
బాణసంచా కాలుస్తున్న విద్యార్థులు
గన్‌ఫౌండ్రీ: నిజాం కళాశాల విద్యార్థినులు 15 రోజులుగా చేస్తున్న ఆందోళనకు ఫలితం దక్కింది. విద్యార్థినులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం జరిపిన చర్చలు ఫలించాయి. నిజాం కాలేజీ హాస్టల్‌ను యూజీ విద్యార్థినులకే కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తమ సమస్యల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించడంపై పలువురు విద్యార్థినులు సంతృప్తి వ్యక్తం చేశారు.
తమ పోరాటానికి మద్దతుగా నిలిచిన రాజకీయ, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలి పారు. ఎలాంటి షరతులు లేకుండా డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సి పల్ సూచించారు. దీంతో విద్యార్థినులు తమ అందోళనను విరమించారు. బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment