కృష్ణాజిల్లా మొవ్వలోని ఎస్సీ హాస్టల్లో ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ఆరా తీశారు.
మచిలీపట్నం: కృష్ణాజిల్లా మొవ్వలోని ఎస్సీ హాస్టల్లో ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ఆరా తీశారు. అందుకు బాధ్యుడైన వార్డెన్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.
సోమవారం రాత్రి మొవ్వ ఎస్సీ హాస్టల్లో ఆహారం తిని 13 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యం పాలైయ్యారు. దాంతో వారిని హుటాహుటిన బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యాధికారులు తెలిపారు. ఈ ఘటనపై మంత్రి విచారణకు ఆదేశించారు. అయితే ఘటన జరిగిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.