![HYD: Woman Blackmails Man With His Private Videos - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/14/woman_0_0.jpg.webp?itok=ALYBTCip)
ప్రతీకాత్మక చిత్రం
అమీర్‌పేట: ఓ వ్యక్తి యువతితో సన్నిహితంగా ఉన్న వీడియోలను చూపించి బెదిరింపులకు పాల్పడిన సినీ నటిపై ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల మేరకు.. సినీ పరిశ్రమలో పనిచేసే 28 ఏళ్ల యువరాజ్‌కుమార్‌కు అదే పరిశ్రమకు చెందిన 25 ఏళ్ల పడాల లక్ష్మి ఓ వీడియో పంపింది. అందులో అతడు ఓ యువతితో సన్నితంగా ఉన్న వీడియో ఉంది. తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని, లేని పక్షంలో సామాజిక మాధ్యమాలలో వీడియోలను వైరల్ చేస్తానని బెదిరింపులకు దిగింది. దీంతో అతడు ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment