
చెట్టుపై నుంచి దిగడానికి ఆపసోపాలు పడుతున్న విద్యార్థి
నెల్లిమర్ల రూరల్ : మండలంలో బొప్పడాం ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు వేపకొమ్మల కోసం పాఠశాలలో చదువుతున్న చిన్నారిని ప్రమాదకరంగా చెట్టు ఎక్కించారు. ఆ విద్యార్థి చెట్టునైతే ఎక్కగలిగాడు గానీ దిగేసరికి ఆపసోపాలు పడ్డాడు. ఈ దృశ్యం సాక్షి కెమోరాకు సోమవారం చిక్కింది. కార్పొరేట్‌కు పోటీగా ప్రభుత్వ విద్యను అందిస్తున్నామని ఓ వైపు చెబుతున్న ప్రభుత్వం పాఠశాలలో పిల్లలతో అంత పెద్ద వృక్షాన్ని కేవలం వేపకొమ్మల కోసం ఎక్కించడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రమాదవశాత్తు ఆ విద్యార్థి అదుపు తప్పితే బాధ్యత ఎవరు వహిస్తారు? బొప్పడాం ప్రధాన రహదారి పక్కన పాఠశాల ఉండటంతో పలువురు ఈ దృశ్యాన్ని చూశారు. సంబంధిత ఉపాధ్యాయుడిని సాక్షి వివరణ కోరగా పాఠశాలలో బియ్యం పాడవ్వకుండా ఉండేందుకు వేపకొమ్మలను తీసుకురమ్మని విద్యార్థికి చెప్పానని తప్పుగా అర్థం చేసుకోవద్దన్నారు.
Comments
Please login to add a commentAdd a comment