మైసూర్‌లో శ్రీహరి సన్నిధి ప్రతిష్టించిన దత్త పీఠాధిపతి | Srihari Sannidhi Pratishta Program Was Held In Mysore With 2000 Salagrams, Rare In The World | Sakshi
Sakshi News home page

మైసూర్‌లో శ్రీహరి సన్నిధి ప్రతిష్టించిన దత్త పీఠాధిపతి

Published Fri, Dec 29 2023 12:41 PM | Last Updated on Fri, Dec 29 2023 12:47 PM

Srihari Sannidhi Pratishta Program Was Held In Mysore With 2000 Salagrams, Rare In The World - Sakshi

మైసూర్‌లో ప్రపంచంలోని అరుదైన రెండు వేల సాలగ్రామాలతో శ్రీహరి సన్నిధి ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అవధూత దత్త పీఠాధిపతి పరమ పూజ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. సాధారణంగా 100 సాలిగ్రామాలు ఉంటే ఆలయం నిర్మించాలని శాస్త్ర వచనం చెబుతుంది.

తాజాగా రెండు వేల సాలిగ్రామాలతో శ్రీహరి సన్నిధి ఆలయం అత్యంత శోభాయ మానంగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి స్వర్ణ యంత్ర ప్రతిష్ట చేసి, శిఖరానికి కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని,శ్రీహరి సన్నిధిని దర్శించుకొని మొక్కుల చెల్లించుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement