nizam college hostel
-
యూజీ విద్యార్థినులకే నిజాం హాస్టల్
గన్‌ఫౌండ్రీ: నిజాం కళాశాల విద్యార్థినులు 15 రోజులుగా చేస్తున్న ఆందోళనకు ఫలితం దక్కింది. విద్యార్థినులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం జరిపిన చర్చలు ఫలించాయి. నిజాం కాలేజీ హాస్టల్‌ను యూజీ విద్యార్థినులకే కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తమ సమస్యల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించడంపై పలువురు విద్యార్థినులు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ పోరాటానికి మద్దతుగా నిలిచిన రాజకీయ, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలి పారు. ఎలాంటి షరతులు లేకుండా డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సి పల్ సూచించారు. దీంతో విద్యార్థినులు తమ అందోళనను విరమించారు. బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. -
బిల్లు ఓడినా నష్టం లేదు: కోదండరామ్
నల్గొండ: తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీలో ఓడిపోతే నష్టమేమీ లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని చెప్పారు. శాసనసభలో సీఎం కిరణ్ వైఖరి ప్రజలను ఆవేశానికి గురిచేసిందన్నారు. అయినా తెలంగాణ ప్రజలు ఆందోళనకు గురికావద్దని ఆయన కోరారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు ఖయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణంలో జేఏసీ పాత్ర ఉంటుందన్నారు. కాగా విభజన బిల్లు తిరస్కార తీర్మానం ఆమోదం పొందడంతో హైదరాబాద్ నిజాంకాలేజీ హాస్టల్లో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు సీఎం కిరణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అసెంబ్లీని ముట్టడించేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నిజాం హాస్టల్లో టెన్షన్.. టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా నిజాం కాలేజీ హాస్టల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బయటి విద్యార్థులను (ఔటర్స్) హాస్టల్ నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు హాస్టల్లోకి రావడాన్ని నిరసిస్తూ విద్యార్థులు హాస్టల్ భవనంపైకి ఎక్కి నిరసన తెలిపారు. వారిని కిందకు దింపేందుకు పోలీసులు వెళ్లడంతో విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీలను ఝళిపించడంతో పలువురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. విద్యార్థులపై లాఠీచార్జిని ఓయూ జేఏసీ, టీఎస్ జాక్ తీవ్రంగా ఖండించాయి. ఇక ఏపీఎన్జీవోల సభలో ‘జై తెలంగాణ’ నినాదాలు కలకలం సృష్టించాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ పోలీసుల కన్నుగప్పి సభలోకి వెళ్లి తెలంగాణ నినాదాలు చేశారు. అలాగే ఇదే సభలో ప్రసంగాలు సాగుతుండగా వేదిక సమీపంలో విధుల్లో ఉన్న సిద్దిపేట సాయుధ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ జై తెలంగాణ అంటూ నినదించారు. దీంతో వీరిద్దరిపై సభకు వచ్చిన వారిలో పలువురు దాడికి పాల్పడ్డారు.