
మన సంప్రదాయాలలో ప్రతి ఒకటి అద్భుతమే,ప్రతి ఒక్కటీ జీవనవిధానానికి సంబంధించినవే. అందుకే చాలా ఆలయాలలో రావిచెట్టు, వేపచెట్టు ఉంటాయి, ఎక్కువ చోట్ల రావి, వేప చెట్లు కలిపి ఉంటాయి. రావిచెట్టును విష్ణు స్వరూపంగానూ, వేపచెట్టును లక్ష్మీస్వరూపంగానూ భావించి పెళ్లిళ్లు చేయిస్తుంటారు. అలా పెళ్లి చేసిన జమిలి వృక్షానికి భక్తితో ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇలా జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషాలు తొలగి సంసారం సజావుగా సాగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
అంతేకాదు, ఆ రెండు వృక్షాల మీదినుంచి వచ్చే గాలికి శారీరక, మానసిక రుగ్మతలను పారద్రోలే శక్తి ఉందని ఆధునిక పరిశోధనలు సైతం నిరూపిస్తున్నాయి. జోతిష శాస్త్రం ప్రకారం శనిదోషం పోవాలంటే ప్రతిరోజు రావిచెట్టు నీడన నిలబడటం, రావిచెట్టుకి నమస్కారం చెయ్యడం, రావిచెట్టుకు ప్రదక్షిణ చేయడం, శనివారం నాడు మాత్రం రావిచెట్టుని హత్తుకోవడం మంచిదని, ఈ విధంగా కొన్ని రోజులు చేస్తే శనిదోషం తొలుగుతుందట. రావిచెట్టు (Peepal Tree) నీడన కొంచం సేపు కూర్చుంటే రక్తపోటు సక్రమ రీతిలో ఉంటుందని, రావిచెట్టు గాలి మంచి ఆలోచనలు కలిగిస్తుందనీ చెబుతారు వైద్యులు.
అదేవిధంగా వేపచెట్టుకు కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వేప చెట్టు (Neem Tree) గాలికి అన్నో రోగాలను కలిగించే క్రిములు చచ్చిపోతాయి, అమ్మవార్లకు వేపాకు బాగా ఇష్టం. అందుకే జాతర్ల సమయంలో వేపాకు ఎక్కువగా వాడతారు.
చదవండి: బౌద్ద వాణి.. మీకూ, నాకూ అదే తేడా !
Comments
Please login to add a commentAdd a comment