సాక్షి, మేడ్చల్: మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్ బాత్ రూమ్‌ల్లో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో, టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల ప్రకారం.. సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్ రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్టు విద్యార్థినిలు ఆరోపించారు. రహస్యంగా వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో పని చేసే వంట సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో, వీడియోల ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించాలని నినాదాలు చేశారు.
అనంతరం, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా.. విద్యార్థినిల ఆందోళనలతో వారి పేరెంట్స్ కాలేజీ వద్దకు చేరుకుంటున్నారు. ఈ ఘటనపై యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో, కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment