vizayanagaram
-
రామతీర్థంలో నేడు సీతారాముల కళ్యాణం
-
బాహుబలి క్రేన్ తో బోగీల తొలగింపు..
-
సీఎం జగన్ కు రైల్వే మంత్రి ఫోన్, సహాయక చర్యలు వివరించిన సీఎం
-
విజయనగరం రైలు ప్రమాదం..ఎలా జరిగిందంటే ?
-
విజయనగరంలో శరవేగంగా మెడికల్ కాలేజ్ భవనం నిర్మాణం
-
ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిళా పార్క్ విజయనగరంలో ఏర్పాటు
-
ఘనంగా విజయనగరం ఉత్సవాలు
-
చంపావతి నది ఉద్ధృతి తగ్గాలని పసుపు, కుంకుమలు సమర్పించుకున్న మహిళలు
-
వేగావతి కాలువలో పడి..ఇద్దరు యువతులు మృతి
సాక్షి,విజయనగరం: పశు పోషణే వారి జీవనాధారం. రోజూ వలే శనివారం ఉదయం గేదెలను మేత కు తోలుకెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకునే సమయంలో ఇద్దరు గిరిజన యువతులను కాలువ రూపంలో మృత్యువు కాటేసింది. ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పాచిపెంట ఎస్ఐ ఎం.వెంకటరమణ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచాడవలసకు చెందిన ఇద్దరు గిరిజన యువతులు తోరిక గాయత్రి(17), సంగిరెడ్డి నాగమణి (25) తోటి కాపరులతో కలిసి (ఆరుగురు కాపరులు) గేదెలను కర్రివలస పంచాయతీ అమ్మవలస గ్రామ పొలాల వైపు తోలుకెళ్లారు. సాయంత్రం తిరిగి గేదెలను ఇంటికి తోలుకువస్తుండగా మార్గం మధ్యలోని అమ్మవలస సమీపంలో కర్రివలస వేగావతి ఆయకట్టు ఎడమకాలువలో దిగాయి. ఇటీవల కురిసిన వర్షా లకు కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇసుక తవ్వకాలు, పూడికల తొలగింపుతో కాలువ లోతు ఎక్కువ గా ఉంది. గేదెలను ఒడ్డుకు చేర్చే ఆత్రుతలో కాలువ లోతును గుర్తించకుండా ఇద్దరూ నీటిలో దిగారు. అంతే.. ఈత రాకపోవడంతో మునిగిపోయారు. కళ్లముందరే మునిగిపోతున్న యువతులను కాపాడేందుకు తోటి కాపరుల ప్రయత్నం ఫలించలేదు. వారి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. అప్పటివర కు తమతో సరదాగా గడిపిన యువతుల మృతితో బోరున విలపించారు. పోలీసులకు సమాచారం అందజేయడంతో మృతదేహాల ను పంచనామా నిమిత్తం సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. వీరి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
కరోనా బాధితులకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాము
-
ప్రమాదాల వెం‘బడి’
సాక్షి, పార్వతీపురం (విజయనగరం): విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి కేవలం రెండ్రోజుల వ్యవధి ఉంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు ఇబ్బడి ముబ్బడిగా ప్రకటనలు చేస్తూ విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. విద్య పేరు చెప్పి రూ.లక్షలు దండుకోవాలన్న ధ్యాస తప్పా విద్యార్థులకు తగిన భద్రత కల్పించాలన్న ఆలోచన విద్యా సంస్థల యాజమాన్యాలకు లేదన్న విమర్శలున్నాయి. పాఠశాల బస్సుల నిర్వహణలో నిబంధనలు పాటించకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్థుల జీవితాలు గాల్లో దీపాలవుతున్నాయి. జిల్లాలో స్కూలు బస్సుల పరిస్థితిని చూసిన విద్యార్థులు తల్లిదండ్రులు హడలిపోతున్నారు. సీట్లు చిరిగిపోయి, దుమ్ము, ధూళి పేరుకుపోయి, ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో మందులున్నా లేకపోయినా.. ఉన్న మందులు కాస్తా గడువు తేదీ దాటిపోయినా పట్టించుకోకుండా లాభార్జన చూసుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా వందలాది పాఠశాలల్లో ఇదే పరిస్థితి. డబ్బులు వసూళ్లు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రమాణాలు పాటించడంలో చూపించడం లేదు. వీరికి ఇటు విద్యాశాఖాధికారులు, అటు రవాణా శాఖాధికారులు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిట్నెస్ లేని కారణంగా ఎన్నోచోట్ల విద్యార్థులు ప్రమాదాలకు గురౌతున్నారు. నిబంధనలివి ► బస్సు సర్వీసు వయసు 15 ఏళ్లకు మించి ఉండరాదు. కచ్చితంగా బస్సుకు బీమా ఉండాలి ► బస్సు ముందు, వెనుక స్కూల్‌బస్సు అని రాసి ఉండాలి. దాని పక్కనే పాఠశాల పిల్లల బొమ్మలు ఉండాలి. ► పిల్లలు ఎక్కడానికి వీలుగా ఫుట్ బోర్డు మొదటి మెట్టు భూమి నుంచి 325 మిల్లీమీటర్ల ఎత్తు ఉండాలి ► బస్సు వెనుకవైపు అత్యవసర ద్వారం ఏర్పాటు చేసి చీకట్లో కూడా దాన్ని గుర్తించే విధంగా రేడియం స్టిక్కర్‌ను అంటించాలి. అత్యవసర ద్వారం అని తప్పకుండా రాసి ఉండాలి ► అగ్నిమాపక నిదోధక పరికరాలు, ప్రథమ చికిత్స పరికరాల కిట్ ఏర్పాటు చేసి చికిత్సకు అవసరమైన మందులు అందులో ఉంచాలి. ► బస్సు ముందు తెలుపు, వెనుక ఎరుపు, పక్కన పసుపు రంగుతో కూడిన రేడియం స్టిక్కర్లు అంటించాలి. ► తప్పనిసరిగా వాహనాలకు పరావరణశాఖ అనుమతి ఉండాలి. పాఠశాల బస్సులు 40 కిలోమీటర్ల వేగాన్ని మించి నడుపరాదు. కొత్త వాహనానికి ఇరువైపులా పసుపు రంగు టేపు అతికించాలి. ► బస్సు తలుపు తెరుచుకుని విద్యార్థులు దిగేటప్పుడు వెనుకనుంచి వచ్చే వాహనదారులు గమనించే విధంగా స్టాప్ బోర్డును తలుపుమీద ఏర్పాటు చేయాలి. ► స్టీరింగ్, బ్రేక్, హారన్ కండిషన్లో ఉండాలి. విద్యార్థి కూర్చోవడానికి వీలుగా కుషన్ సీట్లు ఏర్పాటు చేయాలి ► బస్సుకు నలుమూలలా యాంచర్ కలర్ లైట్లు ఏర్పాటు చేయాలి. బస్సులో అత్యవసర ద్వారాలు ఏర్పాటుచేయాలి. డ్రైవర్ నిబంధనలు ► 25 నుంచి 60 ఏళ్ల లోపు ఆరోగ్యవంతుడై ఉండాలి. హెవీ వెహికల్ లైసెన్సుతో పాటుగా కనీసం 5 ఏళ్ల అనుభం ఉండాలి ► కంటిచూపు స్పష్టంగా ఉంటూ కనీసం 6/2 కంటిచూపు కచ్చితంగా ఉండాలి. డ్రైవర్, క్లీనర్లు యూనిఫాం ధరించాలి. విధుల్లో మద్యం తాగరాదు. ► ఏటా ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకుని బస్సును నడపడానికి అర్హుడేనని డాక్టర్ ధ్రువపత్రం పొందాలి. పాఠశాల ఆవరణలో బస్సు పార్కింగ్ ఏర్పాటు చేయాలి యాజమాన్యాల బాధ్యతలివీ.. ► బస్సు డ్రైవర్, సహాయకుడి ఫొటో, లైసెన్స్ వివరాలను అందరికీ తెలిసేలా బస్సు లోపల బోర్డులో పెట్టించాలి. నిత్యం ప్రయాణించే విద్యార్థుల జాబితాను బస్సులో ఏర్పాటు చేయాలి ► విద్యార్థులను ఎక్కించి, దింపేందుకు ప్రతి బస్సుకు ఒక సహాయకుడిని ఏర్పాటు చేయాలి. రోజూ బస్సు వెళ్లే మార్గాన్ని (రూట్ మ్యాప్) బస్సులో అతికించాలి. తప్పనిసరిగా బస్సులను పాఠశాల ఆవరణలోనే పార్కింగ్ చేయాలి. ► పాఠశాల యాజమాన్యం పిల్లల తల్లిదండ్రులతో కలసి కమిటీని ఏర్పాటు చేసి ప్రతి నెల బస్సు పరిస్థితిని సమీక్షించాలి. రోజూ ప్రయాణించే మార్గాన్ని ప్రధానోపాధ్యాయుడు అప్పుడప్పుడు పరిశీలించాలి పాఠశాల ఆటోలు పాటించాల్సినవి.. ► ఆటో మందు, వెనుక భాగంలో పాఠశాల ఆటో అని రాయించాలి. ఆరుగురు విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లాలి. ఆటో నడిపే డ్రైవర్‌కు ఏఆర్ (ఆటో రిక్షా) రవాణా వాహనం లైసెన్స్ ఉండాలి. ► ఆటోకు రెండువైపులా గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. పది కిలోమీటర్ల లోపున్న పాఠశాలల పిల్లల్ని మాత్రమే తీసుకెళ్లాలి. అధికారుల బాధ్యతలివి ► వేసవి సెలవులు ప్రారంభం కాగానే బస్సుల తనిఖీపై పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు పంపాలి. పాత బస్సులైతే ఏటా ఒకసారి, కొత్త బస్సులైతే రెండేళ్లకోసారి తనిఖీలు నిర్వహించాలి ► బస్సు కండిషన్‌ను రవాణా శాఖాధికారులు, సిబ్బంది స్వయంగా పరిశీలించాలి. కండిషన్ సరిగా లేకుంటే సమస్యను పరిష్కరించి తీసుకురావాలని సూచించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్సు నిర్వహణ ఉన్నదీ లేనిదీ పరిశీలించాలి. అతిక్రమిస్తే కఠిన చర్య ఈ ఏడాది ఇప్పటికే డివిజన్ వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల బస్సులను అణువణువూ పరిశీలించాం. డివిజన్ వ్యాప్తంగా 100 బస్సులుండగా వాటిలో 80 బస్సులు ఫిట్నెస్ కోసం వచ్చాయి. కొన్నింటికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చాం. కొన్ని బస్సులను మరమ్మతుల నిమిత్తం పంపించాం. బస్సుల ఫిట్మెంట్ విషయంలో ఎలాంటి రాజీ పడటం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల ప్రారంభానికి ముందే అన్ని బస్సులను తనిఖీ చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని అనుమతించడం లేదు. ఎవరు నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఎంవీఐ,పార్వతీపురం -
రాజులను తరిమికొట్టండి
బొబ్బిలి: స్వప్రయోజనాల కోసం పార్టీ మారిన రాజులను తరిమికొట్టాలని మాల, మాదిగ బహుజన రాష్ట్ర నాయకులు మల్లెల వెంకటరావు అన్నారు. శనివారం స్థానిక తాండ్ర పాపారాయ జంక్షన్లో దళితుల అభివృద్ధి రాజ్యాధికార సాధికారత అన్న అంశంపై బహిరంగ సభను నిర్వహించారు. దీనిలో పాల్గొన్న ఆయన రాజులంటే ప్రజా సంక్షేమం చూసేవారని అర్థం. కానీ ఈ రాజులు ప్రజలను మోసం చేసి వారి ఆస్తులను కాపాడుకోవడానికి, గిరిజనుల భూములను లాక్కోవడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. అంబేడ్కర్ పోరాట సమితి అధ్యక్షుడు సోరు సాంబయ్య మాట్లాడుతూ ఇక్కడి రాజా కాలేజ్‌ను చెరకు రైతులు ఎత్తుకున్న చందాలతో నిర్మించినదన్నారు. కానీ దీనిని ఎయిడెడ్ పేరుతో అన్ఎయిడెడ్ విభాగాన్ని కూడా కల్పించి డొనేషన్లు వసూలు చేస్తూ రాజులు అనుభవిస్తున్నారన్నారు. కాలేజ్‌లో విద్యార్హత లేని వ్యక్తిని పెట్టి ఎంతో విద్యార్హత కలిగిన మేధావులు ఆయనకు వంగి దండాలు పెట్టాల్సిన పరిస్థితి తీసుకువచ్చారన్నారు. కార్యక్రమంలో న్యాయవాది ఎస్జే విల్సన్ బాబా, గంట సురేష్, ముప్పాల నర్శింగరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆలయ అభివృద్ధికి విరాళమిచ్చిన యాచకుడు
చీపురుపల్లి: వృత్తి యాచన.. దాతృత్వంలో మాత్రం ఉన్నతం. ప్రస్తుత సమాజంలో ఎంతో మంది వద్ద రూ.కోట్లు ఉండొచ్చు కానీ.. దాతృత్వంలో వారు నిరుపేదలే. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని శివాలయం వద్ద ఉన్న చేబ్రోలు కామరాజు అనే యాచకుడు మాత్రం దాతృత్వంలో నంబర్ వన్ అనిపించుకుంటున్నాడు. యాచన ద్వారా సంపాదించుకున్న ఒక్కో రూపాయినీ పొదుపు చేసి నీలకంఠేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి అందజేస్తున్నాడు. భక్తులు ప్రదక్షిణ చేసుకునే సమయంలో ఎండ, వాన సమస్యలు ఎదురుకాకుండా షెల్టర్లు ఏర్పాటు చేసేందుకు మంగళవారం రూ.60 వేలు అందజేశాడు. ఇలా మూడు, నాలుగు పర్యాయాలు దాదాపు రూ.3 లక్షల వరకు గుడికి సమర్పించుకున్నాడు. గతంలో ఆలయ పరిసరాల్లో షెల్టర్ల ఏర్పాటుకు రూ.1.2 లక్షలు, రూ.70 వేలు రెండు దఫాలుగా అందజేసాడు. 20 ఏళ్లుగా అక్కడే యాచన శ్రీకాకుళం జిల్లాలోని ఒప్పంగి గ్రామానికి చెందిన కామరాజు రెండు దశాబ్దాల క్రితమే చీపురుపల్లి వచ్చేశాడు. ఇక్కడి ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయం వద్ద రోజూ యాచన చేస్తాడు. ఆలయం ఎదురుగా ఉన్న చిన్న పూరిగుడిసెలో నివసిస్తాడు. అలా బిచ్చమెత్తుకుని సంపాదించిన మొత్తాన్ని శివాలయం అభివృద్ధికే వెచ్చిస్తానని చెబుతున్నాడు. -
ప్రేమ పేరిట వంచన
ప్రేమ పేరిట బాలికను మోసం చేశాడు ఓ యువకుడు. తమకు న్యాయం చేయాలని బాలికతో పాటు తల్లి నాలుగు నెలలుగా గ్రామ పెద్దలు చుట్టూ తిరిగారు. నాలుగు రోజుల కిందట పోలీసుస్టేషన్‌కూ వెళ్లారు. అయినా న్యాయం దక్కలేదు. ఇక న్యాయం జరగదని భావించిన తల్లీకూతుళ్లు పోలీసుస్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్ప డ్డారు. ఈ సంఘటన శనివారం లక్కవరపుకోటలో కలకలం రేపింది. దీనికి సంబంధించి ఎస్ఐ కె.ప్రయోగమూర్తి, బాధితులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... లక్కవరపుకోట: మండలంలోని రేగ గ్రామానికి చెందిన బాలిక కళ్లేపల్లి గ్రామానికి చెందిన కోరాడ సాయిశంకర్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. కలిసి తిరిగారు. విషయం కాస్త బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో సాయిశంకర్‌ను నిలదీశారు. నాలుగు నెలల కిందట పెద్దల సమక్షంలో పెట్టారు. ఇరు కుటుంబాల పెద్దలను పిలిచి పంచాయతీ పెట్టారు. ప్రేమికులకు నచ్చజెప్పి పెళ్లి చేసుకోవాలని సాయిశంకర్‌కు చెప్పారు. దీనికి ప్రియుడు నిరాకరించాడు. తరువాత పలుసార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో నాలుగు రోజుల కిందట బాలిక తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. జరిగిన విషయం చెప్పి న్యాయం చేయాలని పోలీసులను కోరింది. పోలీసులు సాయిశంకర్‌తో పాటు తల్లిదండ్రులను, గ్రామ పెద్దలను స్టేషనకు రప్పించి చర్చిం చారు. అయినా సాయిశంకర్ నిరాకరించాడు. కేసులొద్దు... తనకు సాయిశంకర్‌తో పెళ్లి చేయాలని, కేసులొద్దని బాలిక పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగింది. స్పందించిన పోలీసులు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని చెప్పినా బాలిక ఫిర్యాదు చేసేందుకు నిరాకరించింది. దీంతో చేసేది లేక పోలీసులు మిన్నకుండిపోయారు. ఈ క్రమంలో శనివారం ఉదయం బాలిక తన తల్లితో పోలీసుస్టేషన్‌కు వచ్చి మరోసారి పోలీసులకు విన్నవించింది. దీంతో ఎస్ఐ, ఏఎస్ఐ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలోనే పోలీ సుస్టేషన్ వెలుపలికి వచ్చి ఇంటి నుంచి తెచ్చుకున్న పురుగుల మందును ఒక్కసారిగా తాగేశారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు విషయం చెప్పారు. తల్లీకూతుళ్లను ఆటోలో స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించినట్టు చెప్పారు. తల్లీకూతుళ్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రియుడు కోసం ఆరా... పురుగుల మందు తాగి ఎస్.కోట సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న బాలిక, తల్లి నుంచి పోలీసులు స్టేట్మెంటు రికార్డు చేశారు. ప్రియుడు సాయిశంకర్ కోసం ఆరా తీస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కౌన్సెలింగ్ చేశాం... ఈ ఘటనపై ఎస్ఐ ప్రయోగమూర్తి మాట్లాడుతూ ఇద్దరు మైనర్లు కావడంతో పలుసార్లు కౌన్సెలింగ్ చేశామని చెప్పారు. అయినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. ప్రియుడిపై ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పినా బాలిక నిరాకరించడంతో తామేమి చేయలేకపోయామని పేర్కొన్నారు. ఎస్.కోట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లీకూతుళ్లు ప్రియుడు సాయిశివశంకర్ -
బట్టబయలైన అన్నదమ్ముల విభేదాలు
ఇంట గెలవరు గానీ... రచ్చ గెలుస్తామంటూ ప్రగల్భాలు. సొంత అన్నతోనే సయోధ్య ఉండదు గానీ... జిల్లాలోనే చక్రం తిప్పాలని యత్నిస్తున్నారు. ఇదీ గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు తీరు. ఇప్పుడు ఆయనకు సొంత అన్నే రెబల్‌గా మారుతున్నారు. అక్కడి టిక్కెట్కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తమ్ముడు చేసేవన్నీ అక్రమాలేనని బాహాటంగా చెబుతున్నారు. ఇదే విషయం పార్టీ అధినేత నుంచి జిల్లా నాయకుల వరకూ అందరికీ పనిగట్టుకుని మరీ వివరిస్తున్నారు. నిష్పాక్షికంగా అక్కడ అభివృద్ధి జరగాలంటే తనకే టిక్కెటివ్వాలంటూ కోరుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుకి సొంత ఇంట్లోనే కుంపటి తయారైంది. తాను ఎమ్మెల్యే టిక్కెట్టు రేసులో ఉన్నట్టు ఎమ్మెల్యేకు స్వయానా అన్న, మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు ప్రకటించారు.. కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ పాలకవర్గం నియామకాన్న తమ్ముడు నియమిస్తే అతనికి వ్యతిరేకంగా అన్న కోర్టులో కేసు వేయించి ఇటీవల విజయం సాధించారు. ఆ ఉత్సాహంతోనే బహిరంగంగా తమ్ముడిని ఢీకొట్టడానికి సిద్ధమయ్యారు. టీడీపీలో చోటుచేసుకున్న ఈ పరిణామం జిల్లాలో హాట్ టాపిగ్గా మారింది. ఆది నుంచీ కుమ్ములాటలు 1982 నుంచి రాజకీయాల్లో ఉన్న కొండలరావు రెండుసార్లు ఎంపీపీగా, జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్‌గా, జిల్లా పార్టీ జాయింట్ సెక్రెటరీగా పనిచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గజపతినగరం ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించారు. కానీ పార్టీ అతని సోదరుడైన కె.ఎ.నాయుడికి టిక్కెట్టు ఇచ్చింది. దీంతో కొండలరావు నామినేటెడ్ పోస్ట్‌కోసం తీవ్రంగా ప్రయత్నించారు. తమ్ముడు అడ్డుతగలడంతో వారి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. కనీసం భీమసింగి సుగర్‌ఫ్యాక్టరీ చైర్మన్ పదవి అయినా ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి తెచ్చారు. దానిక్కూడా నాయుడు అడ్డుకట్ట వేశారు. వేరే పాలకవర్గాన్ని నియమించారు. తనను కాదని వేరొకరికి పదవి ఇవ్వడాన్ని తట్టుకోలేని కొండలరావు తాను తెరవెనుక ఉండి పాలకవర్గం నియామకంపై స్థానికుల చేత కోర్టులో కేసు వేయించారు. ఫలితంగా పాలకవర్గాన్ని నియమిస్తూ విడుదలైన జీఓను న్యాయస్థానం ఇటీవలే రద్దు చేసింది. తెరవెనుక ప్రయత్నాలు కొండపల్లి కొండలరావు తన తండ్రి దివంగత ఎంపీ కొండపల్లి పైడితల్లినాయుడు రెండు పర్యాయాలు ఎంపీగా చేసినప్పుడు, జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్నప్పుడు అన్నీ తానై చూసేవారు. తండ్రి మరణానంతరం కొండబాబు రెండు సార్లు ఎంపీపీగా చేశారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనంతరం జరిగిన పరిణామాల్లో మరలా సొంత గూటికి చేరారు. ఆర్థిక పరంగానూ బలాన్ని సమకూర్చుకుంటున్నారు. కొండలరావుకు విజయనగరం ట్యాంక్ బండ్ రోడ్డులో హోటల్ కొండపల్లి గ్రాండ్తో పాటు ఇరవైకి పైగా లారీలు ఉన్నాయి. గంట్యాడ మండలంలో రైస్ మిల్లులను నిర్వహిస్తున్నారు. ఇక్కడ మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడవనివ్వకుండా వారి ప్రైవేటు బస్సులనే నడిపిస్తున్నారు. పలు ప్రైవేటు విద్యా సంస్థల్లో వాటాలు ఉన్నాయి. వీటన్నిటినీ చూపించి తాను అభ్యర్థిగా సరిపోతానంటూ అధిష్టానానికి చెబుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఎ.ఎ.నాయుడు తన అన్నను పక్కన పెట్టారు. అప్పటి నుంచి కొండలరావు మండలాల్లో తనకుంటూ వర్గాలను తయారు చేసుకొని ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి పనులను సమయం వచ్చినపుడల్లా అధిష్టానానికి చేరవేస్తున్నారు. తన తమ్ముడు అవినీతిపరుడు కాబట్టి నియోజకవర్గంలో అతనికి జనం ఓట్లేసే అవకాశం లేదని చెబుతూ తాను టిక్కెట్టు పొందాలని చూస్తున్నారు. ఇంట గెలవలేని కె.ఎ.నాయుడు ఒక దశలో మంత్రి పదవికోసం ఎలా పాకులాడారన్న చర్చ ఇప్పుడు నియోజకవర్గంలో సాగుతోంది. ఎమ్మెల్యేగా పోటీచేస్తా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తానని టీడీపీ సీనియర్‌నేత గజపతినరగం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు సోదరుడు కొండపల్లి కొండలరావు (కొండబాబు) శనివారం అతని కుమారుడు కొండపల్లి శ్రీనువాస్, వసాది మాజీ ఎంపీటీసీ కె.జగన్నాథం, టీడీపీ సీనియర్ నేత గుల్లిపల్లి ఆదినారాయణలతో కలిసి జామిలో విలేకరుల సమావేశం పెట్టి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులను టీడీపీ అధిష్టానం మార్చే అవకాశం ఉందని అదే జరిగితే గజపతినగరం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీచేస్తానన్నారు. తన అభిమతాన్ని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు, జిల్లా ఇన్చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. -
తీరం వైపు దూసుకొస్తున్న పెథాయ్
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాన్ తీవ్ర వాయువేగంతో దూసుకొస్తోంది.పెథాయ్ తుపాన్ పశ్చిమ బంగాళాఖాతానికి అనుకొని కొనసాగుతోంది. మచిలీపట్నానికి తూర్పున ఆగ్నేయంగా 480 కి.మీ దూరంలోను, కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 510 కి.మీ, దూరంలో కేంద్రికృతమైంది. శ్రీహరికోటకు 280 కిలోమీటర్ల దూరంలోను, ఉత్తర వాయువ్య దిశగా గంటకు 28 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఇది మరింత బలపడి రాత్రికి తీవ్రంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపు సాయంత్రం నాటికి కాకినాడ, తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదుగాలులు వీస్తాయని అధికారులు అంచనావేస్తున్నారు. పెథాయ్ తుపాన్ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలో తాళ్లరేవు, కాజులూరు, తుని పాటు, తొణంగిలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. విశాఖ, గాజువాక, భీమునిపట్నం, పరవాడ, పెదగంట్యాడ, అచ్యుతాపురం, రాంబిలి, ఎస్. రాయవరం, పాయకరావు పేటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అదే విధంగా విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో భారీ వర్షలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గార, పలాస, మందస, సంతబొమ్మాళి, కవిటి, ఇచ్చాపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశలు ఉన్నాయని ఆధికారులు తెలిపారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన అగ్రిగోల్డ్ బాధితులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన రైతులు
-
ఏట్లాన్నవ్ బిడ్డా అంటూ పలకరిస్తూనే కన్నీరు పెట్టుకున్న తాత
-
295వ రోజు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర
-
వైఎస్ జగన్‌ను కలిసిన కుమ్మరి కులస్తులు
-
295వ రోజు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర పునఃప్రారంభం
-
వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 295వ రోజు షెడ్యూల్
-
అమ్మల దీవెనలు.. అక్కచెల్లెమ్మల ఆప్యాయతలు
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాజన్న బిడ్డను చూశామన్న ఆనందం పట్టలేని అమ్మలు.. కష్టాలు చెప్పుకొని ఊరట పొందిన అవ్వలు.. ఆత్మీయ పలకరింపుతో ఉబ్బితబ్బిబ్బయిన అక్కచెల్లెమ్మలు.. ఇలా జననేత అడుగులో అడుగులేసేందుకు మహిళాలోకం కదిలి వచ్చింది. చెట్లు, పుట్టలు.. ఇరుకుదారులు.. వీధులు.. ఇలా ఎక్కడ చూసినా అక్కచెల్లెమ్మలే కనిపించారు. దారి పొడవునా హారతులు పట్టారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 279వ రోజు శనివారం మహిళా ప్రభంజనాన్నే సృష్టించింది. మూలస్టేషన్ మొదలుకుని.. ఎస్ఎస్ఆర్ పేట, సోలుపు క్రాస్, మన్యపురిపేట, బెల్లంపేట, వల్లాపురం క్రాస్ వరకూ అక్కచెల్లెమ్మలు వేలాదిగా ఆయన వెన్నంటి నడిచారు. కాళ్లకు గజ్జ కట్టారు. కోలాటమాడుతూ ఆనందంతో చిందులేశారు. గుంపులుగా గుమిగూడి పాటలు పాడారు. పల్లెటూరి ఆటలాడారు. రాజన్న బిడ్డ కోసం గంటల తరబడి ఎండలో నిరీక్షించారు. చెమటలు కక్కుతున్నా కొంగులతో తుడుచుకుంటూ.. జననేతకు తమ కష్టాలు చెప్పుకొనేందుకు బారులు తీరారు. నవరత్నాల గురించి చర్చించుకుంటూ.. చంద్రబాబు మోసాలపై విరుచుకుపడ్డారు. నా మనవడితో మాట్లాడినట్టుంది తనకోసం తరలివచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే ప్రయత్నం చేశారు జగన్. వారి కష్టాలు వింటూ.. త్వరలో మనందరికీ మంచి జరుగుతుందంటూ భరోసా ఇచ్చారు. పింఛన్లు ఇవ్వడం లేదయ్యా.. పేదోళ్లం ఎలా బతకాలయ్యా.. అని కన్నీళ్లు పెట్టుకున్న అవ్వలను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ‘నా మనవడితో మాట్లాడినట్టుంది.. ఎంత ఓపిగ్గా నా కష్టాలు విన్నాడో బాబు.. ఎంతలా ధైర్యం చెప్పాడో’ అంటూ బెల్లంపేటకు చెందిన 70 ఏళ్ల అవ్వ కాళమ్మ తెలిపింది. చిన్నారులను చంకనెత్తుకుని పరుగులు పెడుతూ.. ఆయాస పడుతూ వచ్చినప్పుడు చిరునవ్వుతో ఆ చిన్నారుల్ని జగనన్న ఆత్మీయంగా పలకరిస్తున్నారని మూల స్టేషన్ వద్ద చిన్నారిని తీసుకొచ్చిన ఈశ్వరమ్మ చెప్పింది. జగనన్న పలకరింపులో ఆప్యాయత.. ఊరడింపులో ఆత్మీయత కనిపిస్తున్నాయంటూ అక్కచెల్లెమ్మలు చెమర్చిన కళ్లతో చెప్పారు. ‘అన్నా.. సెల్ఫీ.. అని కోరితే.. ‘రామ్మా’ అంటూ అన్నే సెల్‌ఫోన్‌తో ఫొటో తీశారు.. నిజంగా ఇది మాకో స్వీట్ మెమొరీ..’ అంటూ బీటెక్ విద్యార్థిని శుశృత పట్టరాని సంతోషంతో చెప్పింది. హోదా వచ్చి ఉంటే మీ కౌశిక్‌కు ఉద్యోగం వచ్చేదే.. తెలంగాణ రాజకీయాలపై ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. ముఖ్యంగా మహిళలు కేసీఆర్ మాటలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. చీపురుపల్లి దారిలో జగన్ కోసం గుమిగూడిన మహిళలు చంద్రబాబు వైఖరిపై చర్చించుకున్నారు. ‘దొంగ.. ద్రోహి.. వంచకుడు.. మోసగాడు.. అని కేసీఆర్ తిడుతుంటే ఈ చంద్రబాబుకు సిగ్గు కూడా లేదు’ అంటూ మజ్జి శారద అన్న మాటలకు ‘అవును’ అంటూ అపూర్వ, లక్ష్మి, వసంత స్పందించారు. దాదాపు పావుగంట పాటు ఈ చర్చ సాగింది. ఓటుకు కోట్లు కేసులోనే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి.. ఇక్కడా ప్రజల్ని మోసం చేస్తున్నాడు.. కేసుల నుంచి బయట పడేందుకు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు.. అంటూ చర్చించుకున్నారు. ‘హోదా వచ్చుంటే మీ కౌశిక్‌కు ఉద్యోగం వచ్చేదే’ అంటూ వసంత తన పక్కనే ఉన్న లక్ష్మితో అంది. ‘ఈసారి చంద్రబాబుకు శంకరగిరి మాన్యాలే.. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పి మాయ చేసిన బాబును మన ఆడోళ్లే ఓడించాల’ అంటూ శారద చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా అవునంటూ ప్రతిస్పందించారు. ఈ పాలనలో అధ్వాన పరిస్థితులు పాదయాత్ర మార్గంలో వివిధ వర్గాల ప్రజలు వైఎస్ జగన్‌ను కలిసి తమ కష్టాలు చెప్పుకొన్నారు. 16 మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారని, ప్రిన్సిపాల్‌తో పాటు నలుగురు స్కూల్ అసిస్టెంట్లను డెప్యుటేషన్‌పై నియమించే అధ్వాన పరిస్థితులు ఈ పాలనలో ఉన్నాయంటూ విజయనగరం డైట్ సెంటర్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 13 డైట్ సెంటర్లలో 1.20 లక్షల మంది విద్యార్థులకూ కష్టాలేనన్నా.. అంటూ వాపోయారు. తమతో చాకిరీ చేయించుకుని ఉద్యోగాల్లోంచి తొలగించారన్నా అంటూ సాక్షరభారత్ వీసీవోలు జననేత ఎదుట బావురుమన్నారు. వంద శాతం వైకల్యం ఉన్నా పింఛన్ ఇవ్వడం లేదంటూ చింతాడ అప్పారావు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా వృద్ధాప్య పింఛన్ ఇవ్వడం లేదని మన్యపురి పేటకు చెందిన మామిడి తౌడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. జన్మభూమి కమిటీల అవినీతికి అంతే లేకుండా పోయిందంటూ పలువురు జననేత దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు పాలనలో పేదలకు అన్యాయం జరుగుతోందని, ఆరోగ్యశ్రీ వర్తించలేదని, డ్వాక్రా రుణమాఫీ పేరుతో మోసం చేశారని.. ఇలా పలువురు తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జగన్.. మనందరి ప్రభుత్వం రాగానే అందరి కష్టాలు తీరతాయని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. మేం ఎలా బతకాలన్నా? అన్నా.. సాక్షరభారత్లో వీసీవోగా పనిచేశాం. మమ్మల్ని ఈ చంద్రబాబు అర్థంతరంగా తొలగించారన్నా. రూ.2 వేల గౌరవ వేతనం ఉందని ఉపాధి పనికి కూడా వెళ్లనీయకుండా జాబ్కార్డులూ తీసేశారు. మరుగుదొడ్ల నిర్మాణం, పింఛన్ల పంపిణీ వంటి పనులు మాతో చేయించుకున్నారు. మమ్మల్ని తొలగించినట్టు కూడా చెప్పకుండా నవనిర్మాణ దీక్షలో మాతో చాకిరీచేయించుకున్నాక చెప్పారన్నా.. అటు ఉద్యోగమూ లేక, ఉపాధి పనులకు వెళదామంటే జాబు కార్డు కూడా లేక.. మేం ఎలా బతకాలన్నా? వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు మా తడాఖా ఏంటో చూపిస్తాం.. – జమ్ము లక్ష్మి, వీసీవో, గరుగుబిల్లి, మెరకముడిదాం మండలం రాజన్న దయ వల్లే నా బిడ్డ చదివాడు.. పక్షవాతం వచ్చిన నాకు ఆరోగ్య శ్రీ కింద ఈ ప్రభుత్వం వైద్యం చేయడం లేదు. నెలకు రూ.10 వేలు అప్పు చేసి మరీ ప్రైవేటు ఆస్పత్రిలో మందులు వాడుతున్నా. నా కుమారుడు సీతారాం రాజన్న ఫీయిరీయింబర్స్మెంట్ పుణ్యమాని డీఎడ్ చదువుకున్నాడు. బాబు వస్తే జాబు వస్తుందనుకున్నాం. కానీ అటువంటిదేం ఉండదని అర్థమైంది. మీరు ముఖ్యమంత్రి అయ్యాకే మాలాంటి వారికి మేలు జరుగుతుందని నమ్ముతున్నామయ్యా.. – బంకలపిల్లి జోగులు, ఎస్ఎస్ఆర్ పేట, గుర్ల మండలం ఆశలన్నీ మీపైనే.. నా భర్త పదిహేనేళ్ల కిందట చనిపోయాడు. నా కుమార్తెకు ముగ్గురు ఆడపిల్లలు. మాకు ఏ ఆధారమూ లేదు. పూట గడవడం చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారమూ అందడం లేదు. మీరు ముఖ్యమంత్రి అయ్యాక.. ఏ ఆసరా లేని మా లాంటి పేదోళ్ల కోసం ఏదన్నా చేయండయ్యా.. మీ మీదే ఆశలు పెట్టుకున్నామయ్యా.. – చందక పిచ్చి పైడితల్లి, రాయవలస, మెరకముడిదాం మండలం -
ఏదిక్కూ లేని వీరికి ఆధారాలు ఇవ్వండన్న
-
ఎయిడ్స్ నియంత్రణ సంస్థలో ‘ఆకలి కేకలు’..!
విజయనగరం ఫోర్ట్ : జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారు. మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ పరిధిలో 13 ఐసీటీసీ సెంటర్లు ఉన్నాయి. ఇందులో 13 మంది కౌన్సిలర్లు, 11 మంది ల్యాబ్ టెక్నీషియన్లు కాం ట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కార్యాలయంలో మరో నలుగురు, విజయనగరం, పార్వతీపురంలలో రెండు ఏఆర్టీ కేంద్రాల్లో 16 మంది పనిచేస్తున్నారు. జిల్లాలో బొబ్బిలి, సాలూరు, చీపురుపల్లి, ఎస్.కోటల్లో నా లుగు లింక్ ఏఆర్టీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో నలుగురు స్టాఫ్ నర్సులు, బ్లడ్‌బ్యాంక్‌లో ఆరుగురు ల్యాబ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. వీరిందరికీ మార్చి నెల నుంచి జీతాలు అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. విద్యాసంవత్సరం ఆరంభం కావడంతో పిల్లల ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్స్ వంటివి కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ పోషణకు అప్పుచేయాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధులకు హాజరయ్యేందుకు రవాణా చార్జీలు కూడా లేక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. విధులు నిర్వర్తిస్తున్నా... ఐసీటీసీ సెంటర్లలో రోగులకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తారు. హెచ్ఐవీ నిర్ధారణ అయినవారికి కౌన్సెలింగ్ ఇస్తారు. ఏఆర్టీ కేంద్రంలో రోగులకు సీడీఫోర్ పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారు. తీసుకోవాల్సి ఆహారం, జాగ్రత్తలు గురించి కౌన్సిలింగ్ ఇస్తారు. లింక్ ఎఆర్టీ కేంద్రంలో రోగులకు మందులు అందజేస్తారు. బ్లడ్‌బ్యాంక్‌లో బ్లడ్ క్రాస్ మేచింగ్, రక్తానికి హెచ్‌బీఎస్‌ఏజీ, హెచ్ఐవీ వంటి పరీక్షలు నిర్వహిస్తారు. జీతాలు అందకపోవడం వాస్తవమే... జిల్లాఎయిడ్స్ నియంత్రణ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు చెల్లిం చని మాట వాస్తవమే. దీనిపై ఉన్నతాధికారుల ను ప్రశ్నిస్తే ప్రోసెస్‌లో ఉందని చెబుతున్నారు. – జె.రవికుమార్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి -
సాక్షిగా నేను నిలబడతా
విజయనగరం మున్సిపాలిటీ : సాక్షిగా నేను నిలబడతా, కౌన్సిల్‌కు దమ్ముంటే ఇప్పటి వరకు నేను ఇచ్చిన డిసెంట్ నోట్లపై విచారణ జరిపించండి. పాలకవర్గం, అధికార యంత్రాంగం చేస్తున్న అవినీతి నిజాలు నిగ్గు తేలుతాయని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి చెందిన సీనియర్ కౌన్సిలర్ ఎస్వీవీ రాజేష్ సవాల్ విసిరారు. గురువారం మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశం వాడీవేడీగా సాగింది. అజెండాలోని 23 అంశం చర్చకు వచ్చిన సమయంలో గ్రాడ్యుయేటెడ్ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్స్ను 12 నెలల కాలపరిమితికి నియమించుకోవడంపై రాజేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ చైర్మన్‌కు ఆ అంశాన్ని వ్యతిరేకిస్తూ డీసెంట్ నోట్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ మొత్తం 12 మంది ఇన్స్పెక్టర్ల నియామకాల్లో అవతవకలు చోటు చేసుకున్నాయని, డబ్బులు తీసుకుని నియామకాలు చెపట్టారని ఆరోపించారు. వారిని పంపిణీ చేసే విశాఖకు చెందిన సినెర్జీ ఎంటర్ప్రైజెస్ సంస్థ స్వయానా మున్సిపల్ ఇంజినీర్ రాజేంద్రకృష్ణ బినామీ సంస్థగా పేర్కొన్నారు. ఈ నియామకాల ద్వారా అవకతవకలు చోటు చేసుకోవడంతో పాటు భవిష్యత్‌లో భారీ అవినీతి చోటు చేసుకునే అవకాశం ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు. నకమహాలక్ష్మి ఇన్చార్జి కమిషనర్‌గా ఉన్న సమయంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని పట్టణంలో అభివృద్ధి స్తంభించటానికి బినామీలే కారణమంటూ తూర్పరబట్టారు. ప్రతిపక్షం డిసెంట్ నోట్ ఇవ్వడంపై స్పందించిన అధికార పార్టీ కౌన్సిలర్లు కేవలం అధికారులను బెదిరించేందుకు ఇలాంటి నోట్ ఇస్తున్నారని మాటల దాడికి దిగడంతో స్పందించిన ప్రతిపక్ష కౌన్సిలర్ ధీటుగా సమాధానమిచ్చారు. తాను ఇప్పటి వరకు ఇచ్చిన డీసెంట్ నోట్లపై విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. ఇంజినీరింగ్ అధికారులపై విరుచుకుపడ్డ కౌన్సిల్.. మున్సిపాలిటీని ప్రగతి పథంలో నడిపించాల్సిన ఇంజినీరింగ్ అధికారుల తీరుపై గురువారం మున్సిపల్ కౌన్సిల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నెలల తరబడి వీధి దీపాలు వెలగకున్నా కుంటి సాకులతో నెట్టుకురావడంపై 21వ వార్డు కౌన్సిలర్ గేదెల ఆదినారాయణ ఆగ్రహంతో ఊగిపోయారు. రూ.200లకే మంచి నీటి కుళాయిల మంజూరుపై మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మండిపడ్డారు. ఈ సమయంలో మున్సిపల్ ఇంజినీర్ రాజేంద్రకృష్ణ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా, చైర్మన్ అవసరం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ అధికారుల తీరుతో కౌన్సిలర్లు తలదించుకోవాల్సి వస్తోంది. లొసుగులు లేకుంటే టెండర్లను కౌన్సిల్‌కు చూపడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఏసీ సంతకాలు చేసిన టెండర్లను కౌన్సిల్లో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. అసలు మున్సిపాలిటీలో ఏపీఎండీపీ స్కీం, అమృత్ స్కీంల అమలుపై అవగాహన ఉందా అంటూ ప్రశ్నించారు. ఇంజినీరింగ్ అధికారుల నిర్వాకంతో అభివృద్ధి పనుల్లో జాప్యం చోటు చేసుకుంటుందని, నిధులు వినియోగంలో నిర్లక్ష్యం వహించడంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మంజూరైన కోట్లాది నిధులు వెనక్కి మళ్లిపోయే పరిస్థితి దాపురించిందని ఇలా అయితే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఎప్పటికి జరుగుతుందని 1వ వార్డు కౌన్సిలర్ సోము స్రవంతి ప్రశ్నించారు. స్వయానా జిల్లా కలెక్టర్ వార్డుల్లో పర్యటించడం చూస్తుంటే కౌన్సిల్ పనితనం ఏంటో ప్రజలకు సందేశం వెళ్లిపోయిందని, మున్సిపాలిటీలో అధికారులు పని చేస్తున్నారా అంటూ 24వ వార్డు కౌన్సిలర్ రొంగలి రామారావు నిలదీశారు. సమావేశంలో లైటింగ్ సమస్యపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ టి.వేణుగోపాలరావు మాట్లాడుతూ రానున్న రెండు మూడు రోజుల్లో శతశాతం వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్, అసిస్టెంట్ కమిషనర్ కె.కనకమహాలక్ష్మి, ఇతర కౌన్సిల్ సభ్యులు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
పుట్టెడు దుఃఖంలోనూ..
విజయనగరంఅర్బన్ : తండ్రిని కోల్పోయిన సమయంలోనే ఇంటర్ వార్షిక పరీక్షలు రాసింది. ఆ వెంటనే నీట్ పరీక్షలు రాసింది. ఏ మాత్రం మానసిక ధైర్యాన్ని కోల్పోలేదు. పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షలు రాసి నీట్లో మంచి ర్యాంక్ సాధించి శషభాష్ అనిపించుకుంది గంట్యాడ మండలం రేగుబిల్లికి చెందిన చప్ప జ్యోత్స్న. విద్యార్థిని తండ్రి రామకృష్ణ జామి మండలం కొట్టాం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. జ్యోత్స్య ఇంటర్ పరీక్షలు రాస్తున్న సమయంలోనే గుండెపోటుతో ఆయన మృతి చెందారు. తండ్రిని కోల్పోయినా అతని ఆశయాన్ని బతికించాలనే లక్ష్యంతో కష్టపడి చదివిన జ్యోత్స్న నీట్లో రాష్ట్రస్థాయిలో 322వ ర్యాంక్ (జాతీయ స్థాయిలో 5,817) సాధించింది. ఈ సందర్భంగా జ్యోత్స్న మాట్లాడుతూ, తండ్రి ఆశయం మేరకు డాక్టర్‌గా స్థిరపడతానని తెలిపింది. -
‘ఉద్యోగాలను అమ్మేస్తున్నారు’∙
సాలూరు : కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను అధికార పార్టీ నాయకులు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర విమర్శించారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు మంగళవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ ఎన్నికల ముందు టీడీపీ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్నారని, అధికారం చేపట్టాక పలువురికి అన్యాయం చేశారన్నారు. ఇప్పుడేమో ఏకంగా కాంట్రాక్టు కార్మికులను కాంట్రాక్టర్‌కు అప్పగించాలని చూస్తుండడం దారుణమన్నారు. డబ్బులు తీసుకోకుండా ఒక్కరికీ ఉద్యోగం కల్పించడంలేదన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం రానుందని, అప్పుడు తప్పకుండా అర్హులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. జీఓ 279ను రద్దుచేయాలని చేస్తోన్న పోరాటాన్ని కార్మికులు ధైర్యంగా కొనసాగించాలని సూచించారు. కార్మికులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్మికులకు మద్దతు తెలిపినవారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు జరజాపు ఈశ్వరరావు, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగపండు అప్పలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు సువ్వాడ రమణ, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ గిరి రఘు, మాజీ కౌన్సిలర్ రామకృష్ణ ఉన్నారు. -
వేప కొమ్మల కోసం....
నెల్లిమర్ల రూరల్ : మండలంలో బొప్పడాం ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు వేపకొమ్మల కోసం పాఠశాలలో చదువుతున్న చిన్నారిని ప్రమాదకరంగా చెట్టు ఎక్కించారు. ఆ విద్యార్థి చెట్టునైతే ఎక్కగలిగాడు గానీ దిగేసరికి ఆపసోపాలు పడ్డాడు. ఈ దృశ్యం సాక్షి కెమోరాకు సోమవారం చిక్కింది. కార్పొరేట్‌కు పోటీగా ప్రభుత్వ విద్యను అందిస్తున్నామని ఓ వైపు చెబుతున్న ప్రభుత్వం పాఠశాలలో పిల్లలతో అంత పెద్ద వృక్షాన్ని కేవలం వేపకొమ్మల కోసం ఎక్కించడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రమాదవశాత్తు ఆ విద్యార్థి అదుపు తప్పితే బాధ్యత ఎవరు వహిస్తారు? బొప్పడాం ప్రధాన రహదారి పక్కన పాఠశాల ఉండటంతో పలువురు ఈ దృశ్యాన్ని చూశారు. సంబంధిత ఉపాధ్యాయుడిని సాక్షి వివరణ కోరగా పాఠశాలలో బియ్యం పాడవ్వకుండా ఉండేందుకు వేపకొమ్మలను తీసుకురమ్మని విద్యార్థికి చెప్పానని తప్పుగా అర్థం చేసుకోవద్దన్నారు. -
తస్మాత్ జాగ్రత్త..
విజయనగరం టౌన్ : వేసవి వచ్చిందంటే చాలు చాలామంది చల్లని గాలి కోసం ఇంటి బయట, డాబాలపై పడుకుంటారు. దీన్ని అదునుగా చేసుకుని దొంగలు తమ చేతులకు పని చెబుతుంటారు. ప్రధానంగా వేసవిలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. దొంగతనాలను నివారించాలంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. సాధారణ దొంగలతో పాటు ఇతర రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ ప్రాంతాలకు చెందిన పలువురు వ్యాపారాల పేరుతో జిల్లాకు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా పగలు ఇళ్లను పరిశీలించి రాత్రులు దొంగతనాలు చేస్తుంటారు. ప్రధానంగా పట్టణ శివారు ప్రాంతాలు, ఇళ్లకు తాళం వేసిన ఇళ్లు, మహిళలున్న ఇళ్లనే టార్గెట్ చేస్తుంటారు. వీరితో పాటు పార్థి గ్యాంగ్ విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. దొంగతనాలకు పాల్పడే విధానాలు అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లే వారిపై దాడి చేసి నగలు దోచుకోవడం.. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో ఇళ్లల్లో మూకుమ్మడి దొంగతనాలు చేస్తారు. శరీరానికి ఒండ్రు మట్టి లేదా నూనె రాసుకుని మరీ ఇళ్లలోకి ప్రవేశిస్తారు. పట్టుకోవాలన్నా అంత సులువుగా దొరకరు. పగలు బిచ్చగాళ్లు లేదా కూలీలుగా నటిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లల్లో రాత్రులు దొంగతనాలకు పాల్పడతారు. కిటికీలు, తలుపులను బలవంతంగా తెరవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఆ సమయంలో ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై దాడి కూడా చేస్తారు.వీరి వద్ద కత్తులు, రాడ్లు, తుపాకులు కూడా ఉంటాయి. వీరు ఆలయాలను కూడా టార్గెట్ చేస్తారు. ఇతర రాష్ట్రాల తెగలు ఫాసే పార్థి అనే తెగకు చెందిన వారు మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో ఎక్కువగా దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఇటీవల కాలంలో చిత్తూరు పోలీసులు వివిధ కాలనీల్లోని సీసీ పుటేజీలు పరిశీలించగా పార్థి గ్యాంగ్‌కు సంబంధించిన కదలికలు లభ్యమయ్యాయి. దీంతో అప్రమత్తమైన చిత్తూరు సీసీఎస్ పోలీసులు గ్యాంగ్‌ను పట్టుకునేందుకు గాలింపు మొదలు పెట్టారు. ఈ తెగకు చెందిన వారు 1999 నుంచి ఉత్తరఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో దోపీడీలు చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడే దొంగతనాలకు చెక్ పెట్టవచ్చు. ఉత్తరాంధ్రలో పార్థి, తెడ్డి గ్యాంగ్‌ల సంచరిస్తున్నట్లు అనుమానాలున్నాయి. దువ్వెనలు, ఫ్యాన్సీ వస్తువులు అమ్ముతున్నట్లు వచ్చి ఇళ్లను పరిశీలిస్తుంటారు. దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టిమ్‌ను ప్రవేశపెట్టింది. ప్రజలెవరైనా ఊళ్లు వెళితే సమీప పోలీస్ స్టేషన్లో తెలియజేయాలి. అపరిచిత వ్యక్తులు కనబడితే 100కు సమాచారం ఇవ్వాలి. –ఏఎస్ చక్రవర్తి, సీసీఎస్ డీఎస్పీ, విజయనగరం -
సిలిండర్ పేలి పూరిళ్లు దగ్ధం
నెల్లిమర్ల: నగర పంచాయతీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో శుక్రవారం మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. దీనికి సంబంధించి స్థానికులు అందించిన వివరాలు...పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జికి సమీపంలోనున్న ఓ పూరింట్లో ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో పక్కపక్కనే ఉన్న ఇట్లా అప్పారావు, ఇట్లా అప్పలనర్సమ్మ, ఇట్లా రమణలకు చెందిన మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. అప్పారావు కుమార్తెకు తాజాగా వివాహం నిశ్చయమైంది. పెళ్లి ఖర్చుల నిమిత్తం అప్పు చేసిన నగదు రూ. 75 వేలు, మూడు తులాల బంగారం ఈ ప్రమాదంలో కాలి బూడిదైంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో నిత్యావసరాలు సైతం కాలిపోయాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఇదిలా ఉంటే అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే ఫోన్ చేసినప్పటికీ ఫైర్ ఇంజన్ రావడం ఆలస్యమైంది. దీంతో వాహనం వచ్చేసరికి పూర్తిగా కాలిపోయాయి. రెవెన్యూ అధికారులు ప్రమాద స్థలానికి వచ్చి ఆస్తి నష్టం అంచనా వేశారు. రూ.5లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్టు ప్రాథమిక అంచనా. -
వేధింపులు భరించలేక అటెండర్ ఆత్మహత్యాయత్నం
విజయనగరం ఫోర్ట్: వార్డెన్ వేధింపులు భరించలేక ఓ అటెండర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలం సీతారామునిపేటకు చెందిన లెంక అనసూర్య (29) పట్టణంలోని దాసన్నపేట రైతుబజార్ సమీపంలో ఉన్న ఎస్సీ హాస్టల్లో అటెండర్‌గా పనిచేస్తోంది. 2016లో అనసూర్య జాయిన్ అయినప్పటి నుంచి వార్డెన్ రాణి ఆమెను వివిధ రకాలుగా వేధిస్తోంది. పరిస్థితి మరీ దారుణంగా తయారుకావడంతో అనసూర్య బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హాస్టల్లోనే చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే హాస్టల్ సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం కేంద్రాస్పత్రికి తరలించారు. ఆమె బంధువుల ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
న్యాయం కోసం మృతదేహంతో ఆందోళన
మక్కువ: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ముందు రహదారిపై న్యాయం కోసం మృతదేహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చేసిన సంఘటన మంగళవారం చోటు చేసుకొంది. తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించడంతో డీఎస్పీ సౌమ్యలత వచ్చి వారిని శాంతింపజేశారు. చివరకు మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శాంతించారు. వివరాల్లోకి వెళ్తే...మండలంలోని సరాయివలస గ్రామానికి చెందిన గులిపల్లి సన్యాసినాయుడు ఈ నెల 5న గ్రామ సమీపంలోని వెంగళరాయసాగర్ కాలువ నుంచి తమ పంట పొలానికి నీరు కట్టేందుకు వెళ్లాడు. తరువాత కనిపించని సన్యాసినాయుడు ఈ నెల 9న విగతజీవుడై కనిపించిన విషయం పాఠకులకు విదితమే. దీనిపై ఎస్ఐ వెలమల ప్రసాదు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మంగళవారం సాలూరు సీహెచ్‌సీకి పోస్టుమార్టం కోసం తరలించారు. తరువాత సాలూరు నుంచి సరాయివలస తీసుకువచ్చారు. అనుమానంతోనే... అంతా జరిగిన తరువాత సన్యాసినాయుడు మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. కాలువలో మృతదేహం బొర్లా పడి ఉండడంతో కుటుంబ సభ్యులు హత్యకు గురై ఉంటాడని అనుమానిస్తున్నారు. దీంతో మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చిన సమయంలో పోస్టుమార్టం నివేదికలో గాయాల్లేవని, కేసు మూసి వేస్తారన్న అనుమానంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహించి పోలీస్‌స్టేషన్ వద్దకు మృతదేహంతో తరలివచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్ వద్దే ఆటోలో ఉంచి మిగతా వారంతా పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. నిందితులను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. ఈ క్రమంలో పోలీసులకు, మృతుని కుటుంబ సభ్యులకు మధ్య వాదులాట చోటు చేసుకొంది. ఎస్ఐ న్యాయం చేస్తామని చెప్పినా వినకపోవడంతో బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత, సీఐ సయ్యద్ మహ్మద్ మక్కువ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించి వెనుదిరిగారు. పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయించిన ఆందోళనకారులతో మాట్లాడుతున్న సీఐ మహమ్మద్ -
పోలీసుల సమక్షంలో ఏకమైన ప్రేమికులు
సాలూరురూరల్(పాచిపెంట): ఓ ప్రేమ జంట పోలీసుల సమక్షంలో ఏకమైంది. ఏడాదిన్నర కాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లికి అబ్బాయి తరపు వాళ్లు అడ్డుపడి, వేరే అమ్మాయితో పెళ్లికి ముహుర్తం కూడా తీసేశారు. విషయం తెలుసుకున్న అమ్మాయి స్థానికంగా ఉన్న స్ఫూర్తి మహిళా మండలి సభ్యులను ఆశ్రయించారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇద్దరు ప్రేమపక్షుల పెళ్లి జరిగింది. ఎస్టీ,ఎస్సీ సెల్ డీఎస్పీ గురుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం..పాచిపెంట మండలం పి.కోనవలస పంచాయతీ గంగందొరవలస గ్రామానికి చెందిన పండిక వరలక్ష్మీ అనే అమ్మాయి, అదే మండలం గడివలస గ్రామానికి చెందిన బెవర భానుప్రకాశ్ అనే వ్యక్తి ఏడాదిన్నరగా ప్రేమించుకున్నారు. అమ్మాయి ఎస్టీ, అబ్బాయి బీసీ సామాజిక వర్గాలకు చెందినవారు. విషయం తెలుసుకున్న అబ్బాయి తల్లిదండ్రులు వేరే పెళ్లికి సిద్ధమవడంతో అమ్మాయి. స్థానిక స్ఫూర్తి మహిళా మండల అధ్యక్షురాలు బలగ రాధను ఆశ్రయించారు. ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సన్యాసినాయుడు ఇరువర్గాల పెద్దలను స్టేషన్‌కు పిలిపించారు. అబ్బాయి తరపు వాళ్లు అంగీకరించనప్పటికీ ఇద్దరు మేజర్లు కావడంతో తొలుత అమ్మాయి ఇంటి వద్ద గంగందొరవలసలో వివాహం చేసి, తర్వాత సాలూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు చేయించారు. -
నేస్తానికి కష్టకాలం
విజయనగరం పూల్‌భాగ్: ఆలీవ్ రిడ్లే తాబేళ్లు.. సముద్ర తాబేళ్లుగా పేరొందిన వీటికి పర్యావరణ నేస్తాలు అని పిలుస్తుంటారు. తీర ప్రాంతంలో పరిశ్రమలు అధికం కావడం, సముద్రంలో పెద్దబోట్లు తిరుగుతుండడంతో వీటి మనుగడే కష్టంగా మారింది. అలాంటి సమయంలో అటవీశాఖ వన్యప్రాణి విభాగం అధికారులు తాబేళ్ల సంరక్షణకు శ్రీకారం చుట్టారు. పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐదేళ్ల కాలంలో 1,52,232 గుడ్లను సేకరించారు. 1,22,658 తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదిలారు. జిల్లాలోని సముద్రతీరం వెంబడి 2014లో విజయనగరం అటవీశాఖ వన్యప్రాణి విభాగం వారు భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని 28 కిలోమీటర్లు సముద్రతీరంలో 10 ఆలివ్‌రిడ్లే తాబేళ్ల పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెంపకం ఎలా అంటే..? ఏటా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో సముద్రంలోని తల్లి తాబేళ్లు తీరానికి చేరుకుని గుడ్లు పెడతాయి. వీటిని నక్కలు, అడవి పందులు తినేయకుండా అటవీ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. తాబేళ్ల పునరుత్పత్తికి ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటుందో ముందుగా గుర్తించి, అక్కడ మినీ హేచరీ ఏర్పాటు చేసి అందులో రెండు నుంచి మూడు అడుగుల సైజు గుంతలు తవ్వి గుడ్లు ఉంచుతారు. గుంతల్లో పొదిగిన గుడ్లు నుంచి పిల్లలు బయటకు వచ్చేందుకు 45 రోజుల నుంచి 60 రోజుల సమయం పడుతుంది. డిసెంబర్ నుంచి జూన్ వరకు ఉత్పత్తి కేంద్రాల ద్వారా తాబేళ్లను అభివృద్ధి చేస్తారు. ఈ ప్రక్రియలో ట్రీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సహకరిస్తోంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెట్టిన గుడ్లను సురక్షిత ప్రాంతాల్లో ఉంచి 20 మంది కాపలాదారులను నియమించారు. చంపినా, తిన్నా నేరమే.. తాబేళ్లను వేటాడి చంపినా, వాటి గుడ్లను తిన్నా వన్యప్రాణి సంరక్షణ చట్టం – 1972 కింద నేరంగా పరిగణిస్తారు. మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఇవి గుడ్లు పెట్టే సమయంలో తీరం వెంబడి 500 మీటర్ల పరిధిలో పర్యావరణానికి హాని కలిగించే పనులు చేపట్టకూడదు. భారత ప్రభుత్వం ఈ తాబేళ్ల చట్టం పరిధిలో షెడ్యూల్–1ను చేర్చింది. ఎంత సాయమంటే..? తాబేళ్లు సముద్రంలోని పాచి, మొక్కలు, వివిధ రకాల వ్యర్థ పదార్థాలను తింటూ జలాలు కలుషితం కాకుండా చేస్తాయి. దీంతో తీర ప్రాంతాల్లో నివశించే ప్రజలకు సముద్రపు గాలి సోకడం వల్ల అంటు వ్యాధులు రావని అధికారులు చెబుతున్నారు. సముద్రంలో ఆక్సిజన్ పెంచేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. అడ్డదిడ్డంగా ఉండే సీ గ్రాస్‌ను తాబేళ్లు తినడంతో సీ గ్రాస్ బెడ్ ఏర్పడుతుంది. దీంతో సముద్రంలో ఉన్న జీవరాశులు బెడ్‌పై గుడ్లు పెట్టి సంతాన ఉత్పత్తిని చేస్తాయి. దీంతో మత్స్య సంపద పెరుగుతుంది. ఇదీ ప్రత్యేకత.. ఆలివ్ రిడ్లే తాబేలు సుమారు 45 కిలోల బరువు, మూడడుగుల పొడవు, ఒకటిన్నర అడుగు వెడల్పు ఉంటుంది. పుట్టిన పిల్ల మూడు సెంటీమీటర్లు పొడవు, అరంగులం వెడల్పు ఉంటుంది. ఆడ తాబేలు ఒడ్డుకు వచ్చి 60 నుంచి 150 గుడ్లు వరకు పెడుతుంది. మగ తాబేలు 25–30 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆడ తాబేలు 30–32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే బయటకు వస్తాయి. ఆడ తాబేలు పిల్లలుగా ఉన్నప్పుడు ఏ తీరం నుంచి సముద్రతీరంలోకి వెళతాయో పెద్దయ్యాక అదే తీరానికి వచ్చి గుడ్లు పెట్టడం ప్రత్యేకత. తాబేలు 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవిస్తాయి. అధికారుల ఆదేశాలతోనే.. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆలివ్ రిడ్లే తాబేళ్లను సంరక్షించే బాధ్యత తీసుకున్నాం. వీటి వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని సముద్ర తీర ప్రాంతంలో 1,52,232 గుడ్లను సేకరించి పునరుత్పత్తి కేంద్రాల ద్వారా 1,22,658 పిల్లలను ఉత్పత్తిచేసి సముద్రంలో విడిచి పెట్టాం. బయోశాప్, కాంపా స్కీములు, బీడీఎస్(బయో డైవర్సిటీ కాంపౌండ్) ద్వారా వచ్చిన ని«ధులతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. – గంపా లక్ష్మణ్, డీఎఫ్ఓ (టెరిటోరియల్), విజయనగరం. -
ఏం తమాషా చేస్తున్నారా..!
విజయనగరం పూల్‌బాగ్/ అర్బన్: ఎస్సీ,ఎస్టీ కేసులంటే లెక్కలేదా.. అధికారులు తమాషా చేస్తున్నారా.. అని ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ మండిపడ్డారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరైనా ఎస్సీ, ఎస్టీల హక్కులకు భంగం కలిగించినా.. ఎస్సీ, ఎస్టీ నిధులు సక్రమంగా ఖర్చు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవన్నారు. ఎస్సీ,ఎస్టీ అత్యాచార బాధితులకు న్యాయం చేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా పూసపాటిరేగ మండలం ఎరుకొండలో సాంఘిక బహిష్కరణకు గురైన కుటుంబాలకు రూ.లక్ష చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు చెప్పారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఈ నెలాఖరునాటికి ఖర్చుచేసి వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ నియామకాల్లో తప్పనిసరిగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని ఆదేశించారు. జిల్లాలో ఇంకా కుల వివక్ష కొనసాగడం దారుణమన్నారు. పోలీసు యంత్రాంగం, ఎస్సీ,ఎస్టీ బాధితులకు అండగా నిలబడకపోగా వారిపైనే కేసులు పెట్టడం శోచనీయమని తెలిపారు. అనంతరం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు అమలుపరుస్తున్న కార్యక్రమాలను శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీసు, సాంఘిక సంక్షేమశాఖ, అటవీ, వ్యవసాయ, మత్య్స, పశుసంవర్థక , విద్యుత్, ఉద్యానవన, పంచాయతీరాజ్‌శాఖ, సర్వశిక్షాభియాన్ అధికారులు తమ శాఖల ప్రగతి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివేక్‌యాదవ్ మాట్లాడుతూ, జిల్లాలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకీ చర్యలు చేపట్టామన్నారు. దళిత, గిరిజన విద్యార్థులకు సకాలంలో పోస్టుమెట్రిక్, ప్రీ మెట్రిక్ ఉపకారవేతనాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్న 126 మందికి రూ.60 లక్షల వివాహ ప్రోత్సాహకాన్ని అందించామని వివరించారు. ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 6.6 శాతం నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ శోభ స్వాతిరాణి, ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు కె రాజారావు, సిరివేలు సోమ, సుధారాణి, రవీంద్ర, నరహరి వరప్రసాద్, ఎస్టీ కమిషన్ ఓఎస్డీ సుబ్బారావు, జేసీ–2 కె. నాగేశ్వరరావు, డీఆర్ఓ ఆర్ఎస్ రాజ్‌కుమార్, అడిషనల్ ఎస్పీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు జెడ్పీ కార్యాలయ ఆవరణలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి కారెం శివాజీ, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి పూలమాలలు వేసి నివాaళులర్పించారు. -
జిల్లాకు జలగండం
కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో తాగునీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉంది. దీనివల్ల తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. రైల్వే ట్రాక్ అవతల ఉన్న బోరుకు వెళ్లి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు గేటు మూసేస్తున్నారు. ఇప్పుడు నీటికోసం ఎక్కడికెళ్లాలో అర్థం కావట్లేదు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. గత నెల 29న నిర్వహించిన జిల్లా గ్రీవెన్స్‌సెల్‌కు మండల లోక్‌సత్తా అధ్యక్షుడు ఐతంశెట్టి శ్రీనివాస్, ఇతర గ్రామస్తులు అందించిన వినతి. విజయనగరం గంటస్తంభం: తాగునీటికి ఒకప్పుడు బావులపై ఆధారపడే వారు. ఇప్పుడు బోర్లపై ఆధారపడుతున్నారు. జిల్లాలో ప్రతి గ్రామంలో బోర్లున్నా తాగునీటికి ఇబ్బందులు తప్పట్లేదు. ఉన్న బోర్లలో కొన్ని పనిచేయక దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తుంటే... మరికొన్ని బోర్లనుంచి వచ్చే నీరు తాగేందుకు పనికిరావట్లేదు. ఇలాంటి పరిస్థితి ఉన్న చోట శాశ్వత తాగునీటికి రక్షిత మంచినీటి పథకాలే అనివార్యం. జిల్లాలో అన్ని గ్రామాలకు రక్షిత తాగునీరు అందడంలేదు. 30శాతం గ్రామాలకు అసలు రక్షిత మంచినీటి పథకాలే లేవు. గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. పథకాలు ఉన్నచోట కూడా పైపులైన్లు లేకపోవడం, నీటిసరఫరా వ్వవస్థ అస్తవ్యస్తంగా ఉండడం, కుళాయిలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో నీటి సమస్య మాత్రం తీరడంలేదు. జిల్లాలో 180 గ్రామాల్లో ఈ పరిస్థితి ఉందని చెబుతున్నా రక్షిత మంచినీటి పథకాలున్న 70శాతం గ్రామాల్లో 10 నుంచి 20శాతం గ్రామాల్లో మినహా అన్నిచోట్లా తాగునీటి సరఫరా వీధులన్నింటికీ వెళ్లడంలేదు. ప్రతిపాదనలకే పరిమితం జిల్లాలో దాహం కేకలు వినిపించకుండా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని గ్రామాల్లో పూర్తిస్థాయి రక్షిత నీటిసరఫరా చేయాలని అధికారులు భావించారు. ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టు కింద ప్రతిపాదనలు పంపాలని ఉన్నతాధికారులు ద్వారా సమాచారం రావడంతో ఈ మేరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రణాళిక తయారు చేయగా కలెక్టర్ వివేక్‌యాదవ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో 2560 గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరా చేసేందుకు తాగునీటి వనరులైన రక్షిత మంచినీటి పథకాల నిర్మాణం, పాత వాటి విస్తరణ కోసం రూ.1024కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనలు గతేడాది ఆక్టోబర్‌లోనే ప్రభుత్వానికి వెళ్లాయి. రెండు, మూడు నెలల్లో నిధులు మంజూరైతే పనులు ప్రారంభించి వేసవికి ముందే పనులు పూర్తి చేసి తాగునీటి సమస్య పరిష్కరించాలని భావించారు. కానీ ఐదు నెలలు దాటుతున్నా ఇంతవరకు నిధుల విషయమే చర్చకు రాలేదు. మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, ఇతర ఎమ్మెల్యేలు ఎవరూ దీనపి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. సర్కారు కూడా కనికరించలేదు. ఫలితంగా ఈ ఏడాది వేసవిలోనూ నీటి ఎద్దడి తప్పని పరిస్థితి నెలకొంది. నిధులు మంజూరైతే సమస్య తీరుతుంది జిల్లాలోని కొన్ని గ్రామాల్లో వేసవిలో తాగునీటి సమస్య ఉంటుంది. తాగునీటి సరఫరా అన్ని వీధులకు లేకపోవడంతో కొన్ని గ్రామాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. రక్షిత మంచినీటి పథకాలు లేని గ్రామాలున్నాయి. అలాంటి చోట బోరు నీరు బాగులేకపోతే సమస్య ఉత్పన్నమవుతోంది. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారానికి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులో నిధులకోసం ప్రతిపాదించాం. నిధులు విడుదలైతే పనులు పూర్తి చేస్తాం. ఆ తర్వాత అంతగా సమస్య ఉండదు. – ఎన్.వి.రమణమూర్తి, ఆర్డబ్యూఎస్ ఎస్ఈ -
దుప్పటికి నిప్పు, వృద్ధుడి సజీవ దహనం
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం చలిమంటలు అంటుకుని ఓ వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామానికి చెందిన అప్పలస్వామి(80) అనే వృద్ధుడు చలికి తట్టుకోలేక పూరిపాకలో కుంపటి పెట్టుకిని మంటలు వేసుకుని పక్కనే కూర్చున్నాడు. అయితే... ప్రమాదవశాత్తూ దుప్పటికి నిప్పు అంటుకుని మంటలు చెలరేగి సజీవ దహనమయ్యాడు. దాంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. -
లోయలో పడిన లారీ: ఇద్దరు మృతి
సాక్షి, విజయనగరం: ఒరిస్సా రాష్ట్రం కోరాపుట్ జిల్లా బందుగామ్ సమీపంలోని కుంబారిపుట్టి వద్ద ఓ లారీ లోయలో పడిపోయింది. ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ 40 అడుగుల లోయలో పడటంతో ఇద్దరు మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. రాయగడ జిల్లా టెక్కిరి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పెదబొండపల్లికి చెందిన వారు. మృతులలో ధాన్యం వ్యాపారి తవిటిరాజు, కళాసి అప్పలనాయుడు ఉన్నారు. డ్రైవర్ వెంకటేశ్వరరావుకు తీవ్రగాయాలు కాగా క్లీనర్ ఆచూకీ దొరకలేదు. బందుగామ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రిసార్టులో పోలీసు బాస్‌లు
సాక్షి, విజయనగరం: నాలుగు రాష్ట్రాల డీజీపీలు మంగళవారం ఉదయం రహస్యంగా సమావేశమయ్యారు. విజయనగరంలోని ఓ రిసార్టులో ఈ సమావేశం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల డీజీపీలు విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో గల ఓ ప్రైవేటు రిసార్టులో సమావేశమయ్యారు. అలాగే ఈ సమావేశానికి బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. నాలుగు రాష్ట్రాలు, వాటి సరిహద్దులోగల మావోయిస్టుల అణిచివేత, సాగర తీర భద్రతపై ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. కాగా... వీరి సమావేశాన్ని పోలీస్ శాఖ అత్యంత గోప్యంగా ఉంచింది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విషయంపై చర్చించనుండడంతో సమావేశాన్ని రహస్యంగా ఉంచినట్టు సమాచారం. -
పిడుగు పడి ఒకరు మృతి..
విజయనగరం: పొలంలో పనిచేస్తున్న దంపతులపై పిడుగు పడింది. ఈ ఘటనలో భర్త చనిపోగా భార్య పరిస్థితి విషమంగా మారింది. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం పూడివాణిపాలెం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కిల్లి అప్పాలు(55), అమ్మాయిలు(48) దంపతులు తమ పొలంలో పనిచేస్తుండగా ఆకస్మాత్తుగా వాన మొదలైంది. అదే సమయంలో పెనుశబ్ధంతో పిడుగు వారిపై పడింది. పెను షాక్‌కు గురైనా అప్పాలు అక్కడిక్కడే చనిపోగా అమ్మాయిలు తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
కోరం లేక పోయె.. టీడీపీ పరువు పాయే
విజయనరం : రాష్ట్రంలో అధికారం వారిదే... కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడా ఉందంటారు.. అంతేందుకు మొత్తం 40 మంది సభ్యులున్న మున్సిపల్ పాలకవర్గంలో 32 మంది సభ్యులు అధికార పార్టీకి చెందిన వారే.... అయినా మంగళవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశ నిర్వహణకు అవసరమైన కోరం (మొత్తంలో కౌన్సిల్ సభ్యుల్లో 1/3 వంతు సభ్యులు) లేకపోవడం గమనార్హం. తన వ్యవహారశైలితో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అధ్యక్షతన రూపొందించిన అజెండాలోని అంశాలను వ్యతిరేఖించిన సొంత పార్టీ కౌన్సిలర్లు సాధారణ సమావేశానికి హాజరుకాకుండా డుమ్మా కొట్టడంతో గట్టి ఝలక్ ఇచ్చినట్లైంది. చైర్మన్ తీరుతో మరో మారు సభ్యులు మధ్య విబేధాలు బహిర్గతకం కావడంతో టీడీపీ పరువు పోయింది. ప్రజా సమస్యలను ప్రస్తావించి, పరిష్కారానికి కృషిచేయాల్సిన కౌన్సెలర్లు సమావేశానికి డుమ్మాకొట్టడంపై జనం మండిపడుతున్నారు. అర్ధగంట సమయం నిరీక్షించినా 10 సభ్యులే హాజరు.. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్టు చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ కౌన్సిల్ సభ్యులతో పాటు అధికారులకు సమాచారం అందించారు. అజెండాలోని అంశాలను మూడు రోజుల ముందుగానే అందజేశారు. సమావేశం జరగాల్సిన నిర్ణీత సమయానికి సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లే డుమ్మా కొట్టడంతో కంగుతిన్నారు. మున్సిపల్ యాక్టు ప్రకారం 40 మంది సభ్యులున్న విజయనగరం మున్సిపాలిటీలో సభ నిర్వహణకు కోరంలో 14 మంది సభ్యులుండాలి. అయితే టీడీపీకి చెందిన 32 మంది కౌన్సిల్ సభ్యులు పాలకవర్గంలో ఉండగా... 10 మంది సభ్యులు మాత్రమే హాజరుకావడంతో సభ నిర్వహణకు అవకాశం లేకుండా పోయింది. దీంతో సభ్యుల కోసం సుమారు అర్ధగంట సమయం వేచి చూసిన అనంతరం 11 గంటల సమయంలో సభను మరో అర్ధగంట వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. చైర్మన్ వర్గీయులకు తప్పని తంటాలు.. సమావేశానికి అవసరమైన కోరం లేకపోవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చైర్మన్ ప్రసాదుల ఎలాగైనా సభ నిర్వహించాలన్న ఆలోచనతో అప్పటికే సభకు హాజరైన తన వర్గీయులతో మిగిలిన సభ్యులను రప్పించేందుకు నానా తంటాలు పడ్డారు. ఫోన్లో సంప్రదింపులు చేస్తూ సమావేశానికి రావాలంటూ వర్తమానాలు పంపించారు. చివరికి సమావేశ మందిరం నుంచి ముగ్గురు కౌన్సిలర్లు కార్యాలయం పోర్టికో వద్ద కాపు కాసి వచ్చిన సభ్యులను సవినయంగా సమావేశ మందిరంలోకి తీసుకెళ్లడం విశేషం. ఈ సమయంలో 38వ వార్డు కౌన్సిలర్ గార.సత్యనారాయణ, 40వ వార్డు కౌన్సిలర్ ఆల్తిరాధ, 10వ వార్డు కౌన్సిలర్ ఉండ్రాళ్ల వెంకటలక్ష్మిలతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న 8వ వార్డు కౌన్సిలర్ షేక్ షకిలా సభకు హాజరుకావటంతో చైర్మన్‌తో కలిపి కేవలం 15 మంది సభ్యులతో సభను ప్రారంభించాల్సి పరిస్థితి ఏర్పడింది. -
టీడీపీ అవినీతిని ఎండగడతాం
విజయనగరం : ప్రజాబలంతో అధికార టీడీపీ అవినీతి, అనైతిక చర్యలు ఎండగట్టాలని పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, శాసన మండలి సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. పూల్‌బాగ్‌లోని జగన్నాథ కల్యాణ మండపంలో పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, పార్టీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్లతో కలిసి మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాధనంతో అధికార టీడీపీ విజయవాడలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తే, కార్యకర్తల బలంతో అందుకు ధీటుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. జూలై 8, 9 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర ఫ్లీనరీకి జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలందరమూ కలిసి తరలి వెళ్దామన్నారు. ఈ నెల 24న భారీ స్థాయిలో నిర్వహించనున్న జిల్లా ప్లీనరీ సమావేశానికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు పలువురు రాష్ట్ర స్థాయి నాయకులు హాజరవుతారని తెలిపారు. అధికారం చేపట్టిన మూడు సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని ఆరోపించారు. జన్మభూమి కమిటీలు ప్రతిపనికి రేటును నిర్ణయించి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి మూడేళ్లలో ఒక్క ఇల్లు కూడా మంజూరుకాలేదన్నారు. పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ నేతలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని, నీరు–చెట్టు కార్యక్రమం నిధులు దోచుకుంటున్నారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా ప్లీనరీకి సంబంధించి స్థల పరిశీలన, పార్టీ బలోపేతం చేసే అంశంపై చర్చించామన్నారు. బూత్ కమిటీలు, మండల స్థాయి కమిటీల నియామకాలు త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు. జిల్లా ప్లీనరీలో ప్రధాన సమస్యలపై పలు తీర్మానాలు చేస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో 9 నియోజకవర్గాలు, రెండు ఎంపీ స్థానాలలో పార్టీ విజయఢంకా మోగించేలా పార్టీ శ్రేణులను మరింత ఉత్తేజపరుస్తామన్నారు. సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడుకొండ అప్పలనాయుడు, పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్, ఎస్.కోట నియోజకవర్గసమన్వయకర్త నెక్కల నాయుడుబాబు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
విజయనగరం: ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొని బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా కె.ఎల్.పురం బ్రిడ్జి సమీపంలో శనివారం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం పై ప్రయాణిస్తున్న లెంక మధు, వర్మ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఎల్.కె.వి. రంగారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాంపిల్స్ సేల్ చేస్తున్నారు
విజయనగరం : గంట్యాడ మండలానికి చెందిన ఓ మహిళ పట్టణంలోని ఓ ప్రైవేటు డాక్టర్ దగ్గరకు గైనిక్ సంబంధిత వ్యాధితో రెండు రోజులు క్రితం పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యునికి వద్దకు వెళ్లారు. అయితే ఆమెను పరిక్షించిన తర్వాత వైద్యుడు ఆమెకు అతని వద్ద ఉన్న శాంపిల్ మందులను ఇచ్చి రూ.200 తీసుకున్నారు. ఇటువంటి సంఘటనలు నిత్యం ప్రైవేటు క్లీనిక్‌ల్లో చోటుచేసుకుంటున్నాయి. ఉచితంగా ఇవ్వాల్సిన శాంపిల్ మందులను కూడ ప్రైవేటు వైద్యులు సొమ్ము చేసుకుంటున్నారు. కన్షల్టేషన్ ఫీజు, రూమ్ అద్దెలు, వైద్య పరిక్షలు ఫీజులు ఇలా అన్ని రకాల అమాంతం పెంచేసిన వైద్యులు మెడికల్ రిప్రంజెటేటివ్స్ ఉచితంగా శాంపిల్ మందులను, సిరప్‌లను కూడ అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. 300 వరకు ప్రైవేటు ఆస్పత్రులు జిల్లాలో 300 వరకు క్లీనిక్‌లు,నర్సింగ్ ఆస్పత్రులు ఉన్నాయి. అయితే వీరికి వారి కంపెనీ యొక్క మందుల ఏ మేరకు పనిచేస్తున్నాయో పరిశీలించాలని మందులను ఉచితంగా ఇస్తారు. వాటిని వైద్యులు రోగులకు ఉచితంగా ఇచ్చి వ్యాధి నయం అయినట్టు అయితే అమందులను మందుల దుకాణాల్లో కొనుగోలు చేసుకోవాలని ఆస్పత్రికి వచ్చే రోగులకు చెప్పాలి. కాని ఉచితంగా రోగులకు ఇవ్వాలని చెప్పిన మందులను కొంతమంది వైద్యులు కాసులు కోసం రోగులకు అమ్మేస్తున్నారు. శాంపిల్ మందులు ద్వారా ఆదాయం కన్షల్టేషన్ ఫీజుతో పాటు శాంపిల్ మందులను రోగులకు అంటగట్టి రోగులు నుంచి రూ.200 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో ఒక్కో వైద్యుడు రోజుకి వేలల్లో సంపాదిస్తున్నట్టు తెలిసింది. వైద్యులుతో పాటు కొన్ని మందుల దుకాణాల యాజమానులు కూడ మందులను విక్రయిస్తున్న ఆరోపణులు వినిపిస్తున్నాయి. వివరణ శాంపిల్ మందులు అమ్మకూడదు: శాంపిల్ మందులను అమ్మ కూడదు. ఎవరైనా శాంపిల్ మందులు అమ్మినట్టు అయితే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. వైద్యుడిగాని,మందుల దుకాణాల యాజమానులు గాని శాంపిల్ మందులు అమ్మకూడదు. - యుగందర్, డ్రగ్ఇనస్పెక్టర్ -
అంగన్వాడీలకు అండగా వైఎస్సార్సీపీ పోరాటం
విజయనగరం : అంగన్వాడీలకు అండగా వైఎస్సార్సీపీ పోరాడుతుందని ఆ పార్టీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీలను అరెస్ట్ చేయడం మంచి పద్దతి కాదన్నారు. ప్రభుత్వం జిల్లాలో పలు అంగన్వాడీలను, వీఆర్ఏలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరి అరెస్ట్‌లకు నిరసనగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోస్తామని ఆయన అన్నారు. (చీపురుపల్లి) -
విజయనగరంలో సినీ సంగీత విభావరి
విజయనగరం: విజయనగరంలోని ఎమ్మార్ లేడీస్ రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సినీ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. గాయని అంజనా సౌమ్య తన గాత్రంతో ఆహుతుల్ని అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జెడ్పీ చైర్మన్ జి.రాజకుమారి, ఎన్ఆర్ఐ డి.ఎస్.జానకి రాం హాజరయ్యారు. గాయని అంజనా సౌమ్యను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.