సాక్షి, విజయనగరం: ఒరిస్సా రాష్ట్రం కోరాపుట్ జిల్లా బందుగామ్ సమీపంలోని కుంబారిపుట్టి వద్ద ఓ లారీ లోయలో పడిపోయింది. ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ 40 అడుగుల లోయలో పడటంతో ఇద్దరు మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. రాయగడ జిల్లా టెక్కిరి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మృతులు విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పెదబొండపల్లికి చెందిన వారు. మృతులలో ధాన్యం వ్యాపారి తవిటిరాజు, కళాసి అప్పలనాయుడు ఉన్నారు. డ్రైవర్ వెంకటేశ్వరరావుకు తీవ్రగాయాలు కాగా క్లీనర్ ఆచూకీ దొరకలేదు. బందుగామ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment