Protests In Chandigarh University After Girls Hostel Video Leaked - Sakshi
Sakshi News home page

Chandigarh University: యూనివర్సిటీలో హైటెన్షన్‌.. హాస్టల్‌ యువతుల ప్రైవేటు వీడియోలు సోషల్‌ మీడియాలో లీక్‌..!

Published Sun, Sep 18 2022 9:46 AM | Last Updated on Sun, Sep 18 2022 11:31 AM

Protests In Chandigarh University After Girls Hostel Videos Leak - Sakshi

ఓ యువతి యూనివర్సిటీలో తన హాస్టల్‌మేట్స్‌ (60 మం‍ది అమ్మాయిల) ప్రైవేటు వీడియోలను సోషల్‌ మీడియాలో పెట్టడం కలకలం సృష్టించింది. దీంతో, హాస్టల్‌ విద్యార్థులు నిరసనలకు దిగారు. ఈ షాకింగ్‌ ఘటన పంజాబ్‌లోని చండీగఢ్‌ యూనివర్సిటీలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. ఓ యువతి తనతో పాటు చదువుకుంటూ తన రూమ్‌లో ఉంటున్న యువతుల వీడియోలను తీసింది. బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్న సమయంలో ఫోన్‌లో సీక్రెట్‌గా వీడియోలు తీసి అనంతరం, ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో, తన ఫ్రెండ్స్‌కు షేర్‌ చేసింది. ఈ విషయం బాధితురాలికి తెలియడంతో ఆమెను నిలదీసింది. దీంతో, హాస్టల్‌లోని విద్యార్థులంతా నిరసనకు దిగారు. 

రంగంలోకి దిగిన యూనివర్సిటీ అధికారులు, పోలీసులు.. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితురాలు.. మరికొందరు విద్యార్థుల ప్రైవేటు వీడియోలను సైతం లీక్‌ చేస్తున్నట్టు కూడా విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ షాకింగ్‌ ఘటనపై నిరసనలు తెలుపుతుండగా ఓ విద్యార్థిని స్పృహ తప్పి కిందపడిపోవడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

కాగా, ఈ ఘటన కారణంగా హాస్టల్‌లోని పలువురు యువతులు ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వార్తలు బయటకు వచ్చాయి. అయితే, ఈ వార్తలను పోలీసులు, యూనివర్సిటీ పరిపాలనా విభాగం ఖండించింది. పుక్లార్లు నమ్మవద్దంటూ స్పష్టం​ చేశారు. ఇక, ఘటనపై పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ స్పందించారు. ఈ వ్యవహారంలో నిందితులను విడిచిపెట్టే ప్రసక్తేలేదు. విద్యార్థులందరూ ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement