బెంగళూరు: వేసవి కాలం పోయింది.. ఇక వానల కోసం ప్రజలు, ముఖ్యంగా రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వర్షాల కోసం వాళ్ల పూర్వికులు ఆచరించిన ఆచారాలు పాటించడం ప్రారంభించారు. ఇందులో కొన్ని వింతగా కూడా ఉంటున్నాయి. తాజాగా ఓ గ్రామంలో వానలు పడటంలేదని ఆ గ్రామస్తులంతా కలిసి ఓ విచిత్ర కార్యక్రమం నిర్వహించారు. వాన దేవుళ్లను తృప్తిపర్చడం కోసం గ్రామంలోని ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి జరిపించారు.
ఒక అబ్బాయికి పెళ్లి కొడుకు లాగా, మరో అబ్బాయికి పెళ్లి కూతురు లాగా తయారు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతేడాది కంటే తక్కువ వర్షపాతం నమోదైందని మాండ్య జిల్లాలోని కృష్ణరాజ్‌పేట తాలూకా గంగేనహళ్లి గ్రామంలో ఈ పూజలు నిర్వహించారు. కళ్యాణోత్సవంలో భాగంగా ప్రజలకు ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేసి వర్షం కురవాలని వానదేవుడిని ప్రార్థించారు. వాన దేవతలను ప్రసన్నం చేసుకోవడం ద్వారా వర్షాలు పడుతాయని ఇది సాంప్రదాయ ప్రార్థనలో ఒక భాగమని స్థానికులు తెలిపారు.
రాష్ట్రంలో రుతుపవనాలు తగ్గుముఖం పట్టడంతో గతేడాది కంటే ఈ ఏడాది తక్కువ వర్షాలు కురిశాయని వారు తెలిపారు. ఇదిలావుండగా, రానున్న మూడు రోజుల పాటు కోస్తా, దక్షిణ లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కర్ణాటక వాతావరణ శాఖ తెలిపింది. మెజారిటీ కోస్తా జిల్లాలు, దక్షిణ లోతట్టు ప్రాంతాల్లోని అనేక జిల్లాలు, ఉత్తర లోతట్టు ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షం, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
చదవండి: కనిమొళి అభినందన.. ఆమె ఉద్యోగం పోయిందా?.. అసలేం జరిగిందంటే..
Comments
Please login to add a commentAdd a comment