మను తన స్నేహితుడి వద్ద దాచినట్లు ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment