
బిల్లు ఓడినా నష్టం లేదు: కోదండరామ్
నల్గొండ: తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీలో ఓడిపోతే నష్టమేమీ లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని చెప్పారు. శాసనసభలో సీఎం కిరణ్ వైఖరి ప్రజలను ఆవేశానికి గురిచేసిందన్నారు. అయినా తెలంగాణ ప్రజలు ఆందోళనకు గురికావద్దని ఆయన కోరారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు ఖయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణంలో జేఏసీ పాత్ర ఉంటుందన్నారు.
కాగా విభజన బిల్లు తిరస్కార తీర్మానం ఆమోదం పొందడంతో హైదరాబాద్ నిజాంకాలేజీ హాస్టల్‌లో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు సీఎం కిరణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అసెంబ్లీని ముట్టడించేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.