రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
Published Sat, Jun 10 2017 12:10 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM
విజయనగరం: ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొని బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా కె.ఎల్.పురం బ్రిడ్జి సమీపంలో శనివారం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం పై ప్రయాణిస్తున్న లెంక మధు, వర్మ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఎల్.కె.వి. రంగారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement